Bro couldn’t have materialised without the magic touch of Powerstar, says director Samuthirakani

ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలలో ఇదే ఉత్తమ చిత్రం: 
-’బ్రో’ చిత్ర దర్శకుడు సముద్రఖని
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్  కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన దర్శకుడు సముద్రఖని, బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఒక చిన్న ఆర్టిస్ట్ గా మొదలై, ఇప్పుడు పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మీ ప్రయాణం గురించి చెప్పండి?
నేను ఏదీ ప్లాన్ చేయలేదు. దర్శకుడిగా ఇది నా 15 వ సినిమా. ఈ 15 సినిమాలకు నేనేది ప్లాన్ చేయలేదు. 1994 లో అసిస్టెంట్ డైరెక్టర్ గా నా ప్రయాణం మొదలైంది. అప్పటినుంచి నా పని నేను చూసుకుంటూ, జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాను. బుల్లితెర మీద నా ప్రతిభ చూసి ఎస్.పి. చరణ్ గారు నాకు మొదటి సినిమా అవకాశమిచ్చారు. మన పని మనం సరిగ్గా చేస్తుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. వచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.రీమేక్ చేయడానికి కారణం?
ఈ కథని అన్ని భాషలకు చేరువ చేయాలి. 12 భాషల్లో చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. వినోదయ సిత్తం చేయకముందు, తర్వాత ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. వినోదయ సిత్తం చేశాక జీవితంలో సగం సాధించామనే భావన కలిగింది. ఇక ఇప్పుడు బ్రో చేశాక ఇంతకంటే సాధించడానికి ఏంలేదు, ఇప్పటినుంచి జీవితంలో వచ్చేదంతా బోనస్ అనిపిస్తుంది.

పవన్ కళ్యణ్ గారు లాంటి బిగ్ స్టార్ తో సినిమా అంటే ఏమైనా ఆందోళన చెందారా?
అవన్నీ ఏం ఆలోచించలేదు. కాలమే అన్నీ నిర్ణయిస్తుంది. అప్పటికి వినోదయ సిత్తం విడుదలై పది రోజులే అవుతుంది. ఒక 73 ఏళ్ళ పెద్దాయన సినిమా చూసి బాగా ఎమోషనల్ అయ్యి, నా ఫోన్ నెంబర్ సంపాదించి మరీ నాతో మాట్లాడారు. అంతలా మనుషులను ప్రభావితం చేసే చిత్రమిది. త్రివిక్రమ్ అన్నయ్య సహకారంతో ఇక్కడ ఈ సినిమా చేయగలిగాను. నేను సినిమా కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ సంభాషణలు ఆయనకు బాగా నచ్చాయి. తమిళ్ లో చేసినప్పుడు కోవిడ్ సమయం కావడంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో నేనే నటించాను అని చెప్పాను. ఈ కథని ఎక్కువ మందికి చేరువ చెయ్యాలని, కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారు చెప్పగానే ఒక్కసారిగా మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో కొన్ని మార్పులతో చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. అలా కళ్యాణ్ గారికి కథ నచ్చడంతో వెంటనే సినిమా పని మొదలైంది. కాలమే త్రివిక్రమ్ గారిని, కళ్యాణ్ గారిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది.

ఈ సినిమాకి స్ఫూర్తి ఏంటి?
మా గురువు గారు బాలచందర్ గారితో కలిసి 2004 సమయంలో ఒక డ్రామా చూశాను. ఎలా ఉందని గురువుగారు అడిగితే, బాగుంది సార్ కానీ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తే బాగుంటుంది అన్నాను. అప్పటినుంచి ఆ కథ నాతో పయనిస్తూనే ఉంది. దానిని స్ఫూర్తిగా తీసుకొని 17 ఏళ్ళ తర్వాత సినిమాగా తీశాను. అదే వినోదయ సిత్తం. ఆ స్టేజ్ ప్లే రచయిత డబ్బు ఇస్తానన్నా తీసుకోలేదు. సమాజానికి మనం మంచి సందేశం ఇవ్వాలని ప్లాన్ చేస్తే, సమాజం మనకి మంచి చేస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది.

మార్పులు చేయడం వల్ల మాతృక స్థాయిలో బ్రో ప్రేక్షకులకు అనుభూతిని పంచగలదు అనుకుంటున్నారా?
ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. మాతృకలోని ఆత్మని తీసుకొని పవన్ కళ్యాణ్ గారి స్టార్డం కి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశాం. మాతృక కంటే గొప్పగా ఉంటుంది బ్రో.

