Jul 22 2023
Pawan Kalyan-Sai Dharam Tej’s Bro trailer grandly launched across Telugu states, team promises a full-length entertainer in theatres
ఘనంగా పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’ ట్రైలర్ విడుదల.. థియేటర్లలో వంద శాతం వినోదం గ్యారెంటీ
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్ మరియు మై డియర్ మార్కండేయ, జానవులే పాటలకు వచ్చిన స్పందనతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేశారు. ఒకేసారి రెండు చోట్ల ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించడం విశేషం. వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో, హైదరాబాద్‌లోని దేవి థియేటర్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమాలు నిర్వహించారు. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, సముద్రఖని, ఎస్ థమన్ మరియు టీజీ విశ్వ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైజాగ్ జగదాంబ థియేటర్ లో జరిగిన వేడుకలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “మీ ప్రేమ పొందటం కోసమే ఇంత దూరం వచ్చాను. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం సంతోషంగా ఉంది. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అభిమానులకి ఏమైనా జరిగితే మేం తట్టుకోలేము” అన్నారు. అలాగే “నాకు కొంచెం తిక్కుంది” అంటూ తన మేనమామ పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ ని చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు సాయి ధరమ్ తేజ్.
ట్రైలర్ మిమ్మల్ని ఎంతగా అలరించిందో, దానికి వంద రెట్లు సినిమా అలరిస్తుందని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు.
హైదరాబాద్ దేవి థియేటర్ లో జరిగిన వేడుకలో సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. “చాలా మంచి సినిమా ఇది. సినిమా ఫలితం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. మీరు దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ గారు దేవుడిగా నటించిన సినిమా ఇది. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది.” అన్నారు.
ఈ సినిమా కోసం అందరిలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిదని కథానాయిక కేతిక శర్మ అన్నారు.
ట్రైలర్ కేవలం శాంపిల్ మాత్రమే అని, సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయని, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని సంగీత దర్శకుడు థమన్ అన్నారు.
తనకు జీవితంలో దేనికీ సమయం లేదంటూ ప్రతి దానికి కంగారు పడుతూ ఇంట్లోనూ, పని దగ్గర హడావుడిగా ఉండే సాయి ధరమ్ తేజ్ పాత్రని చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. కేతికా శర్మ అతని ప్రేయసిగా కనిపిస్తుంది. ఒక దుర్ఘటన మరియు సమయానికి ప్రాతినిధ్యం వహించే పవన్ కళ్యాణ్ రాక తర్వాత, అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది.
పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా, కూలీగా(తమ్ముడు చిత్రంలోని లుక్ ఆధారంగా) విభిన్న అవతారాల్లో కనిపిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ఎప్పుడూ అతని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. పవన్ కళ్యాణ్ ఎంతో సరదాగా గడుపుతుండగా, సాయి ధరమ్ తేజ్ మాత్రం గందరగోళంగా, కలవరపడుతున్నట్లు కనిపిస్తాడు. వారు ఎప్పుడూ కలిసి ఎందుకు కనిపిస్తారని చాలామంది ఆశ్చర్యపోతారు.
సాయిధరమ్ తేజ్‌కి గతంలోకి వెళ్లే అరుదైన అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం మరియు జీవితం, మరణం గురించి చెప్పిన మాటలు కట్టిపడేస్తున్నాయి. ఇందులో ఎమోషన్, కామెడీ, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. సాయిధరమ్ తేజ్‌ని ఆందోళనకు గురి చేసేలా అతని కుటుంబం చుట్టూ సంఘర్షణ జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
కింగ్ సినిమాలోని బ్రహ్మానందం యొక్క ఐకానిక్ డైలాగ్‌ను పవన్ కళ్యాణ్ రీక్రియేట్ చేయడం, జల్సా స్టెప్ వేయడం మరియు సాయి ధరమ్ తేజ్ తో కలిసి కాలు కదపడం వంటి అందమైన మూమెంట్స్ తో ట్రైలర్ ను ముగించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. అలాగే తనకు లిప్‌స్టిక్ రుచి కూడా తెలియదని పవన్ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ చెప్పడం నవ్వులు పూయించింది.
డ్యాన్స్ స్టెప్పులు, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఈ చిత్రం ప్రేక్షకులకు వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేస్తుంది. సముద్రఖని కథ విషయంలో రాజీ పడకుండా అభిమానులను మెప్పించేలా సినిమాను అద్భుతంగా రూపొందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్ మరియు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి ప్రధాన బలంగా నిలిచాయి.
