Dec 7 2019
MISMATCH success meet
*పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ ‘మిస్ మ్యాచ్’ అంటున్నారు – హీరో ఉదయ్ శంకర్
- చిత్ర నిర్మాతలు శ్రీరామరాజు,భారత్ రామ్.
‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ బేనర్ పై ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా ‘డాక్టర్ సలీమ్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ మ్యాచ్’. డిసెంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో..కథా రచయిత భూపతి రాజా మాట్లాడుతూ – ” ఓ చిన్న సినిమాగా దీన్ని ప్రారంభించాం విడుదలైన తర్వాత పెద్ద చిత్రమైంది. రెండు కుటుంబాల జర్నీని తెలియజేస్తుంది. ఓ జంట స్వచ్ఛమైన ప్రేమ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపిందనేది ముఖ్య కథ. దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉందిమంచి కథా బలం ఉన్న సినిమా. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి” అన్నారు.చిత్ర నిర్మాత శ్రీరామరాజు మాట్లాడుతూ – “‘ మా బేనర్ లో తొలి చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని వర్గాల ఆడియెన్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. థియేటర్లో సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సమాజానికి అవసరమైన స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా. పూర్తిగా పాజిటివ్ కంటెంట్. కుటుంబంతో కలిసి చూసి ఎంకరేజ్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నా” అన్నారు. మిస్ మ్యాచ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. తనకు నచ్చిన వాడి ప్రేమను దక్కించుకునేందుకు ఒకమ్మాయి చేసే ప్రయత్నం ఆకట్టుకుంటోంది. గ్రామీణ యువతి రెజ్లింగ్‌లో ఒలంపిక్స్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవడం బాగుందని అంటున్నారు. ఉదయ్, ఐశ్వర్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అని చెప్పారు.
‘‘సినిమాకి కథే హీరో. మంచి కథ అందించిన భూపతి రాజా అసలైన హీరో. మహిళా సాధికారతని తెలియజేసిన ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. ఇప్పటికే సినిమాకి వస్తున్న స్పందన చాలా బాగుంది. రోజు రోజుకి పెరుగుతోంది. మరింతగా పెరగాలి’’ అని మాటల రచయిత రాజేంద్ర కుమార్ చెప్పారు.
దర్శకుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ – ” చిన్న సినిమాకి ఇంతటి స్పందన ని ఊహించలేదు. నా మొదటి సినిమాను కూడా బాగా ఆదరించారు. ఇప్పుడు రెండవ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కి పెద్ద థ్యాంక్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత జీవీజీగారికి, హీరో ఉదయ్ కి, ఐశ్వర్యకు, నిర్మాత శ్రీరామ రాజు గారికి ధన్యవాదాలు” అన్నారు..మీడియా, ప్రేక్షకుల ఆదరణ, మద్దతు ఉంటే చిన్న చిత్రమైనా ఎంత మంచి విజయం సాధిస్తుందో నిరూపణ అయ్యింది. మా మిస్ మ్యాచ్ చిత్రాన్నిమీరంతా సహకరించి విజయం చేకూర్చారు. అన్నారు.
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ – “ఈశుక్రవారం మూడు మ్యాచ్ లో గెలిచాం. ఒకటి ‘దిశ నిందితుల ఎన్‌కౌంటర్, రెండు టీమ్ ఇండియా క్రికెట్ లో గెలవడం, మూడు మా సినిమా పెద్ద సక్సెస్ కావడం. సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ’తొలిప్రేమ లోని ‘ఈ మనసే. పాటకి థియేటర్ లో అద్భుతమైన స్పందన కనిపించింది. మంచి మ్యూజిక్ అందించిన గిఫ్టన్ గారికి థ్యాంక్స్. అలాగే కెమెరా మెన్ గణేష్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు. సినిమాని థియేటర్లో చూసి మరింతగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గిఫ్టన్, నటులు శరణ్య, సంధ్య, వెంకట రామారావు, శ్రీ రామ్ బాలాజీ, కెమెరామెన్ గణేష్ తదితరులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.సమావేశం అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్.
The director NV Nirmal Kumar said that the Telugu audience had made his first film Doctor Salim a success and now that MISMATCH had received an overwhelming response , he was very happy .He thanked the producers and the rest of the technicians.
Music director Gifton Elias said that he was very happy with the response to the film and his musical score .The songs Arere Arere and Kannale Kannalu Ani as well as Ee Manase reprise had been well received, he expressed his thanks to the audience.
DOP Ganesh Chandrra said that the unit of the film was an excellent one.It was great that his debut movie in the Telugu Industry was successful.
The producer G Sriram Raju said that this was the first film under Adhiroh Creative Signs Banner and it was great that the audience had made their first endeavor a success. He thanked the media for their support and humbly requested the audience to come to the theaters to watch their film .