*జనవరి 19న వైజాగ్ లో ‘అల… వైకుంఠపురంలో’ వైభవంగా విజయోత్సవ వేడుకలు !!!*


*జనవరి 19న వైజాగ్ లో ‘అల… వైకుంఠపురంలో’ వైభవంగా విజయోత్సవ వేడుకలు  !!!*

‘అల… వైకుంఠపురంలో’ చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది.  విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు చేసుకుంది.. గతానికి భిన్నంగా ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు.
జనవరి 19న వైజాగ్ లో అల వైకుంఠపురంలో సక్సెస్ సెల్రబ్రేషన్ గ్రాండ్ గా చేయబోతున్నారు చిత్ర యూనిట్   హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి అల వైకుంఠపురంలో చిత్రాన్ని నిర్మించగా, త్రివిక్రమ్ తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ఈ ఇయర్ బిగినింగ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ఈ  ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రాన్ని.. సంక్రాంతి సంద‌ర్భంగా   2020, జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌ అయిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డుగా నమోదు వైపు దూసుకు వెళుతోంది.

Ala Vaikunthapurramuloo’s grand success celebrations in Vizag on January 19th

Allu Arjun’s Ala Vaikunthapurramuloo is going on a rampage at the box office. The film is doing extremely well across all circuits and it is putting up a good show in overseas and domestic market alike. On the joyous occasion, the movie unit is holding a grand success celebrations never.

Ala Vaikunthapurramuloo’s grand success celebrations will be held in Vizag on January 19th. Haarika Hassine creations and Geetha Arts bankrolled the film and Trivikram is at the helm. The film has Pooja Hegde in the lady lead role and had an excellent music album, which added huge buzz ahead of its release.

ss VERTICAL 3

Team #Nishabdham. #HappyMakarSankranti

  May this harvest season bring peace and happiness in all your lives – Team #Nishabdham. #HappyMakarSankranti
#AnushkaShetty @ActorMadhavan @yoursanjali @actorsubbaraju @hemantmadhukar #TGVishwaprasad @konavenkat99 @vivekkuchibotla @peoplemediafcy @KonaFilmCorp @GopiSundarOffl
Sankranthi - TELUGU Sankranthi STILL

‘ఆల..వైకుంఠపురములో’ ని అమూల్య పాత్ర తో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. – ‘అల వైకుంఠపురములో’ హీరోయిన్ పూజా హెగ్డే

“త్రివిక్రమ్ గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఆయన నుంచి నేను ఓర్పుగా ఉండటం నేర్చుకున్నా. ఏ సీన్ అయినా చాలా వివరంగా చెప్తారు. ఆఖరుకు పాటలో ప్రతి లైన్ అర్థాన్నీ చెప్తారు. ఆయన్లోని గొప్ప గుణం ఈగో లేకపోవడం” అని చెప్పారు పూజా హెగ్డే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుండు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో ఆమె కథానాయికగా అమూల్య పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో  పూజా హెగ్డే సంభాషించారు. ఆ విశేషాలు…

‘ఆలా వైకుంఠపురములో..’ ని మీ క్యారెక్టర్ కు మీరే డబ్బింగ్ చెప్పుకోవడం ఎలా అనిపిస్తోంది?
చాలా కష్టం. ఎందుకంటే తెలుగు నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్ పదాల్ని తెలుగులో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏదేమైనా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం నా పర్ఫార్మెన్స్ మరింత ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతోంది. డబ్బింగ్ కు సమస్య కాకుండా సీన్స్ తీసేటప్పుడు డైలాగ్ ఎలా చెప్పాలో నేర్చుకున్నా. ‘అల..వైకుంఠపురములో’ ని అమూల్య పాత్ర తో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు.

‘అరవింద సమేత’కు కూడా మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా? అప్పటికీ ఇప్పటికీ మీ డబ్బింగ్ లో వచ్చిన మార్పేమిటి?
తెలుగు లైన్స్ ను అర్థం చేసుకొని వాటిని ఎలా చెప్పాలో తెలుసుకుంటున్నా. ఓవర్ యాక్టింగ్ చెయ్యడం నాకిష్టం ఉండదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పడం వల్ల ఒక్కోసారి మనం ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపిస్తుంది. నేను పర్ఫార్మ్ చేసిన దానికి ఆ డబ్బింగ్ డిఫరెంట్ గా ఉన్నట్లు ఫీలవుతాను. కొంతమంది మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్స్ మన పర్ఫార్మెన్స్ ను తమ డబ్బింగ్ తో మరింత ఎలివేట్ చేస్తారు. వాళ్లను నేను గౌరవిస్తాను. ‘అరవింద సమేత’ రిలీజయ్యాక ఒకరు “ఈ సినిమాకు మీకెవరు డబ్బింగ్ చెప్పారు? నేను కూడా చెప్పించుకుందామని అనుకుంటున్నా” అని మెసేజ్ పెట్టారు. అది నా డబ్బింగ్ కు లభించిన పెద్ద కాంప్లిమెంటుగా భావిస్తాను. అంటే ఒక తెలుగు అమ్మాయిలా అందులో మాట్లాడగలిగానని సంతోషం వేసింది.

తెలుగు నేర్చుకోవడానికి ట్యూటర్ ని ఎవరినైనా పెట్టుకున్నారా?
లేదు. నా మేనేజర్ తో, నా స్టాఫ్ తో నేను తెలుగులోనే మాట్లాడుతాను. కోచింగ్ కు ఎవర్నీ పెట్టుకోలేదు. ఇలాంటి ఇంటర్వ్యూల్లో తెలుగులో మాట్లాడాలంటేనే నాకు కొంచెం భయం వేస్తుంటుంది.

