May 7 2013
Nikhil, Swathi Film News
‘నిఖిల్, స్వాతి’ జంటగా ‘మాగ్నస్ సినీ ప్రైమ్ ‘ చిత్రం.
విజయవంతమైన చిత్ర నాయకా, నాయికల జంటను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాల పట్ల ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపారవర్గాలలోనూ ఆసక్తి, ఉత్సుకత వాస్తవ దూరం ఏమీ కాదు. దీనిని నిజం చేస్తూ ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది.
యువ జంట ‘నిఖిల్,స్వాతి’ నటించగా ఇటీవల విడుదల అయిన ‘స్వామిరారా’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే. వీరిద్దరి తోనే శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
ధ్రిల్లర్ తో కూడిన వినొదాత్మక చిత్రం గా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. జూన్ నెల తొలి వారంలో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం; సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ; కధ- మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.