జూలై 28న ప్రేక్షకుల కోసం వినోదభరితమైన విందు ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ కనిపిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ కనిపిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వీ రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: సెల్వ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
కో-డైరెక్టర్: బి. చిన్ని
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
Pawan Kalyan-Sai Dharam Tej’s Bro trailer grandly launched across Telugu states, team promises a full-length entertainer in theatres
People Media Factory, one of the leading production houses in Telugu cinema, is joining hands with ZEE Studios for Pawan Kalyan-Sai Dharam Tej’s Bro, written and directed by Samuthirakani. Trivikram pens the screenplay, dialogues for the film that hits screens on July 28.
The makers are immensely happy with the response to posters, promos, teaser and the songs My Dear Markandeya, Jaanavule. Ahead of its release, the trailer of Bro was launched today in Jagadamba theatre, Vizag and Devi theatre, Hyderabad amidst scores of fans and the team including Sai Dharam Tej, Ketika Sharma, Samuthirakani, S Thaman and TG Vishwa Prasad.
The trailer commences showcasing a workaholic Sai Dharam Tej, who claims he doesn’t have time for anything in life and is always in a hurry at home and at work. Ketika Sharma plays his love interest. After a mishap and the arrival of Pawan Kalyan, who represents time, his life takes a drastic turn.
He is seen in a variety of avatars as a security officer, as a coolie (based on Tammudu look), bespectacled look and Sai Dharam Tej constantly tries to run away from him. While Pawan Kalyan is absolutely having fun, the latter appears confused and disturbed. Many wonder why they’re seen together always.
Pawan Kalyan says Sai Dharam Tej has a rare gift of going back in time and a series of dialogues on life and death grab your attention. There’s a good dose of emotion, comedy, high voltage action sequences and it’s apparent that a conflict around his family in worrying Sai Dharam Tej.
The trailer ends with a bang as Pawan Kalyan recreates Brahmanandam’s iconic scene from King, does the famous Jalsa step and shakes a leg with Sai Dharam Tej. The latter says he doesn’t even know the taste of a lipstick and his verbal banter with Pawan Kalyan makes for hilarious viewing.
The film reminds audiences of vintage Pawan Kalyan with his dance moves, comic timing and dialogue delivery and Samuthirakani has packaged the film well to please his fans without compromising on the story. Trivikram’s dialogues, Sai Dharam Tej’s screen presence, the star studded lineup, the grand visuals and Thaman’s background score are the major highlights of the trailer. There’s no doubt that an entertaining feast is awaiting audiences on July 28.
“We are all here for your love. I am so glad you liked the trailer. We’ll meet in theatres soon,” Sai Dharam Tej said. Samuthirakani mentioned the film will be a festival for Pawan Kalyan, Sai Dharam Tej fans, calling it a privilege to direct the ‘Power Star’ and thanked the producers, team and the fans for their love. The producer TG Vishwa Prasad asserted that the film will satisfy all expectations on July 28.
Bro’s Nizam distributor Sasidhar Reddy, calling himself a Pawan Kalyan fan, expressed confidence about the film’s business prospects and said that the trailer hints at a blockbuster in the making. The co-producer Vivek Kuchbhotla mentioned Bro has all ingredients of a memorable film, where Pawan Kalyan plays a God, reminding fans that the pre-release event will be held on July 25. Ketika Sharma asked crowds to come to theatres with their families.
“This is just a sample. You had many iconic fights in Vakeel Saab, Bheemla Nayak and Pawan Kalyan has a lot of surprises to offer fans, he has put his heart and soul into Bro. He has danced like a dream, did comedy superbly and the introduction, interval and climax will give you goosebumps. This is a very emotional film. Sai Dharam Tej has delivered a lovely performance, Trivikram’s dialogues are an asset,” Thaman stated.
Pawan Kalyan plays the titular character (Bro), Sai Dharam is cast as Mark a.k.a Markandeyulu. Priya Prakash Varrier, Samuthirakani, Rohini, Rajeswari Nair, Raja, Tanikella Bharani, Vennela Kishore, Subbaraju, Prudhvi Raj, Narra Srinu, Yuva Lakshmi, Devika, Ali Reza and Surya Srinivas play key roles too. Sujith Vaasudev cranks the camera