మీరు రచయిత అయ్యుండి త్రివిక్రమ్ గారి సహకారం తీసుకోవడానికి కారణం?
నేను సమిష్టి కృషిని నమ్ముతాను. ఇక్కడ నేటివిటీ మీద త్రివిక్రమ్ గారికి ఉన్న పట్టు నాకుండదు. పైగా నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించడం నాకే ఆశ్చర్యం కలిగించింది. నేను ఆయనతో అల వైకుంఠపురములో నుంచి ట్రావెల్ అవుతున్నాను. కానీ ఆయనకు సునీల్ వల్ల నా గురించి ముందే తెలిసింది. శంభో శివ శంభో సమయంలో నా గురించి సునీల్ చెప్పేవారట. అలా దర్శకుడిగా త్రివిక్రమ్ నన్ను ముందు నుంచే నమ్మారు.

విజువల్ గా ఎలా ఉండబోతుంది?
విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. ఇది 53 రోజుల్లో చేశాం. కానీ విజువల్స్ చూస్తుంటే చాలా రోజులు చేసినట్లు ఉంటుంది. 53 రోజులు ఒక్క సెకన్ కూడా వృధా చేయకుండా పనిచేశాం. 150 రోజులు షూట్ చేసిన సినిమాలా అవుట్ పుట్ ఉంటుంది. ఇప్పటిదాకా నేను చేసిన 15 సినిమాల్లో ఇదే నా బెస్ట్ మూవీ. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ అన్నయ్య నాకు ఒక తండ్రిలా అండగా నిలబడ్డారు.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ ఎలా ఉండబోతుంది?
వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. మనం ప్రత్యేకంగా ఏం చేయనక్కర్లేదు. కెమెరా పెడితే చాలు, వాళ్ళు స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేస్తారు.

పవన్ కళ్యాణ్ గారి గురించి?
పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయన షాక్ అయ్యారు. అలా ఆయనను కలిసిన మూడు రోజులకే షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆయన సెట్ లో అడుగుపెట్టగానే మొదట ఏం జరుగుతుందోనని మొత్తం గమనిస్తారు. దర్శకుడిగా నేను ఎంత క్లారిటీగా ఉన్నాను అనేది ఆయనకు మొదటిరోజే అర్థమైంది. ఆయన ఈ సినిమా కోసం ఎంతో చేశారు. సమయం వృధా చేయకూడదని సెట్ లోనే కాస్ట్యూమ్స్ మార్చుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఉపవాసం చేశారు. ఎంతో నిష్ఠతో పనిచేశారు.

థమన్ సంగీతం గురించి?
థమన్ గురించి చెప్పాలంటే చెబుతూనే ఉండాలి. నేను తీసిన ఈ 15 సినిమాలలో మొదటిసారి థమన్ నేపథ్యం సంగీతం విని కంటతడి పెట్టుకున్నాను.

నిర్మాతల గురించి?
ఈ సినిమా విషయంలో నిర్మాతల సహకారం అసలు మర్చిపోలేను. సినిమాకి ఏది కావాలంటే అది సమకూర్చారు. వాళ్ళు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను.

Bro couldn’t have materialised without the magic touch of Powerstar, says director Samuthirakani

Much anticipated film Bro starring the Powerstar Pawan Kalyan and Sai Dharam Tej in the lead roles is the next big Tollywood film coming under the banner People Media Factory, one of the leading production houses in Telugu cinema.

During a press interaction, director Samuthirakani gives insights about working for Bro and how the bonding with Pawan Kalyan in the process changed his perspective about the star.

Starting as a character artiste in films, you have reached a stage where you got the golden chance to direct a big star like Pawan Kalyan. How do you see your graph?
Nothing has happened as per plan in my career (laughs). This is my fifteenth movie, I’ve not tried anything with a proper plan. I came to the film industry as an assistant director in 1994, and since then I started working on whatever came my way, that’s all. Hit or flop – I have the habit of taking both of them in a positive stride.

Have you first thought about doing a remake when the idea came to your mind?
The script ‘Bro’ doesn’t fall under the remake category. I want to make the film in 12 Indian languages. To make a film in the Tulu language, I would probably take artistes from that industry and make the film. It would cost around Rs 30 lakh. The budget varies from other industries. It is important how we take the content forward. Everything changed after I made ‘Vinodhaya Sitham’ and after ‘Bro’ I felt my purpose has been accomplished, and everything that comes with it is a bonus.