మూడోసారి కూడా మిమ్మల్ని రిపీట్ చెయ్యాలనిపిస్తోందని అల్లు అర్జున్ చెప్పిన దానికి మీ స్పందన?
మేం ఇప్పటి దాకా రెండు సినిమాలు కలిసి చేశాం. దాంతో మామధ్య సెట్స్ పై కంఫర్ట్ లెవల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. అందుకే మామధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. అందువల్లే అల్లు అర్జున్ ఆ మాట అన్నారు. ఆయన అన్నట్లుగానే ఇద్దరం కలిసి మరో సినిమా చెయ్యాలని ఆశిస్తున్నా.

అమూల్య క్యారెక్టర్ చెయ్యడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏమిటి?
బేసికల్లీ ఐ లవ్ ద స్ర్కిప్ట్. త్రివిక్రమ్ గారు కథ చెప్తుంటే పడిపడి నవ్వాను. పాప్ కార్న్ తింటూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అవుతుందని అనిపించింది. అదివరకు త్రివిక్రమ్ గారితో చేసిన ‘అరవింద సమేత’ సీరియస్ సబ్జెక్ట్. అలాగీ దీనికి ముందు బన్నీ చేసిన ‘నా పేరు సూర్య’ కూడా సీరియస్ సబ్జెక్ట్. అందువల్ల ఫన్నీగా ఉండే ఈ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఈ సినిమాలో నాది స్ట్రాంగ్ క్యారెక్టర్ అనీ, అల్లు అర్జున్ కు బాస్ గా కనిపిస్తావనీ త్రివిక్రమ్ గారన్నారు. స్క్రిప్ట్ బాగా నచ్చడం, నాది బలమైన క్యారెక్టర్ అని ఆయన చెప్పడం వల్ల మరో ఆలోచన లేకుండా చెయ్యడానికి ఒప్పుకున్నా. అది స్ట్రాంగ్ క్యారెక్టర్ అని నేను నమ్ముతున్నా. బన్నీ క్యారెక్టర్ ఆలోచనాధోరణిని మార్చే క్యారెక్టర్. అలాగే ‘సామజవరగమన’ పాటను ఎంతో పొయెటిక్ గా తీశారు. హీరో పదే పదే నా కాళ్లను చూస్తుంటే, ఒకసారి పైకి చూడమని చెప్తాను. అప్పుడతను నా కాళ్ల మీద నుంచి దృష్టిని మరల్చి నా కళ్లవంక చూస్తాడు. అప్పుడు తన కొలీగ్స్ తో “ఫస్ట్ టైం మేడమ్ కళ్లు చూశాను. మేడమ్ సార్.. మేడమ్ అంతే” అని చెప్పే డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఐ థింక్ దట్ ఇట్ వాజ్ జస్టిఫైడ్. లంగా, చోళీలు వేసుకున్నప్పుడు నడుము చూపిస్తుంటారు కదా. అది ఓకేనా!

త్రివిక్రమ్ గారిని  గురూజీగా మీరు సంబోధించారు. ఎందుకని?
నేను వర్క్ చేసిన డైరెక్టర్లలో త్రివిక్రమ్ గారు చాలా కామ్ డైరెక్టర్. డైరెక్టర్ ఎనర్జీయే సెట్లో కనిపిస్తుంది. ఏ డైరెక్టర్ అయినా గట్టి గట్టిగా అరుస్తుంటే నేను భయపడతాను. ఎవరి వత్తిళ్లు వాళ్లకుంటాయి. సెట్లో డైరెక్టర్ నవ్వుతూ, ప్రశాంతంగా కనిపిస్తే, మన స్ట్రెస్ తగ్గిపోతుంది. తాను పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ని అని తెలిసినా, దాన్ని ఆయన బయట ప్రదర్శించరు.

అల్లు అర్జున్ గారితో  డాన్స్ చెయ్యడం కష్టమనిపించేదా?
ఈ మూవీలో నాకు డ్యాన్సింగ్ ఎక్కువ లేదు. అన్నీ సింపుల్ స్టెప్సే. రిహార్సల్స్ కూడా చెయ్యలేదు. కాబట్టి బన్నీతో మ్యాచ్ కావడానికి నేను కష్టపడలేదు. నేను కెరీర్ మొదట్లోనే హృతిక్ రోషన్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి గ్రేట్ డాన్సర్స్ తో చేశాను. ఇప్పుడు మళ్లీ హిందీలో హృతిక్ రోషన్ తో చేస్తున్నా. వాళ్లందరితో నేను డాన్సుల్లో మ్యాచ్ అయ్యానని అనుకుంటున్నా.

సినిమాలో మీ ఫేవరేట్ సీన్ ఏమిటి?
నిజానికి సినిమాలో  ’బుట్టబొమ్మ’ సాంగ్ లీడ్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బోర్డ్ రూమ్ సీన్ కూడా ఇష్టం. ఆ రెండూ చాలా ఫన్నీగా ఉంటాయి.

చాలామంది హీరోలతో పనిచేసినా బన్నీకి ఫ్యాన్ అని చెప్పారు. ఎందుకని?
నేను అతని వర్క్ కు అభిమానిని. అతనితో కలిసి పనిచెయ్యడాన్ని ఎంజాయ్ చేస్తాను. అలాగే ప్రభాస్ తో పనిచెయ్యడాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా.

ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటే, కష్టమనిపించడం లేదా?
నాలుగు సినిమాలు ఒకేసారి చెయ్యగల కెపాసిటీ నాకుంది. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇంకో రెండు సినిమాలు హిందీలో చెయ్యగలను. ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం. ఏదో ఒక భాషకే పరిమితం కావాలని నేననుకోవట్లేదు. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే, అక్కడ సినిమాలు చెయ్యాలనుకుంటున్నా.

తెలుగులో మీరు దాదాపు టాప్ హీరోయిన్. హిందీలో సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలు చేస్తున్నారెందుకని?
‘హౌస్ ఫుల్ 4′లో నేను చేసింది సెకండ్ హీరోయిన్ రోల్ కాదు. సగం అక్షయ్ కుమార్ తోటీ, సగం రితేశ్ దేశ్ ముఖ్ తోటీ చేశాను. నేను అప్పటి దాకా స్లాప్ స్టిక్ కామెడీ చెయ్యలేదు. అందువల్ల ఆ సినిమా చెయ్యడం గొప్ప అనుభవం. ఆ అనుభవం నాకు ‘అల వైకుంఠపురములో’ మూవీకి ఉపయోగపడింది. సీన్లో పది మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎలా మనం మన పాత్రను రక్తి కట్టించాలనేది ఆ సినిమాతో నేర్చుకున్నా. మీ లెక్కల ప్రకారం ఇప్పుడు నేను చేస్తున్నవేవీ సెకండ్ హీరోయిన్ రోల్స్ కావు. 2019లో నేను చేసిన పాత్రల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అవన్నీ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు. ‘గద్దలకొండ గణేశ్’లో నన్ను శ్రీదేవిలాగా అంగీకరించారు. ‘మహర్షి’లో కాలేజ్ స్టూడేంట్ గా, కార్పొరేట్ గాళ్ గా ఆదరించారు. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ బన్నీ బాస్ రోల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చెయ్యడం హ్యాపీ. వర్సటాలిటీ నా బలమని నమ్ముతాను.

విమెన్ సెంట్రిక్ రోల్స్ ఏమైనా వచ్చాయా?
తెలుగులో విమెన్ సెంట్రిక్ రోల్స్ తక్కువగానే ఉన్నాయి. ఒకటి అలాంటి స్క్రిప్ట్ వచ్చింది కానీ నేను సంతకం చెయ్యలేదు. ఏదైనా నాకు నచ్చి, నేను చెయ్యగలననిపిస్తే చెయ్యడానికి సిద్ధమే. ఒక నటిగా నన్ను మరో కోణంలో అది చూపిస్తుంది.

 

6R3B9866 6R3B9871 6R3B9876 6R3B9877

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. అలాంటి మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రం గారికి థాంక్స్. ఇది మా హ్యాట్రిక్ కాంబినేషన్. నాకు అర్థమవుతోంది.. ఇది మా కలయికలో ఒక కామా మాత్రమే.” అని చెప్పారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆయన నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా జనవరి 12న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్‌తో సంక్రాంతి విజేతగా నిలిచింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా.. హర్షవర్ధన్ మాట్లాడుతూ “ఒక ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నా. దేవుడు ఎదురుపడితే కోరుకోవడానిక్కూడా భయపడేంత గొప్ప సక్సెస్ ఈ సినిమాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా త్రివిక్రమ్ చేసిన సినిమాల్లో ఆయన ప్రతిభ కనిపిస్తే, ఈ సినిమాలో ఆయన దమ్ము కనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా చూపించారని యు.ఎస్. నుంచి ఫ్రెండ్స్ ఫోన్లు చేసి చెప్పారు. బన్నీ సినిమా సినిమాకీ ఎదుగుతున్నారు. ఈ మూవీలో అతను చేసిన పర్ఫార్మెన్స్ అద్భుతం” అన్నారు.

నవదీప్ మాట్లాడుతూ “మాకు సంక్రాంతి నిన్నే వచ్చేసింది. బన్నీతో పదిహేనేళ్ల ఫ్రెండ్‌షిప్‌లో నేను గమనించింది, తనకున్న బ్యాగ్రౌండ్‌ని అడ్వంటేజ్‌గా కాకుండా రెస్పాన్సిబిలిటీగా ఫీలయ్యే చాలామంది తక్కువ హీరోల్లో తనొకడు. ఒకరోజు గీతా ఆర్ట్స్ ముందు నుండి వెళ్తుంటే బయట చాలామంది ఉన్నారు. ఆరోజు బన్నీ పుట్టినరోజు కాదు, శిరీష్ పెళ్లి కూడా కాదు.. ఎందుకు ఇంతమంది ఉన్నారని చూస్తే, ప్రతి శుక్రవారం బన్నీతో ఫొటోలు దిగడానికి ఫ్యాన్స్ వస్తారని తెలిసింది. ఇంకెవరన్నా చేస్తారో, లేదో నాకు తెలీదు కానీ తను ప్రతివారం ఫ్యాన్స్ కోసం ఒకట్రెండు గంటలు కేటాయిస్తాడు. తనకు వచ్చిన గ్యాప్‌ని కసిగా ఎలా మలచుకున్నాడనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. బన్నీలో ఉన్న తపనలో ఒక్క శాతమన్నా అందరిలో ఉంటే బాగుంటుంది. ఈ సంవత్సరం నన్ను గీతా ఆర్ట్స్ వాళ్లు దత్తత తీసుకున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా ఈ బ్యానర్‌లో చేస్తున్నా. అవేమిటన్నది అరవింద్ గారు తర్వాత చెప్తారు” అని తెలిపారు.

