‘sardaar gabbarsingh’ audio

Hyderabad

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ సమర్పణలో కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, డైరెక్టర్స్ బాబీ, దేవిశ్రీప్రసాద్, ఎన్.టి.వి.అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి, నిర్మాతలు జెమిని కిరణ్, ఎ.ఎం.రత్నం, కబీర్ సింగ్, సాయిమాధవ్ బుర్రా, అనంత్ శ్రీరాం, సినిమాటోగ్రాఫర్ అర్థర్ విల్సన్, అండ్రూ, ఎడిటర్ గౌతంరాజు, రామజోగయ్య, అనంత్ శ్రీరాం, రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

థియేట్రికల్ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

బిగ్ సీడీని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఆడియో సీడీలను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తొలిసీడీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘’చాలాకాలం తర్వాత తమ్ముడు పవన్ కార్యక్రమంలో నేను పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ మధ్య సంవత్సరాలలో నేను ఎక్కువగా, రిపీటెడ్ గా చూసిన సినిమాయే ఏదైనా ఉందంటే గబ్బర్ సింగ్. గతంలో నేను కల్యాణ్ సినిమాలు చూశాను కానీ వేరే వ్యాపకం పెట్టుకుని చూసిన సినిమా గబ్బర్ సింగ్ కే జరిగింది. పవన్ కల్యాణ్ మాస్ ఎంటర్ టైనర్ ఆ చిత్రంలో అలరించాడు. ఇలా కదా పవన్ సినిమా ఉండాల్సింది. ఈరకంగా కదా అభిమానులు ఆయన అలరించాల్సింది కదా అని ముచ్చటపడి ఆ సినిమాలో ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తూ చూస్తాను. దబాంగ్ ట్రీట్ మెంట్ వేరు. కల్యాణ్ తనదైన స్టయిల్ లో మార్చుకుని చేసిన చిత్రం. ట్రెండ్ ను పవన్ ఫాలో అవ్వడు. ట్రెండ్ ను సెట్ చేస్తాడని గబ్బర్ సింగ్ తో ప్రూవ్ అయ్యింది. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం మరో ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పవన్ కల్యాణ్ మనసుకు దగ్గరైన సినిమా. కథ, స్క్రీన్ ప్లే తనది. డైరెక్టర్ బాబీ తన దర్శక ప్రతిభతో పవన్ కథను, కథాంశాన్ని తనదైన స్టయిల్ లో పవన్ ఇన్ పుట్స్ ను తీసుకుని అత్యద్భుతంగా తీశాడు. నేను ఈ సినిమా సెట్స్ కు వెళ్ళాను. డిఫరెంట్ గా అనిపించింది. షోలే చిత్రంలో రాంపూర్ గ్రామం సెట్ ఎలా అయితే కనిపిస్తుందో ఈ చిత్రంలో రతన్ పూర్ గ్రామం సెట్ అలా అనిపించింది. షోలే అప్పట్లో ఎలాంటి సంచలన విజయం సాధించిందో ఇప్పుడు ఈ చిత్రం మరో షోలే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ లో హ్యమన్ యాంగిల్, హ్యుమర్ యాంగిల్ ఉంది. ఈ సినిమాలో ప్రతి అంశం ఎంటర్ టైన్ చేసేలా ఉంటుంది. హ్యుమర్ టచ్ తో సినిమా సాగుతూ ఆద్యంతం అలరిస్తుంది. ఆడియెన్స్ ఎంత ఉత్సాహంగా ఈ సినిమా చూడాలని ఎదురుచూస్తున్నారో నేను అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను. కల్యాణ్ ఫ్యూచర్ డిసైడ్ చేసుకునే తరుణంలో ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. డైరెక్టర్ అవుతానన్నాడు. ఆ కోరిక తీర్చుకోవచ్చు కానీ మా అబ్జర్వేషన్ ప్రకారం తనని యాక్టర్ అవమని అంటే కన్విన్స్ అవడమే కాదు, తర్ఫీదు కూడా పొందాడు. కష్టపడి ఈరోజు ఇలా అందరితో ఆదరింపబడుతున్నాడు. పవన్ కల్యాణ్ ఎదుగుదలను చూసి మొదట గర్వపడేది మొదట నేను, తర్వాత నా తల్లిదండ్రులు. పవన్ రెండు, మూడేళ్లలో సినిమాలు మానేస్తానని చెప్పాడని నేను విన్నాను, ఎక్కడో కూడా చదివాను. ఆ నిర్ణయం కరెక్ట్ కాదు. పవన్ అన్నయ్యగా తనకు నేనిచ్చే సలహా ఏంటంటే ‘నువ్వు ఏ రంగంలో అయినా రాణిస్తావు. మంచి ఉన్నతులకు చేరుకుంటావు. అంతమాత్రాన ఇంత మందిని అలరించే సినిమా రంగాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు. నీ కెపాసిటీ నీకంటే ప్రేక్షకులకే బాగా తెలుసు. జోడు గుర్రాలపై స్వారీ చేసే కెపాసిటీ నీకుంది. ఇది నేను నీకిచ్చే సూచన కాదు. సలహా మాత్రమే. ఇంత మందిని నువ్వు డిసప్పాయింట్ చేయవని అనుకుంటున్నాను. అవకాశం ఉన్నంత వరకు జోడు గుర్రాల స్వారీ చెయ్..నీతో పాటు మేమంతా ఉన్నాం’ అంటున్నాను. నా మాట తను కాదంటాడని నేను అనుకోవడం లేదు. పవన్ ఈ సినిమాతో కనివినీ ఎరుగని రికార్డ్స్ క్రియేట్ చేయాలి. దాన్ని మరో హీరో బ్రేక్ చేయాలి. అలా రికార్డులు బ్రేక్ చేసుకునే ఆరోగ్యకరమైన పోటీ ఉంటే సినిమా పరిశ్రమ బావుంటుంది. పరిశ్రమ అత్యున్నత్త స్థాయి చేరుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. దాన్ని ఈ సినిమా దాటాలి. ఈ సినిమా రికార్డ్స్ ను మరోసినిమా క్రియేట్ చేయాలి. రికార్డ్స్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక సినిమాను మించి మరో సినిమా ఆడుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలి. ఇక బాబీ గురించి తెలుసుకుంటే తను పవర్ అనే సినిమాను చేశాడని తెలిసింది. నేను ఆ సినిమాను టీవీలో కూడా చూశాను. తన టాలెంట్ ఏంటో తెలిసింది. తన టాలెంట్ ను గుర్తించిన పవన్ ఈ సినిమాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో పవన్ వేసిన వీణ స్టెప్ కోసం నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. నిర్మాత శరత్ మరార్ మా కుటుంబానికి ఆప్తుడు. దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతలకు టైం ఇవ్వనంత బిజీగా ఉన్నాడు. నా నెక్ట్స్ సినిమాకు మ్యూజిక్ చేయమని నేను అడగటానికి కూడా టైంలేనంత బిజీగా ఉన్నాడు. చాలా హ్యపీగా ఉన్నాడు. తన ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. పవన్ కు హ్యాట్రిక్ ఇచ్చిన దేవి శ్రీ ఈ చిత్రంతో సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేస్తున్నాడు. సినిమా వందకోట్ల బిజినెస్ చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. హిందీలో 800 థియేటర్స్ సినిమా రిలీజ్ అవుతుంది. నార్త్, సౌత్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. యూనిట్ లో అందరికీ శుభాకాంక్షలు’’ అన్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘’నాకు హీరో అంటే చిరంజీవిగారే. అమితాబ్ బచ్చన్ అంటే పిచ్చి ఇష్టముండేది. అన్నయ్య హీరో అయిన తర్వాత ఆయనే నాకు కనిపించాడు. ఈరోజు నేను యాక్టర్ గా మారి మీ ముందున్నానంటే