Panja Vaisshnav Tej and Aadikeshava team express great confidence on the film Release press meet EVENT


కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో కూడిన పూర్తి కమర్షియల్ చిత్రం ‘ఆదికేశవ’: చిత్ర బృందం

అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆనందించదగ్గ పక్కా కమర్షియల్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీ చేయడం కోసం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ‘ఆదికేశవ’. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రచార చిత్రాలు, జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచాయి. బుధవారం సాయంత్రం ఈ మూవీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ఆదికేశవ’ విశేషాలను పంచుకోవడంతో పాటు, సినిమా విజయం పట్ల నమ్మకం వ్యక్తం చేసింది. అనంతరం విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి సమాధానమిచ్చారు.

కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ, “ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు ఓ మంచి సినిమా చూశామనే ఆనందంతో థియేటర్ల నుంచి బయటకు వస్తారు. పతాక సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ఛాలెంజింగ్ గా అనిపించింది. టీం అందరం కష్టపడి పనిచేశాం. యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించాం. ఫైట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ ఉండవు. కొడితే పదిమంది ఎరిగిపోయే తరహా ఫైట్లు ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి. అవుట్ పుట్ మా అందరికీ చాలా బాగా నచ్చింది. సినిమా పట్ల టీం అంతా ఎంతో నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాం.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. విడుదలకు ముందురోజు సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నాం. మొదటి షో తిరుపతిలోని సంధ్య థియేటర్ లో మొదలవుతుంది. ముందు రోజే షోలు వేయాలని నిర్ణయం తీసుకున్నామంటే ఈ సినిమా పట్ల మేము ఎంత నమ్మకంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకి ఆదికేశవ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. సోషల్ మీడియా రీల్స్ లో కూడా ఈ సినిమాలోని పాటలు మారుమోగిపోతున్నాయి.” అన్నారు.

దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ, “కథ విని సినిమా చేయడానికి అంగీకరించిన వైష్ణవ్ గారికి, నాగవంశీ గారికి, చినబాబు(ఎస్. రాధాకృష్ణ) గారికి, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. ఓ కొత్త దర్శకుడిని నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. కొత్తవారికి ఇది అవకాశం ఇచ్చినట్లు కాదు.. జీవితం ఇచ్చినట్లు. జి.వి. ప్రకాష్ గారు అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారు. పాటలు అద్భుతంగా రాసిన కాసర్ల శ్యామ్ గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, అలాగే పాటలు కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు నేను రాసుకున్న యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఎడిటర్ నవీన్ నూలి గారు ఇంకా బెటర్ చేద్దాం అంటూ చివరి వరకు పనిచేస్తూనే ఉన్నారు. డీఓపీ డడ్లీ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి, డీఐ దగ్గరుండి చూసుకున్న ప్రసాద్ గారికి థాంక్స్. నాకు కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఇది కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ సరిగ్గా కుదిరిన కమర్షియల్ సినిమా.” అని అన్నారు.

నటులు జయప్రకాశ్, సుదర్శన్, రచ్చ రవి, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Panja Vaisshnav Tej and Aadikeshava team express great confidence on the film Release press meet EVENT

Panja Vaisshnav Tej is coming up with an action entertainer, Aadikeshava on 24th November, 2023. Latest sensation, Sreeleela is playing the leading lady role in the film. Suryadevara Naga Vamsi and Sai Soujanya are producing the movie on Sithara Entertainments and Fortune Four Cinema, respectively. GV Prakash Kumar composed music for the film. Joju George, Sudarshan, Aparna Das, Radhika Sarathkumar, Jayaprakash have played important supporting roles in the film. AS Prakash handled production design while Dudley handled cinematography. Navin Nooli is editing the film.

The makers have unveiled the theatrical trailer on 20th November and it has gone viral. They have decided to hold Pre-release press event before release on 22nd November. Panja Vaisshnav Tej, Sudarshan, Jayaprakash, Jabardasth Racha Ravi, director Srikanth N. Reddy and producer Suryadevara Naga Vamsi have attended the event.

