‘Pindam’ is the film that we all did with so much passion: Hero Sriram

 

Subject: ‘Pindam’ is the film that we all did with so much passion: Hero Sriram

 

ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన అసలుసిసలైన హారర్ సినిమా ‘పిండం’ : కథానాయకుడు శ్రీరామ్
ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు శ్రీరామ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఒకరికొకరు సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి?
ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువగా ఇంటి భోజనం తింటుంటాను. బయటకు వెళ్ళినా ఎక్కువగా పప్పు, సాంబారు వంటి ఆహారమే తీసుకుంటాను. అలాగే ఉన్న దాంతో సంతృప్తి చెంది, ఆనందంగా ఉంటాను.
పిండం సినిమా గురించి చెప్పండి?
హారర్ సినిమాల విషయంలో నాకో భయం ఉంటుంది. అదేంటంటే పేరుకి హారర్ సినిమా అంటారు.. కానీ అందులో అనవసరమైన కామెడీ, రొమాన్స్, సాంగ్స్ ను ఇరికిస్తుంటారు. హారర్ జానర్ అంటే హారర్ ఉండాలి. థియేటర్ లో మనం చూసేటప్పుడు ఉలిక్కిపడేలా ఉండాలి. సాయికిరణ్ దైదా పిండం కథ చెప్పగానే నచ్చింది. కొత్త దర్శకుడు అయినప్పటికీ ఆయనకి ఎంతో క్లారిటీ ఉంది. సాయి కిరణ్ తీసిన స్మోక్ అనే షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన ప్రతిభపై నమ్మకంగా కలిగింది.  ఇన్ని రోజుల్లో, ఇంత బడ్జెట్ లో సినిమా పూర్తి చేస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే చేశారు. నిర్మాత యశ్వంత్ ఈ కథను నమ్మి సినిమా చేశారు. ఆ తర్వాత సినిమాని చూపించి బిజినెస్ చేసుకోగలిగారు. ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూసి అనుభూతి చెందాల్సిన అసలైన హారర్ సినిమా. ఈ కథ 1930, 1990, ప్రస్తుతం ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. ఒక ఇల్లు, ఒక కుటుంబం అన్నట్టుగా సినిమా ఉండదు. ఇందులో చాలా కథ ఉంటుంది. పిండం టైటిల్ తో కూడా కథ ముడిపడి ఉంటుంది.
హారర్ సినిమా కదా.. ప్రత్యేకంగా ఏమైనా హోంవర్క్ చేశారా?
ఏ సన్నివేశం చేసే ముందైనా మనం ముందుగా దానిని ఊహించుకోవాలి అని నమ్ముతాను. సంభాషణలను బట్టీ కొట్టి నటించడం నాకు ఇష్టం ఉండదు. సన్నివేశాన్ని అర్థం చేసుకొని, దానిని ఇమాజినేషన్ చేసుకొని.. అప్పుడు నటిస్తాను. దాని వల్ల నటన సహజంగా ఉండి, సన్నివేశం పండుతుంది. నేను దర్శకుల నటుడిని. ఆ సన్నివేశంలో దర్శకుడు ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
హారర్ జానర్ సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఉండరనే సందేహం కలగలేదా?
అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు రాత్రి అనే సినిమా తీశారు. నా దృష్టిలో ఇప్పటిదాకా తెలుగులో భయంకరమైన సినిమా అంటే అదే. ఆ సినిమాని ఎన్నో సార్లు చూశాను. పలు ఇంగ్లీష్ హారర్ సినిమాలు కూడా ఎన్నోసార్లు చూశాను. పిండం అనేది కేవలం హారర్ సినిమా కాదు. ఇందులో బలమైన కథ ఉంటుంది. హార్రర్ సన్నివేశాల ఉండటమే కాకుండా.. ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది సినిమా. నేను కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి థియేటర్ లో చూడాలని ఎదురు చూస్తున్నాను. టీమ్ అందరూ ఎంతో ఇష్టంగా పని చేసి, మంచి అవుట్ పుట్ ఇచ్చారు. మనం మంచి సినిమా తీస్తే, ప్రేక్షకులే తమ వాళ్ళని తీసుకొని మళ్ళీ సినిమాకి వెళ్తారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.
పిండం టైటిల్ గురించి?
