AMAT overseas by ‘fables cinema’

30 x 40 - 5amat overseas matter2 Sheet - 2

Dr.T.Subbaraamireddy foundation instituted national yashchopra award for LATAMANGESHKAR : 2013

imageyashchopraaward-latamangeshkarphoto tsr award matter photo (1)

ఉద్వేగభరిత ప్రేమకధాచిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’ : త్వరలో విడుదల

Anthaku-Mundu-Aa-Tarvatha-141 Anthaku-Mundu-Aa-Tarvatha-41 Anthaku-Mundu-Aa-Tarvatha-121 
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ  ఇంద్రగంటి దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని, త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత కె.ఎల్.దామో దర్ ప్రసాద్ తెలిపారు.
 ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ‘కల్యాణి కోడూరి’  వీనుల విందైన సంగీతాన్ని సమకూర్చారు.’అలా మొదలైంది’ లానే ఈ చిత్రం ఆడియో కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంది  అన్నారు, చిత్ర దర్శక,నిర్మాతలు. సుప్రసిద్ధ గీత రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాంలు ఈ గీతాలను రచించారు. తన సంగీత ప్రయాణంలో ఇదో మంచి చిత్రంగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి.
‘అంతకుముందు ఆ తరువాత’ ఓ ఉద్వేగభరిత ప్రేమ కధా చిత్రం’ అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. వాస్తవికత ఉట్టిపడే సన్నివేశాలు, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలు, అనుభవాల సమ్మిళితమే ఈ చిత్రం అన్నారాయన.
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో..రవిబాబు,రావురమేష్,ఉప్పలపాటి నారాయణరావు,అవసరాల శ్రీనివాస్,తాగుబోతు రమేష్, కల్యాణిమాలిక్, పమ్మి సాయి,సోహైల్,కె.ఎల్.ప్రసాద్, రోహిణి,మధుబాల,ప్రగతి,ఝాన్సీ,సుదీప,మాధవి,స్నిగ్ధ,అర్చన,అపర్ణ శర్మ నటిస్తున్నారు
.
సంగీతం: కల్యాణి కోడూరి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాం, గాయనీ గాయకులు: సునీత,హేమచంద్ర,కల్యాణి కోడూరి,స్రవంతి,శ్రీకృష్ణ,కాలభైరవ,కోగంటిదీప్తి, కెమెరా:పి.జి.వింద:ఎడిటింగ్; మార్తాండ్.కె.వెంకటేష్: ఆర్ట్;ఎస్.రవీందర్:నృత్యాలు;నోబుల్,సుచిత్ర,పాపి, కాస్ట్యూమ్ డిజైనర్స్:రాజేష్,భరత్:మేకప్;మోహన్: పబ్లిసిటి డిజైనర్:ఆర్.విద్యాసాగర్: ఫైనాన్స్ కంట్రోలర్: మాకినేని సర్వేశ్వరరావు: ప్రొడక్షన్ కంట్రోలర్:కె.శ్రీనివాసరాజు: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ముప్పాల హరికృష్ణ:: ఛీఫ్ కో డైరక్టర్: కొల్లి రాంగోపాల్ చౌదరి:
 
                  సహనిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి.వి 
                               నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్
                  కధ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

 Anthaku-Mundu-Aa-Tarvatha-25Anthaku-Mundu-Aa-Tarvatha-18

సెంటిమెంట్,వినోదాల మేళవింపు ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’

వినోదభరిత కుటుంబ కదా చిత్రంగా తాను కధానాయకునిగా నటిస్తూ,నిర్మిస్తున్న ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ వుంటుందని 
రాజ్ కుమార్అన్నారు. సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు ‘తార’ ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి పిక్చర్స్ పతాకం పై శ్రీమతి రమారాజ్ కుమార్ సమర్పణలో సకుటుంబ సపరి వార సమేతంగా చూడ తగ్గ చిత్రం గా ఈ ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం గురించి…
 IMG_3679
రాజ్ కుమార్ మాట్లాడుతూ..’ తాను లాయర్ గా రెండు భిన్నమైన పాత్రలను పోషించిన ఈ చిత్రం సకుటుంబ సపరి వార సమేతంగా చూడతగ్గ చిత్రమని అన్నారు. వ్రుత్తి జీవితంలో ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ కు ఎదురైన సంఘటనలు,సమస్యలు వాటి పర్యవసానం ఏమిటి ..? చివరకు ఏమి జరిగినదన్న అంశానికి వినోదాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది అన్నారు రాజ్ కుమార్. నటుడిగా తనను భిన్నమైన కోణంలో చూపించే చిత్రమని అన్నారు.
 
