Kafeefi, Phalana Abbayi Phalana Ammayi’s fourth single, a vibrant, upbeat party number, unveiled

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి పెప్పీ నెంబర్ ‘కఫీఫీ’ విడుదల

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి ఫీల్ గుడ్ సినిమాలతో ఘన విజయాలను అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్  ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. కార్తికేయ-2, ధమాకా వంటి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. నాలుగు పాటలు, నేపథ్య సంగీతం కళ్యాణి మాలిక్ అందించగా.. ఒక పాట వివేక్ సాగర్ స్వరపరచడం విశేషం. కళ్యాణి మాలిక్ స్వరపరిచిన పాటల్లో ఇప్పటికే మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి.  ముఖ్యంగా ‘కనుల చాటు మేఘమా’ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన ‘కఫీఫీ’ పాట విడుదలైంది.

‘కఫీఫీ’ లిరికల్ వీడియోను బుధవారం ఉదయం విడుదల చేశారు మేకర్స్. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుండి ఇప్పటిదాకా విడుదలైన పాటలు హాయిగా, ఆహ్లాదకరంగా సాగే మెలోడీలు అయితే.. ఈ పెప్పీ నెంబర్ మాత్రం అందరిలో ఉత్సాహాన్ని నింపేలా ఉంది. ‘కఫీఫీ’ అంటూ అందరూ కాలు కదిపేలా అద్బుతమైన బాణీ సమకూర్చారు వివేక్. “నలుగురిలో ఉంటే.. చిలిపిగ పోతుంటే.. చనువుకి నో నో చెప్పేదే కఫీఫీ” అంటూ పాట సాగింది. పాట సందర్భానికి, బాణీకి తగ్గట్లుగా కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం అందంగా, అర్థవంతంగా ఉంది. “ఇది అది కాదంటూ.. వివరము వేరంటూ.. పరిమితిలోనే ఉంచేదే కఫీఫీ”, ” పరిధులు లేని వింత సహవాసం పరిగెడుతుంటే తగదుగా” అంటూ మళ్లీ మళ్లీ పాడుకునేలా క్యాచీ లిరిక్స్ తో లోతైన భావాన్ని పలికించారు. గాయకులు బెన్ హ్యూమన్, విష్ణుప్రియ తమ మధుర గాత్రంతో పాటను ఎంతో ఉత్సాహంగా ఆలపించారు.

‘కఫీఫీ’ సాంగ్ ఎంత ఎనర్జిటిక్ గా సాగిందో.. లిరికల్ వీడియోలో నాయకానాయికలు నాగశౌర్య, మాళవిక అంతకంటే ఎనర్జిటిక్ గా కనిపించారు. పబ్ లో జరుగుతున్న పార్టీలో స్నేహితులతో కలిసి నాయకానాయికలు ఉత్సాహంగా చిందేయడం అలరిస్తోంది. ముఖం మీద చిరునవ్వుతో ఇద్దరూ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి డ్యాన్స్ చేస్తున్నారు. పాటలోని ఉత్సాహాన్ని, నాయకానాయికలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ యశ్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ పాటకి థియేటర్లలో అద్భుతమైన స్పందన లభించడం ఖాయమనిపిస్తోంది.

నటీనటులు – నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్
నిర్మాతలు – టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,దర్శకుడు – - శ్రీనివాస్ అవసరాల
సహ నిర్మాత – వివేక్ కూచిభొట్ల
డీవోపీ – సునీల్ కుమార్ నామ
సంగీతం – కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
లిరిక్స్ – భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
ఎడిటర్ – కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్ – అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – సునీల్ షా, రాజా సుబ్రమణియన్
కొరియోగ్రాఫర్స్ – రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్ – శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్ – అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్ – హర్ష చల్లపల్లి
పీఆర్ఓ – లక్ష్మీవేణుగోపాల్

Kafeefi, Phalana Abbayi Phalana Ammayi’s fourth single, a vibrant, upbeat party number, unveiled

Phalana Abbayi Phalana Ammayi, a romance drama starring Naga Shaurya and Malvika Nair, directed by Srinivas Avasarala and produced by People Media Factory in collaboration with Dasari Productions, is releasing in theatres on March 17. While three songs composed by Kalyani Malik – Kanula Chatu Meghama, the title track and Neetho Ee Gadichina Kalam – were out recently, the fourth single, Kafeefi, which has music by Vivek Sagar, was out today.

Ben Human and Vishnupriya have crooned for the song written by Kittu Vissapragada. Kafeefi is a party number filmed at a pub on Naga Shaurya, Malvika, Sri Vidya, Abhishek Maharshi and others. While Kafeefi is a word sung by the lead pair on the stage initially, the crowds start finding it catchy and groove to it, much to their surprise.

After a series of warm melodies and a pathos number, Kafeefi lends a unique cosmopolitan flavour to the film’s album. The song is in the comfort zone of the composer, Vivek Sagar, known for his urban, peppy numbers with a catchy musical hook. The trendy orchestration is in sync with the vibe of the situation. Naga Shaurya and Malvika showcase their mettle on the dance floor and respond to choreographer Yash’s instructions with elan.

The opening lines ‘Nalugurilo unte..Chilipiga pothunte…Chanuvuki no no cheppede kafeefi’ have the lead pair elaborating on what kafeefi is all about – precisely, a person’s ability to draw a line even in tricky situations. The other stanzas in the song, with simple, relatable lyrics, emphasise several scenarios where the world around the couple misreads their equation, during which ‘kafeefi’ comes into play. Its happy-go-lucky spirit is sure to resonate with music buffs.

There’s a good buzz for Phalana Abbayi Phalana Ammayi ahead of its release this weekend. Right from the trailer to the teaser and the songs, the makers have promised a pleasant boy-meets-girl story spanning over a decade with stunning visuals, terrific performances and chemistry between the lead pair. Srinivas Avasarala, Megha Chowdhury, Ashok Kumar, Varanasi Soumya Chalamcharla, Harini Rao, Arjun Prasad, and others essay crucial roles in the film too.

 

DESIGN-2 DESIGN-1 DESIGN-3