రామ్-లక్ష్మణ్ మాట్లాడుతూ “మనిషికి గెలిస్తే ఓడిపోతానేమోననే భయం ఉంటుందంట. ఓడితే గెలుస్తానన్న ధైర్యం ఉంటుందంట. ‘నా పేరు సూర్య’ ఓటమి ఈరోజు గెలుపుకు కారణమని అల్లు అర్జున్‌కు మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ‘అజ్ఞాతవాసి’ తర్వాత.. ఏదో నేర్పడానికోసమే ఓటమనేది వస్తుందని త్రివిక్రం గారి వద్ద మేం తెలుసుకున్నాం. ఈ సినిమాలో ఫైట్స్ ఇంత బాగా రావడానికి కారణం మా ఫైటర్స్ కూడా. ఈ పండక్కి అన్ని సినిమాలూ మీవే అని అంటుంటే చాలా ఆనందం వేసింది. ఈ క్రెడిట్ మొత్తం మమ్మల్ని కన్న తల్లిదండ్రులకి, మాకు ఈ విద్య నేర్పిన రాజు మాస్టర్‌కి, చదువు సంధ్యలు లేని మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన కళామతల్లికి, మాకు ఈ శక్తినిచ్చిన భగవంతుడికి చెందుతుంది. ఒక మంచి శిష్యుడుంటే గురువుకి అందం, ఒక మంచి బిడ్డ ఉంటే తండ్రికి అందం. గొప్ప బిడ్డ ఉండటం అరవింద్ గారికి అందం. త్రివిక్రమ్ గారు మంచి మనసున్న డైరెక్టర్” అని చెప్పారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ సరదాగా “రాములో రాములా పాట హిట్టయ్యిందంటే కారణం బన్నీ అనుకుంటున్నారు. కాదు” అని తనేనన్నట్లు సైగ చేశారు. “నాకు గుండెకు సంబంధించి అనారోగ్యం కలిగినప్పుడు నన్ను పలకరించడానికి వచ్చాడు మిస్టర్ బన్నీ. ‘అంకుల్.. మీరు పర్ఫెక్టుగా ఉన్నారు.. రెస్ట్ తీసుకున్నాక మొట్టమొదట నా సినిమాలోనే మీరు చేస్తున్నారు’ అని చెప్పాడు. ఏదో ఎంకరేజ్ చెయ్యడం కోసం చెప్పాడేమో అనుకున్నా. తర్వాత త్రివిక్రమ్ గారొచ్చారు. కొంచెం సేపు మాట్లాడుకున్నాక ‘సార్.. మనం కలుస్తున్నాం.. వదిలెయ్యండి ‘ అన్నారు. వదిలెయ్యమన్నాడు కాబట్టి నేనూ వదిలేశా. సినిమా అయిపోవచ్చింది. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు.. ఈ సినిమాలో ఎలాగైనా బ్రహ్మానందం కనిపించాలని నాకు క్యారెక్టర్ ఇచ్చారు. మాట ఇచ్చి నిలబెట్టుకొనే వ్యక్తుల్లో ఈ ఇద్దరూ ఉంటారు. ఈ గుణం బన్నీకి మా గురువుగారు అల్లు రామలింగయ్య గారి నుంచి వచ్చింది. అన్నేళ్లు ఆయన ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా గడిపారు. నిబద్ధతతో ఉండే అద్భుత నటుడాయన. ఆయనను అద్భుతంగా ప్రేమించి, అభిమానించి, గౌరవించిన వ్యక్తి ఆయన కుమారుడు అరవింద్ గారు. ‘మా నాన్న ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను. ఇష్టమైతే నన్ను పెళ్లిచేసుకో, లేకపోతే లేదు’ అన్నాడు బన్నీ తన భార్యతో. దటీజ్ బన్నీ. నటుడిగా చెప్పాలంటే అతను ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఏ మనిషికీ ఊరికే పేరు రాదు, ఊరికే గొప్పవాడు కాడు. దాని వెనుక అతని కృషి వుంటుంది. అలాంటి సామర్థ్యమున్న నటుడు బన్నీ. రచయితగా త్రివిక్రమ్ గురించి చెప్పడం జగమెరిగిన బ్రాహడికి జంధ్యమేల.. అన్నట్లుంటుంది. మా కమెడియన్స్ అందరికీ ఆయన దగ్గరివాడు. తమన్ అద్భుతమైన ట్యూన్స్ కట్టాడు. ఈ సంక్రాంతి పండగ నుంచి ఉగాది పండగ వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది. తప్పదు” అని చెప్పారు.