ఈ చిత్రం ద్వారా సీనియర్ నృత్య దర్శకురాలు ‘తార’ మాస్టర్ ను దర్శకురాలిగా పరిచయం చేయటం ఎంతో సంతోషం గా ఉందని అన్నారు. ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ పాత్ర తీరు తెన్నులను ‘తార’ మాస్టర్ తెర కెక్కించిన తీరు తెరపై చూడవలసిన దేనని తెలిపారు రాజ్ కుమార్.
 
ఓ మంచి కధా చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం కావటం ఎంతో సంతృప్తి గా ఉన్నదని దర్శకురాలు ‘తార’ అన్నారు.చిత్రంలో నాయకా.నాయికల పాత్రలు అభినయానికి ఎంతో అవకాశం ఉన్నవని అనారు. పాత్రల మధ్య భావోద్వేగాలు సన్నివేశాలను రక్తి కట్టించాయని తెలిపారు. ‘నృత్య దర్శకురాలిగా తనకున్న పేరును ఈ చిత్రం దర్శకురాలిగా మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు ‘తార’.
 
ఎం.ఎస్.నారాయణ.ఏవీఎస్.అనంత్,కిశోర్ దాస్. హేమ,అపూర్వ ల పాత్రలు ఎంతో వినోదాన్ని పంచుతాయని దర్శకురాలు తెలిపారు.అలాగే ‘సాకేత్’ సంగీతం ఆకట్టు కుంటుంది. కదానుగుణం గా సాగే వెంకట్ మాడ భూషి సంభాషణలు ఆలోచింప చేస్తాయి. ఎస్.వి.శివారెడ్డి చాయాగ్రహణ పనితనం ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి. 
 
ప్రస్తుతం డబ్బింగ్  కార్య క్రమాలు  పూర్తయ్యాయని, జులై నెలాఖరులో  ఆడియోను, ఆగస్ట్  నెలలో చిత్రాన్ని విడుదల చేసే దిశగా చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాత ‘వి.వి.రాజ్ కుమార్’ తెలిపారు.
 
అలంగ్రిత, అలియా త్రివేది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో లక్ష్మి,హేమ,అపూర్వ,ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్,అనంత్,మహర్షి,కిశోర్ దాస్,శ్రీరాం ,శశాంక్, సింగం మహేష్, టంగుటూరి రామకృష్ణ,రవిదాస్, వీడియోకాన్ రామ చంద్రారెడ్డి, ఆంజన్ బాబు, ప్రత్యేక పాత్రలో 20 సూత్రాల పధకం చైర్మన్ ‘ఎన్.తులసి రెడ్డి’ నటించారు. 
 
సాంకేతిక నిపుణులుగా..మాటలు: వెంకట మాడభూషి, సంగీతం; సాకేత్, పాటలు; భువనచంద్ర:,కెమెరా: ఎస్.వి.శివారెడ్డి, ఎడిటింగ్: గౌతంరాజు: ఆర్ట్ : రామకృష్ణ : ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యల్.వేణుగోపాల్ 
నిర్మాత: వి.వి.రాజ్ కుమార్ 
సమర్పణ: శ్రీమతి రమా రాజ్ కుమార్
కొరియోగ్రఫీ – దర్శకత్వం: ఎన్.ఏ.తార 

 

‘మొండోడు’ చిత్రం షూటింగ్ ముగింపు రోజు విశేషాలు

5 pressmeet-mondodu6 21 1 10 12 16 3 11 12