At the event, dancers performed for the song, Sittharala Sithravathi. Post the performance, Raccha Ravi, Jayaprakash, comedian Mahendra gave speeches and thanked Srikanth, Naga Vamsi for the opportunity.

Sudarshan talking about the film shared a heart-warming story of the struggles he and director Srikanth N. Reddy faced over years. He thanked Srikanth for making a short film with him. He said, “In 2012, Srikanth met me and then made a short film with me. His short film has made me what I am today. He has been struggling over the years from 2012 and I am happy that he has finally become director.”

He further said, “In our first short film, he wrote thanks to Trivikram Srinivas and today, he got an opportunity to work in his production. I am happy for him. Panja Vaisshnav Tej garu will become an action hero with this film. Audience please watch on 24th November and you’ll enjoy for sure.”

Director Srikanth N. Reddy thanked Trivikram Srinivas, producer Suryadevara Naga Vamsi and Suryadevara Radhakrishna for the opportunity. He thanked Panja Vaisshnav Tej for believing a debutant and immediately accepting the story. He stated, “Trivikram Srinivas and Vamsi garu did not give an opportunity to a debutant but they have given a career and I cannot thank them enough.” He further thanked cinematographer Dudley for his continuous support. He also thanked DOP Sunny for his support.

He further thanked action choreographers Ram-Laxman for enhancing the stunts which come as part of the screenplay. He futher thanked GV Prakash Kumar for his blockbuster music and thanked lyricist Saraswathi putra Ramajogayya Sastry for writing two songs and being friendly with him. He thanked lyricist Kasarla Syam for writing Leelammo song, in one sitting at office in short time. He stated that editor Navin Nooli has been enhancing the content till the last minute. He thanked Prasad Murella for looking after DI. Srikanth also thanked AS Prakash for art direction. He looked overwhelmed by the situation and got emotional.

In the special AV played at the event, makers have showcased the important moments in the career of Panja Vaisshnav Tej. Mainly, Megastar Chiranjeevi remembering work with Vaisshnav in Shankar Dada MBBS and Andarivadu became major highlights. Also, his success and awards for Uppena have received great reception from audiences present at the event.

After this AV, Panja Vaisshnav Tej, director Srikanth and producer Suryadevara Naga Vamsi interacted with press and stated that they will give their speeches at Success meet post release. Producer Naga Vamsi talked to press stated that they are highly confident about the movie. He announced that Aadikeshava will have paid premieres on 23rd November.

He further stated that he will post details about pre-release premieres on 23rd November, early in the morning. He stated that as sentiment, Aadikeshava first premiere will be held at Tirupathi Sandhya theatre. He stated that he is highly confident and like he did for other three movies released by them this year, he is doing the same for this movie, too.

Panja Vaisshnav Tej stated that the movie will be different from his previous movies and he chose this subject for the same. He stated that he felt taxing to pull off climax action sequence but he is happy with the output. And he stated that the movie will have believable action sequences and great fun elements. He also stated that the movie will be pure commercial film with a new point.

Director Srikanth N. Reddy to the press stated that the movie has every commercial element in right amount. He stated that after watching the double positive and final cut, recently, he felt highly satisfied and confident about the box office success.

Suryadevara Naga Vamsi explained about absence of actress Sreeleela. He stated that they did not want to bring her to every movie function as it has become too common, these days, with her being part of too many movies. He jokingly stated that they wanted the movie to go as Vaisshnav Tej movie and not as Sreeleela movie. He firmly stated that youth will enjoy watching Sreeleela on big screen for sure.

He further asked media channels and websites to not give reviews on Friday but wait for 24 hours, if possible. He stated that he is highly confident about the movie, Aadikeshava and reiterated that the movie will be a blockbuster. He remarked that the buzz for the film has increased post the trailer release and expressed happiness that the songs have gone even more viral, now. As he went into a discussion about delaying reviews, he strongly stated that Guntur Kaaram will be a big blockbuster, no matter what.

Panja Vaisshnav Tej stated that he did not do this movie for the purpose of making a commercial movie. He reiterated that he loved the subject and it has a very fresh point in commercial space. He wished that the audiences will love the movie, Aadikeshava post release on 24th November, 2023 and will be a big success for him and the team.

 

DSC_3665 DSC_3668