సునీల్ మాట్లాడుతూ “త్రివిక్రమ్ కు లక్ష్మీ బాంబులు, చిచ్చుబుడ్లు, మతాబులనేవి ఇష్టముండదు. వేస్తే అణుబాంబు వేస్తాడు. అందుకే న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకొని వచ్చాడు. గ్రేట్ థింగ్స్, సింపుల్, యాక్షన్ స్పీక్స్ మోర్ దేన్ వోర్డ్స్ అనేందుకు నిదర్శనం ‘అల వైకుంఠపురములో’. పాతికేళ్ల క్రితం నన్ను దత్తత తీసుకున్న త్రివిక్రమ్ ఇప్పటికీ నాకు క్యారెక్టర్లు ఇస్తూ వస్తున్నాడు. ఒక డ్యాన్స్ బిట్‌తో, డైలాగ్స్‌తో అందరిలోకీ నేను వెళ్లాను. ఈ సంక్రాంతికి మలయాళంలోనూ నేను ఆర్టిస్టుగా పరిచయమయ్యాను, ఈ సినిమాతో. పదేళ్ల తర్వాత ఈ సినిమాతో సంక్రాంతికి మీముందుకు వచ్చినందుకు హ్యాపీగా ఉంది. నవదీప్ లాగానే నేను కూడా దత్తతకు రెడీగా ఉన్నానని అరవింద్ గారికి తెలియజేసుకుంటున్నా. అల్లు రామలింగయ్యగారితో కలిసి నటించే అదృష్టం నాకు దక్కింది” అన్నారు.

తనికెళ్ల భరణి మాట్లాడుతూ “ప్రస్తుతానికి ఇది అల మాత్రమే. తర్వాత ఇది ఉధృతంగా సముద్రమవుతుందని ఆ ఛాయలు మనకు తెలిసిపోతున్నాయి. ముందుగా ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్ పెట్టినందుకు, ఆ సారస్వతానికీ, ఆ లాలిత్యానికీ త్రివిక్రమ్ కు నమస్కారం చేస్తున్నా. వైకుంఠపురం ఆవల ఒక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఒక ఆటల తాంత్రికుడు బన్నీ, ఒక పాటల యాంత్రికుడు తమన్ ఉంటారు. ఈ సినిమాకి వెన్నెముక తమన్. ఈ సినిమా గొప్ప అనుభూతిని పంచింది. బన్నీ అలవోకగా డాన్సులు చెయ్యడం వెనుక ఉన్న కష్టం తెలిసింది” అని చెప్పారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “నలభై రెండు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ పండగలాగే రెండు సినిమాలతో మీ ముందుకు రావడం సంతోషం. ‘జులాయి’ నుంచి ఇదే కంపెనీ, ఇదే హీరో, ఇదే డైరెక్టర్.. ఇప్పుడు అల్లు అరవింద్ గారు జాయినయ్యారు. ఇలాంటి సినిమాలో రాజేంద్రప్రసాద్ ఉండాలి. జీవితంలో మేం జంధ్యాల గారిని కోల్పోతే, భగవంతుడు మాకిచ్చిన మరో వరం త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా సంథింగ్ స్పెషల్. ఇది మ్యూజికల్ హిట్. మా స్నేహితుడైన డ్రమ్స్ శివకుమార్ కొడుకు తమన్ ఇంత క్లాసీ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు నేనే చాలా గర్వపడుతున్నా. అందరం ఒక ఫ్యామిలీలా పనిచేశాం. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ సంథింగ్ స్పెషల్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇది నా జీవితంలో అతిపెద్ద పండగ” అని చెప్పారు.

సుశాంత్ మాట్లాడుతూ “నిజంగా ఈ జర్నీలో చాలా చాలా నేర్చుకున్నా. బన్నీ కెరీర్లోని బెస్ట్ పర్ఫార్మెన్స్‌లో ఇదొకటి. చాలా మెచ్యూర్డ్‌గా నటించాడు. ‘బుట్టబొమ్మ’ అన్న దానికి పూజ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా నాకిచ్చిన ఎనర్జీతో ఈ నెలాఖరుకి ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నా” అన్నారు.

తమన్ మాట్లాడుతూ “త్రివిక్రమ్ గారి రైటింగ్‌ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా విషయంలో నాపై చాలా బాధ్యతలు ఉన్నాయనిపించింది. త్రివిక్రమ్ ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తారు. బన్నీ గ్రేట్ డాన్సర్. అతనితో తొలిసారి ‘రేసుగుర్రం’కు పనిచేశాను. అతను చేసే హార్డ్‌వర్క్ అసాధారణం. లెజెండ్స్ ఉన్న ఇండస్ట్రీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. లావుగా ఉన్న నన్ను పరిగెత్తించి గెలిపించింది. ఈ సినిమా నిజంగా గెలిచింది” అని తెలిపారు.