కారణం అన్నయ్య వదినలే కారణం. ఎవరైనా అతిథులు వస్తే ఇంట్లో దాక్కునేవాడిని. అలాంటి నన్ను మీ మధ్యలోకి నెట్టేశారు. నాకు అన్నయ్యంటే ఎంతిష్టమో బయటెందుకు చెప్పుకోవాలని అనుకుంటాను. నేను ఇంట్లో కూర్చొని ఏ పనిచేయకుండా తింటుంటే అన్నయ్య రాత్రిపగలు కష్టపడి, కంఫర్ట్ బుల్ షూస్ లేకపోయినా అవి వేసుకోవడంతో కాళ్లు వాచిపోయేవి. నేను అన్నయ్య దగ్గరకెళ్ళి షూ తీసినప్పుడు ఆ చెమటలో నాకు ఓ వ్యక్తి తాలుకు సువాసన కనిపించేది. నాలాంటి వాడికి సినిమాల్లో రావడం తేలిక. ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి అందరికీ ఆదర్శవంతంగా, స్ఫూర్తిగా నిలిచారు. ఒక ఆలోచన, ధ్యేయాన్ని అనుకుంటే సాధించగలరని అన్నయ్యను చూసి తెలుసుకున్నాను. ఆయన నాకు అన్నయ్య కంటే స్ఫూర్తినిచ్చిన మహావ్యక్తి. సినిమాల్లో యాక్ట్ చేయాలని లేదు. కథలు చదవడం ఇష్టం. నన్ను సినిమాల్లో యాక్ట్ చేయమంటే ఆయనకు చెడ్డ పేరు తీసుకురాకూడదని ఒళ్లు దగ్గర పెట్టుకుని ఎక్కువగా పనిచేయాల్సి వచ్చింది. అన్నయ్యతో పాలిటిక్స్ పరంగా ఆయనకు నచ్చనివి చేశాను. అదెందుకు చేశానో ఆయనకు చెప్పాను. ఆయన అర్థం చేసుకున్నారు కూడా. మా బంధం వేరు. రాజకీయాలు వేరు. అవి రెండు దారులు. నేను అన్నయ్య పంథాలో లేకపోయినా ఆయనంటే ఎంతిష్టమో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నేనెంత నిలబడగలనో నాకు తెలుసు. నా తల్లిదండ్రుల తర్వాత అన్నయ్య వదినలే తల్లిదండ్రులు. అన్నయ్యకు కమర్షియల్ సినిమాలంటే ఇష్టం. అన్నీ ఉంటూనే అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఉండాలనుకుంటారు. అలాంటి సినిమా ఇది అవుతుందని నేను అనుకుంటున్నాను. అందకే ఈ వేడుకకు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాను. ఈ చిత్రంతో జానీలా డిసప్పాయింట్ చేయనని నమ్మకం ఉంది. నేను సినిమాల్లోకి రాకముందు ఖమ్మంకు బార్డర్ కు వెళ్లాను. అక్కడ ఇప్పటి చతీస్ గడ్ కూడా టచ్ అవుతుంద. ఆప్లేస్ చూడగానే ఇక్కడ ఓ లవ్ స్టోరీ చేస్తే బావుంటుందనిపించింది. తర్వాత ఆ ఆలోచనను వదిలేశాను. కౌబోయ్ తరహాలో ఉండి మనకు దగ్గరగా ఉండేలా సినిమా చేయాలనుండేది. ఈ స్క్రిప్ట్ రాయడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఇంత టైం నన్ను భరించిన శరత్ మరార్ కు థాంక్స్. ఈరోస్ సంస్థ సునీల్ లుల్లా గారికి థాంక్స్. కాజల్ పెర్ ఫార్మెన్స్ బావుంది. నాతోటి నటీనటులకు, టెక్నిషియన్స్ కు థాంక్స్. సినిమా ఏప్రిల్ లో విడుదల కావాలని నేను నిద్రపోలేదు. 50 రోజుల పాటు అందరినీ ఏడ్పించేశాను. డైరెక్టర్ బాబీ సహా అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. బాబీకి థాంక్స్. కథాంశం చతీస్ గడ్, మనకు దగ్గరకగా ఉండే కథ కాబట్టి ఈ సినిమాను సునీల్ లుల్లాగారు హిందీలో రిలీజ్ చేస్తామన్నారు. అంతే తప్పు ఏ సినిమాకు పోటీగా ఆలోచించలేదు. అందరం బావుండాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారుSardaar Gabbar Singh Audio ,,,,,, (34) Sardaar Gabbar Singh Audio ,,,,,, (72) _DSC7420 _DSC7437 _DSC7444