కొందరు దీనిని నెగటివ్ టైటిల్ అంటున్నారు. పిండం అనేది నెగటివ్ టైటిల్ కాదు.. పాజిటివ్ టైటిల్. పుట్టుకలోనూ, చావులోనూ పిండం ఉంటుంది. తల్లి కడుపులో పెరిగే బిడ్డను పిండం అంటారు. అలాగే మనిషి చనిపోయాక వారి ఆత్మశాంతి కోసం పెట్టే భోజనాన్ని పిండం అంటారు. ఒకటి జీవితాన్ని ఇస్తుంది. ఇంకొకటి మరణం తర్వాత కూడా ఆనందాన్ని ఇస్తుంది.  అందుకే ఇది పాజిటివ్ టైటిల్. పైగా ఇది కథకి సరిగ్గా సరిపోయే టైటిల్.
మీరు కూడా గతంలో హారర్ సినిమాలు చేశారు.. వాటితో పోలిస్తే పిండం కొత్తగా ఉండబోతుందా?
మిగతా సినిమాలతో పోలిస్తే పిండం వైవిధ్యంగా ఉంటుంది. ఇది కొన్ని కుటుంబాల ప్రయాణం. ఇది కేవలం హారర్ మాత్రమే కాదు.. ఇదొక ఎమోషనల్ డ్రామా. ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది.
శ్రీనివాస్ అవసరాల గారు, ఈశ్వరీరావు గారి గురించి?
శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో నాకు సన్నివేశాలు లేవు. ఇది మూడు కాలాల్లో జరిగే కథ కదా. ఆయన వేరే టైం పీరియడ్ లో ఉంటారు. అయితే ఆయన నటించిన కొన్ని సన్నివేశాలను చూశాను. అద్భుతంగా నటించారు. ఇక ఈశ్వరీరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకసారి సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఆమె తలకి గాయమైంది. ఆలస్యమైతే గాయం వాచిపోయి, షూటింగ్ కి ఇబ్బంది అవుతుందని.. వేగంగా ఆమె సన్నివేశాలను పూర్తి చేసుకొని ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళారు. తన వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఆమె నిబద్ధతతో పని చేశారు. మిగతా నటీనటులు కూడా ఎంతో ఇష్టంగా పని చేశారు. చిన్న పిల్లలు కూడా అద్భుతంగా నటించారు. ఖుషీ రవి గారు అలా వచ్చి నిల్చుంటే చాలు పాత్రలో లేనమైనట్టు కనిపిస్తారు.
ఓటీటీ గురించి?
ఓటీటీ అనేది మన ప్రతిభను చూపించుకోవడానికి మరో వేదిక. అక్కడా ఎన్నో విభిన్న కంటెంట్ లు వస్తున్నాయి. నేను చేసిన రెక్కీ నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. అలాగే ప్రస్తుతం ఓటీటీ కోసం నెట్ వర్క్, హరికథ అనే ప్రాజెక్ట్ లు చేస్తున్నాను.
తదుపరి సినిమాలు?
నేను, జి.వి. ప్రకాష్ కలిసి తమిళ్ లో బ్లాక్ మెయిల్ అనే మూవీ చేస్తున్నాం. అలాగే సంభవం అనే ఇంకో సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి.
‘Pindam’ is the film that we all did with so much passion: Hero Sriram
The upcoming Telugu horror thriller ‘Pindam’ is slated to release in theatres worldwide on December 15. Directed by Saikiran Daida, the film features Srikanth Sriram, Kushee Ravi, Srinivas Avasarala, Easwari Rao, Ravi Varma. Other cast members include: Manik Reddy, Baby Chaitra, Baby Leisha, Vijayalakshmi and Srilatha in crucial roles.
The movie is produced by Yeshwanth Daggumati and co-produced by Prabu Raja. The story is written by Saikiran Daida, Kavi Siddhartha and Toby Osborne.
Actor Sriram, who is playing the protagonist in the film, interacted with the print/web journalists on Tuesday. Here are the excerpts.
How did the opportunity of Pindam come to you?
Pindam actually came to me during the latter part of the films that I have completed. Before Pindam I happened to do a film named ‘Inka Evaru’. Basically, when someone comes to me with a horror script, I am dead scared because when it is getting executed the story would be something else. There is an item song, two many monologues, double-meaning dialogues and other unnecessary stuff. If someone is making a crime thriller, he has to stick to the subject. But the story gets deviated and explores something else. But Pindam is truthful to its story. Horror genre is the only genre that can give the intensity to the audience. Pindam has the proper scare element to impress audiences. Every story needs a proper geography to tell a story. But it is also mandatory to keep in mind that where there is negative energy, evil spirits build a home. I will give a simple example, on Dec 22, 2003, I suffered a fire accident at Doddabetta dam near Ooty. I was supposed to dive into water that was 20 feet depth. Locals warned me not to dive, but the man who rescued me didn’t come out of the church for five days. He is an art assistant Manohar. He saw something very scary. Like plus and minus in mathematics, there is positive and negative energy in this world.