పూజా హెగ్డే మాట్లాడుతూ “ఈ సినిమాతో త్రివిక్రమ్ గారికి పెద్ద ఫ్యాన్ అయ్యాను. దర్శకునిగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఆయనకు అభిమానిగా మారాను. ఆయన గురూజీ అంతే. హారిక అండ్ హాసిని వంటి బ్యానర్‌లో రెండో సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అల్లు అరవింద్ గారు సెట్‌కి వచ్చారంటే ఒక వెలుగు వచ్చినట్లుంటుంది. ఆయన బేనర్‌లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా. తమన్ ఇవాళ బిగ్ స్టార్ అయిపోయాడు. మెసేజెస్‌కు కూడా రెస్పాండ్ కానంత బిజీ స్టార్ అయ్యాడు. ఈ సినిమాకు ఆత్మనిచ్చాడు. అతనికి గోల్డెన్ పిరియడ్ నడుస్తోంది. రాం-లక్ష్మణ్ ప్రతి సినిమాకీ కొత్తగా ఫైట్లు ఇస్తుంటారు. వాళ్లు స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు. అల్ల్లు అర్జున్‌తో నన్ను రిపీట్ చేసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. ‘డీజే’ చేసినప్పట్నుంచీ బన్నీకి అభిమానినయ్యాను” అని తెలిపారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ “మా కుటుంబం ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుగు కళామతల్లికి ఒక రూపమిస్తే, ఆమె కాళ్లదగ్గర సేదతీర్చుకుంటున్న కుటుంబం మేం. అల్లు రామలింగయ్య గారి నుంచి మా అబ్బాయిల దాకా.. ఇన్నేళ్ల నుంచీ మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. త్రివిక్రమ్ గారు మాకు కథ చెప్పినప్పుడు సింపుల్ కథే అనిపించింది. కానీ తన స్క్రీన్‌ప్లేతో గొప్పగా తీర్చిదిద్దారు త్రివిక్రమ్. రషెస్ చూసి బన్నీ అలవోకగా ఆ క్యారెక్టర్ చేసిన విధానానికి ఆశ్చర్యపోయా. కానీ దానివెనుక ఉన్న కృషి నాకు తెలుసు. కలెక్షన్స్ పరంగా చూస్తే.. బన్నీ బెస్ట్, త్రివిక్రం బెస్ట్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ బెస్ట్స్‌లో ఒకటవుతుందని చెప్పగలను” అని చెప్పారు.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “సినిమాలో చున్నీ ఫైట్‌తోటే షూటింగ్ మొదలుపెట్టాం. అలా రాం-లక్ష్మణ్ మాస్టర్స్‌తో మొదలుపెట్టాను. వాళ్లతో ప్రయాణం నాకొక తాత్విక ప్రయాణం. ఈ సినిమాకు సంబంధించి రెండు విషయాలు దాచాను. ‘సిత్తరాల సిరపడు’ అనే శ్రీకాకుళం యాసతో నడిచే ఒక పాటని రాం-లక్ష్మణ్ మాస్టర్లతో కొరియోగ్రఫీ చేయించాను. దానికి వాళ్లు ఫైట్ చెయ్యలేదు. అందులోని ప్రతి లిరిక్‌ని అర్థం చేసుకొని ఒక కవితలాగా దాన్ని తీశారు. ఒక కొత్త ప్రయోగాన్ని నేను అనుకున్న దానికన్నా అందంగా తీశారు. ఆ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నాం. దాన్ని విజయకుమార్ రాస్తే, తమన్ మంచి ట్యూన్స్ కట్టాడు. అలాగే ‘రాములో రాములా’ పాటలో బ్రహ్మానందం గారిని ఉపయోగించుకున్నాం. మామీదున్న వాత్సల్యంతో ఆయన దాన్ని చేశారు. ఆయన సినిమాలో ఉన్న విషయాన్ని దాచిపెట్టడం చాలా కష్టమైంది. మొత్తానికి ఏనుగుకు విడుదల కలిగించాం. తనికెళ్ల భరణి నా మొదటి సినిమా నుంచీ కనిపిస్తూనే వస్తుంటారు. సునీల్ శక్తి సునీల్‌కు తెలీదు. మేం ఒక రూంలో కలిసున్నప్పుడు వాడు విలన్ అవుదామనుకున్నాడు. నేనేమో తెలుగు ఇండస్ట్రీలోని కామెడీ దిగ్గజాల్లో నువ్వూ ఒక దిగ్గజంగా నిలిచిపోతావని చెప్పా. అఫ్‌కోర్స్.. అప్పట్నుంచీ ఇప్పటిదాకా తను నా మాటల్ని నమ్మడం లేదు. ఎప్పుడు నమ్ముతాడో తెలీదు. పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు వచ్చాక ఇంకో 20 ఏళ్లకు నమ్ముతాడేమో. హర్షవర్ధన్, నేనూ రచయితలుగా జర్నీ మొదలుపెట్టాం. తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లోటు ఉంది. దాన్ని ఆయన పూడుస్తారనేది నా నమ్మకం. ‘జులాయి’ నుంచి నేను రాజేంద్రప్రసాద్‌తో పడుతూనే ఉన్నాను. ఇంకా ఆయన్ని భరిస్తూనే ఉంటాను. వజ్రం కఠినంగా ఉంటుంది. అలా అని కిరీటంలో పెట్టుకోవడం మానేస్తామా? రాజేంద్రప్రసాద్ కూడా అంతే. సుశాంత్ నన్ను కథ కూడా అడగలేదు. నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వద్దన్నాడు. తను చేసిన పాత్రను నిలబెట్టాడు. పూజ టైంకు వస్తుంది, క్యారెక్టర్‌ను బాగా అర్థం చేసుకుంటుంది, తెలివితేటలున్నాయి, అందంగా ఉంటుంది, అడిగినప్పుడు డేట్లిస్తుంది, ఈతరం అమ్మాయికి ప్రతినిధి కాబట్టే మళ్లీ రెండోసారి ఆమెను తీసుకున్నాను. ఐ రెస్పెక్ట్ హర్. ‘నేను నెగ్గేవరకు అయినట్లు కాదు’ అనేది తన వాట్సాప్ స్టేటస్. చాలా విషయాలు సినిమాటోగ్రాఫర్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌కు వదిలేశా. ఎడిటర్ నవీన్ గ్రేట్ జాబ్ చేశాడు. తమన్ ఇది బాలేదంటే, ఇంకోటి రెడీ చేసేవాడు. అందుకే సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ, ఓ మైగాడ్ డాడీ, అల వైకుంఠపురములో, సిత్తరాల సిరపడు వంటి ఆరు బ్లాక్‌బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా హిట్టనే ఫీలింగ్‌ని క్రియేట్ చేసిన తొలి వ్యక్తి తమన్. మా అందరి పనినీ సగం తగ్గించేశాడు. మిగతావాళ్లు తనకు మ్యాచ్ చేస్తే చాలన్నట్లు చేశాడు. చినబాబు, అల్లు అరవింద్ ల కుటుంబ సభ్యుడ్ని నేను. మీరు కలగనండి.. మేము రియల్ చేస్తామన్నారు వాళ్లు. ఈ సినిమాకు మొదలు, చివర బన్నీనే. ఇద్దరం బాల్కనీలో ఒక బ్లాక్ కాఫీ తాగుతూ ‘అల వైకుంఠపురములో’ జర్నీ మొదలుపెట్టాం. అప్పట్నుంచీ మా ఇద్దరికీ ఇదే ప్రపంచం. ఎంతో తపన ఉన్న నటుడు. బన్నీ మంచి డాన్సర్ అనే విషయం అందరికీ తెలుసు. చాలా అసాధరాణ స్టైల్ సెన్స్ ఉన్నవాడు. ఈ విషయం అందరికీ తెలుసు. చాలా గొప్ప నటుడు. ఇది నాకు తెలుసు, ఇంకా కొంతమందికి తెలుసు. అతనిలోని నటన అక్కడక్కడ గ్లింప్సెస్ మాదిరిగా ఇదివరకు కనిపించింది. మొదట్నించీ చివరి దాకా అతనిలోని నటుడు కనిపిస్తే ఎలా ఉంటుంది.. అనే నా కోరిక ఈ సినిమాతో తీరింది. బంటు అనే క్యారెక్టర్‌ను ముందుపెట్టి, తను వెనకాల ఉండటం మామూలు ప్రయోగం కాదు. ప్రతి షాట్‌కూ అతనెంత కష్టపడ్డాడో లొకేషన్లొ ఉన్న మాకు తెలుసు. దాన్ని ఈరోజు మీరందరూ గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూడగానే ఒన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ టిల్ డేట్ అని అతనికి చెప్పాను. మునుముందు అతను ఇంకా గొప్ప పర్ఫార్మెన్సెస్ ఇస్తాడు. సచిన్‌కు ఫుల్ టాస్ వేస్తె ఏం జరుగుతుందో, ఈ సినిమా బన్నీకి అంతే”