You became very emotional during the trailer launch event of Bro? What made you teary-eyed?
It’s been four since I heard the sound and cheers of the audience. Vinodhaya Sitham had no theatrical release. So we didn’t know the response of fans – how they took it. How much they enjoyed watching it. How they reacted, nothing… But, the response that has been coming for ‘Bro’ is something very phenomenal. After hearing the sound from the crowd, I assured myself that I am on the right track.

Were you tense while handling Pawan Kalyan?
No, nothing has made me tense. In fact, the project happened so magically. Probably 10 days after Vinodhaya Sitham got released, an aged business magnet from Madurai, who had watched my film, was lost in deep thoughts. Probably, he was numbed by the story’s philosophy. Since then he was eager to meet me but has no idea whom to approach. He came into contact with renowned Tamil poet and lyricist Vairamuthu. Through him, he happened to meet me. He had no words to describe his feelings about Vinodhaya Sitham. He was deeply touched by the story. He told me that his perspective of looking at this world has changed. Then I happened to discuss with Pawan Kalyan garu about the response that I got for Vinodhaya Sitham. And everything went very smoothly when he okayed the project.

What changes have you made for ‘Bro’?
In Vinodhaya Sitham, the story deals with the odds and challenges of a 50-year-old man and how he struggles in his life. But here in ‘Bro’ when I narrated the story Pawan Kayan garu, the end dialogue is what piqued the interest of the Powerstar. The characters speak Telugu when they’re alive on Earth. But on his departure, the character asks, “If the language is different in heaven, how can I communicate? I know nothing other than Telugu. Then Kalyan garu replies there is no language in heaven, everyone is equal. Then what’s the case with hell? Powerstar says, “I picked you up from there.” The message of the film – there’s no future, everything is in the present (now). So in just 10 minutes, the whole screenplay has been changed. We convinced Sai Dharam Tej to play the character of Mark. I have known Kalyan garu since the days of ‘Ala Vaikuntapuramulo’. My eyes still can’t believe that I have done a film with Powerstar. Every time I meet him, he says I can do it. He heard about me and my work from senior comedian Sunil who had worked with me for Shambo Shiva Shambo some 10 years ago. Sunil was a big actor back then. So I somehow managed him while filming it. So Powerstar trusted my work ethics and pushed me forward.

How do you define your travel with Trivikram garu?
Trivikram garu has a unique personality. More than a visual treat, the story will entertain audiences. I shot the film in 53 days. I didn’t even waste even a second. But it looks as if we shot the film for 150 days. In all 15 movies I helmed, Bro is the best that I could give. We face different situations in our lives, when Trivikram garu gave his hand, I felt as if my father walked in and rendered his hand as though to uplift me. Even Pawan Kalyan, whom I call Anna, came to me and said, ‘You didn’t break the trust that I kept in you’. I owe Powerstar anna for his truthfulness.

He further added, “We first thought of the name Chiranjeevi for Tej’s character. Later, Kalyan garu himself came up with “Markandeya”. And he said the name could be shortened to Mark.

Samuthirakani didn’t take much pain in handling both the actors – one a superstar and another an emerging talent. “Their chemistry on the screen is enough to tell the whole story. Nothing I had to do extra on the sets, just to fix the camera properly on them. We all know the role of time in our lives. How time plays with Mark is the story in Bro.

Bro has become a trendsetter by completing its shoot in very less time. Do you think the same could be applicable to other films?
It is completely based on the content. We can’t say such a script can be shot in this much time. No, it doesn’t work. Only content should decide. I was able to shoot Vinodhaya Sitham in just 19 days. With the same confidence, I could handle Kalyan garu.In the past, I was able to direct 3,000 episodes for the daily serial ‘Jhansi’. Senior yesteryear actress Radhika played the double role. She would come to the sets at 11 am. She would say she will leave by 3.30 pm. I used to request her since she had to play double roles in the film. I was very quick in completing the crucial portions. That helped me in my journey as a director.

In the latest interview, you said that Pawan Kalyan is not a State leader, he is a national leader. Can you elaborate on it?
Definitely, if I speak on the topic, I have so much about him. The entire day goes for it. In one of our conversations, Pawan Kalyan garu said that God is given two hands to every human being. One to feed your family, the other to the poor. That very thought has made me curious about Kalyan garu’s personality.

How satisfied were you working with music director S Thaman?
The first time when I saw S Thaman’s work of re-recording for Bro, tears rolled down my eyes. Thaman too broke down before me. He said the story is very close to his heart. He recalled his father who passed away when he was 11 years old. Usually, music directors were never with us during the release time. But S Thaman assured me that he would sit with me and ensure everything gets aligned.

 DSC_2174 (1) DSC_2168 (1)