How confident are you about Pindam?
When I started my career, I didn’t have any market. Filmmakers wouldn’t have invested in me had they thought that I had no market or something else. Producer Yeshwant Daggumati has trust in the story. And he also has faith in the lead protagonist. Films keep coming every week, there was Animal that took the box office by storm, and Hi Nanna did well. Hope Pindam too will impress the audience in the coming week. I am confident that Pindam is going to give a proper theatrical experience to horror genre lovers. And the story has three different time frames: 1920, 1990 and 2023.
Unlike romcoms, horror films usually need different facial expressions and body language for horror films. Have you tried anything different from the usual?
Before going into the sets, as an actor I would imagine a sequence in my mind. I don’t by-heart the lines. I don’t have the habit of just rushing to the film sets without preparation. When you imagine a scene, you get the entire picture in your mind. Then you go and perform before the camera. That’s where you get to improvise yourself. I am directors’ actor. Pindam doesn’t boast about the scare element, it is also a content-driven film. The scariest movie that I have ever watched in Telugu was Ram Gopal Varma’s ‘Ratri’. I watched it multiple times. ‘Om’, and then ‘Evil Dead’ and now ‘Insidious’. If we see ‘Evil Dead’ now, you might wonder why you were so scared watching it when you were young. You have something called emotion in the film. ‘Pindam’ has the right connection that is required to pull audiences.
Q)What is the difference between Pindam and your comedy horror film Sowkarpettai that came in 2016?
This is a journey of multiple families. And the transition that takes place in their lives is all about the story of Pindam. Everything is interconnected. Pindam is not a negative title. It is a very positive thing. Fetus is Pindam. If a soul has to rest in peace, Pindam is offered. One is giving life, one is also giving happiness after death. This is an emotional drama. It is the story of the families who have faced such aspects in the past. Still there are people who loathe girl children. What is the point of going forward in our lives? There are people who still think with such backwardness.
For me, the most important aspect is the story. Good story is about a hero. In the story of Pindam, more than anyone else it is the children that drive the story forward. I play the role of Antony, a responsible father with three children who is burdened with family pressures. He is not a superhero. How he protects his family in the process of fighting against the evil in the story. Avasarala Srinivas plays a unique character who comes on the screen in a different time frame. I loved his work. Eshwari Rao garu in a particular scene. I was supposed to hit a man who caught the throat of Eshwari. Some intuition struck me and I cautioned Eshwari Rao garu that something untoward may happen. When we enacted the scene, I hit the man with a flower vase and one of the broken pieces hit Eshwar on the head. We rushed her to the hospital. So many challenges we had to face. Despite having suffered injury, she completed the shot and went to hospital. That is her commitment towards the craft. It is all done with so much passion. An actor actually improves competitiveness. All were good actors on the sets including Kushee Ravi. She doesn’t have to act in the scene. Just by standing in the frame, she appeared as if she performed a lot. I felt inferior by looking at her. Because she was already into the character.
Are you worried about being typecast in the industry?
Yes. Previously, I made the same mistake. One reason that an actor starts picking roles hastily is because of the remuneration or some obligation. We used to do it frequently. Now it is different. We made a point that now we should not get type casted by choosing characters as they come. We should be selective in terms of script.
You have a good lover boy image in Telugu cinema. Do you think playing the father role in Pindam would affect your chances in the future?
That phase of the lover-boy image faded long ago. I have a son who is as tall as me. So it is always good to play your age. We are only depicting the characters. The lover-boy image on the screen is a false thing. I am doing a film ‘Inka Evaru’ in which I am not playing a father. That has a different outlook. In another project, a web series titled ‘Network’, I have totally a different look. Then I am doing Navy Commander which has a different characterisation compared to Pindam.
Have you ever seen a ghost in real life?
I visited a place called Ghost Hunting in Scotland. I paid money to experience the ghost. It is considered as the most haunted place to visit in Europe. There was an incident that happened in the past where an entire village was buried alive because of a pandemic. If you go there, there is a road which leads to a cemetery. On one side there is a place for Jesus followers and there is another space for anti-Jesus followers. It gives an eerie feeling if you go from one end to the other. One should pay money to see a ghost. I waited all day and returned disappointed.
3323333 (5) 3323333 (4)