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఈ సినిమాతో ఎంటర్‌టైన్ చెయ్యగలిగే అదృష్టం ఇచ్చిన మొత్తం తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఏడాదిన్నర క్రితం జూలై 26న నేను ట్విట్టర్లో పెట్టిన ఒక మెసేజ్.. మై డియరెస్ట్ ఫ్యాన్స్.. థాంక్యూ ఫర్ ఆల్ ద లవ్. ఐ వాంట్ టు టెల్ ఆల్ ద పీపుల్ టు లిటిల్ పేషెన్స్ అబౌట్ నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్‌మెంట్. బికాజ్ ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ వైల్ మోర్. ఐ వాంట్ టు జెన్యూన్‌లీ డెలివర్ ఎ గుడ్ ఫిల్మ్. ఇట్ టేక్స్ టైం. థాంక్యూ ఫర్ అండర్‌స్టాండింగ్.. ఇవాళ సినిమా రిలీజైన తర్వాత ఒక వ్యక్తి నాకు పంపిన రిప్లైని భరణిగారు చదువుతారు” అని మైకు భరణికి ఇచ్చారు. భరణి “చెప్పి మరీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జీ” అని చదివి మైకు తిరిగి బన్నీకి ఇచ్చారు. బన్నీ కొనసాగిస్తూ “అది నాకు చాలా ఇష్టమైన త్రివిక్రమ్ గారి డైలాగ్. ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకూ, ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మీ లవ్ నాకు అందింది. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌తో ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఆయనతో కలిసి చాలా సినిమాలు చెయ్యబోతున్నా. నార్త్ ఇండియాలో నేను చేసే ఫైట్లు ఇష్ట పడతారు. నాకొచ్చిన యాక్షన్ ఇమేజ్‌కు కారణం రాం-లక్ష్మణ్ మాస్టర్స్. బ్రహ్మానందం గారు మా తాతయ్య గురించి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. సునీల్, నేనూ కలిసి చేసిన బోర్డ్ రూం సీన్‌కి థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. మా ప్రతి కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ అని ఆయన చెప్పిన మాట నిజం. వినోద్ సినిమాటోగ్రఫీ లేకపోతే సినిమాకు ఈ రేంజ్ ఉండేది కాదు. తమన్ మ్యూజిక్‌ని చాలా ఇష్టపడే ప్రేక్షకుడ్ని నేను. మా బావ (నవదీప్) బిగ్ బాస్‌లో ఉన్నా, పబ్‌లో ఉన్నా, షూట్‌లో ఉన్నా, సక్సెస్ పార్టీలో ఉన్నా, ఒక్కడే ఉన్నా, ఒకే వైబ్‌లో ఉంటాడు. హర్ష చాలా బాగా తన క్యారెక్టర్ చేశారు. రాజేంద్రప్రసాద్ గారితో వరుసగా మూడో హిట్టు కొట్టినందుకు హ్యాపీగా ఉంది. కథ వినకుండా ఓకే చేసిన సుశాంత్‌కు ఏదో ఒక స్కోర్ ఉండాలనుకున్నా.. క్లైమాక్స్‌లో ‘కొడితే ఫీలవుతారంకుల్’ అని చెప్పి నడుస్తుంటే అందరూ క్లాప్స్ కొట్టారు. నేనేం కోరుకున్నానో అది అతనికి వచ్చింది. ‘జులాయి’తో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ మొదలైంది. ఆ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చేశాను. పూజతో ‘డీజే’ చేసేప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తోంది, ఇంకో సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నా. బేసిగ్గా ఒక హీరోయిన్ని రిపీట్ చెయ్యాలంటే కొంచెం భయపడతాను. నేను 20 సినిమాలు చేశాను కాబట్టి, నేను పాత. కొత్త హీరోయిన్‌తో చేస్తే కొత్తగా కనిపిస్తాననేది నా ఫీలింగ్. అందుకే ప్రతిసారీ కొత్తమ్మాయిని పెట్టుకుంటూ ఉంటాం. కానీ రిపీట్ చేసినా బాగుంటుందనిపించిన మొదటి అమ్మాయి పూజ. ఈ సినిమా చేశాక మరోసారి రిపీట్ చేసినా తప్పులేదనిపించింది. ఎప్పట్నించో ఒక పెద్ద సినిమా పడాలనేది నా కోరిక. దాన్ని క్రియేట్ చేసేదెవరు అనుకుంటూ వచ్చాను. ఒక లార్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్క త్రివిక్రమ్ గారే మైండ్‌లోకి వచ్చారు. స్క్రిప్ట్ ఈజ్ ద కింగ్ అనే విషయంలో మరో మాట లేదు. ఆయన మైండ్‌సెట్ ఎలా ఉందో తెలుసుకుందామని కలిశాను. జెన్యూన్‌గా, సరదాగా ఒక సినిమా చేద్దామనుకున్నాం. ఆ జెన్యూనిటీకి జనం కనెక్టయ్యారు. నేను ఎన్నిసార్లు డీవియేట్ అయినా ఆయన ధైర్యమిస్తూ వచ్చారు.
డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మురళీశర్మ నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. అలాంటి ఆర్టిస్టుకి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పడటం చాలా ఆనందంగా ఉంది. ఆయన వల్ల నా పర్ఫార్మెన్స్ ఇంకా ఎలివేట్ అయ్యింది. ఒక ఇంటర్వ్యూలో నెపోటిజంపై నా అభిప్రాయం అడిగారు. దేవుడికి ఒక పూజారి కుటుంబం తరతరాలుగా తమ జీవితాన్ని ఎలా అంకితం చేస్తుందో, అలాగే మా కుటుంబం కూడా సినిమాకి మా జీవితాల్ని అంకితం చేసింది. మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, ఇప్పుడు నేను చేస్తున్నా. దీన్ని నెపోటిజం అనుకుంటే అనుకోండి. మేం ప్రజలకు వినోదాన్ని పంచడానికి వాళ్లకు సరెండర్ అయ్యాం” అని చెప్పుకొచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

 

ALA.. (1) ALA.. (2) ALA.. (3) ALA.. (4) ALA.. (5) ALA.. (9) ALA.. (10)

భీష్మ’ టీజర్ విడుదల

‘భీష్మ’

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం టీజర్ ఈరోజు ఉదయం విడుదల అయింది
చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం టీజర్ ను ఈరోజు విడుదల చేయటం జరిగింది. పూర్తి స్థాయి వినోద ప్రధానంగా ఈ చిత్రం ‘భీష్మ’ఉంటుంది అనటానికి ఈ టీజర్ ఒక శాంపిల్ మాత్రమే. దానికి తగినట్లుగానే చిత్రం  కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ  ఏడాది ఫిబ్రవరి లో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ  తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ ,డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్, ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.

SITHARA ENTERTAINMENTS
BHEESHMA Teaser ReleasedNithiin & Rashmika Mandanna  starring  “BHEESHMA”  film  written  & directed  by  VENKY KUDUMULA , Produced  by SURYA DEVARA NAGA VAMSI  under  SITHARA  ENTERTAINMENTS  are  released  TEASER on 12TH  JANUARY 2020  . Presently  team is busy  in wrap-up of final schedule. Speaking to media, producer  SURYA DEVARA NAGA VAMSI said  ,we are releasing  our teaser which  is small  sample for our huge entertainer.
Speaking to media director VENKY  said I am thankful to our handsome hero and cute heroine and  technical team  for their support in every situation.
And this teaser will entertain you to core and  I hope definitely you will like it.
Movie is going to hit the screens on  February 2020 .

Other Cast: NARESH, SAMPATH, ANANTH  NAG , JISSHU  SENGUPTA, ,  RAGHU BABU, BRAHMAJI, VENNELA KISHORE,                                      SUBHALEKHA SUDHAKAR,
NARRA SRINIVAS,  KALYANI  NATARAJAN , RAJSHRI  NAIR ,  SATHYAN ,  MIME GOPI , SATYA .
Music: MAHATI  SWARA SAGAR,
D.O.P: SAI  SRIRAM
Art director: SAHI  SURESH,
Editor:  NAVIN NOOLI
Co.director: SRI VASTAVA
Executive  Producer :  S.VENKATA RATHNAM (VENKAT)
stunts : VENKAT
Presents: P.D.V. PRASAD
PRODUCER: SURYADEVARA NAGA VAMSI
Story, Screenplay,  Dailogues,  Direction :  VENKY KUDUMULA
5I8A5883 5I8A1776