Sithara entertainments released a video on the occasion of siddu jonnalagadda’s birthday.

 


‘సిద్దు’ కోసం వీడియో విడుదల చేసిన ‘సితార ఎంటర్టైన్ మెంట్స్:

*సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం.
*కథానాయకుడు ‘సిద్ధు జొన్నలగడ్డ‘ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వీడియో విడుదల చేసిన చిత్రం యూనిట్.
* హైదరాబాద్ లో  ‘నరుడి బ్రతుకు నటన’  చిత్రం షూటింగ్

టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా,‘నేహాశెట్టి‘ నాయికగా    ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే.’కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి రచయిత గానూ,దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి.
నేడు చిత్ర కథానాయకుడు ‘సిద్ధు జొన్నలగడ్డ‘ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల తో కూడిన వీడియోను విడుదల చేసింది చిత్రం యూనిట్. ఈ వీడియో, అందులోని ఆసక్తికరమైన సంభాషణ ఏమిటో పరికించి చూస్తే అర్థమవుతుంది ఇది ఖచ్చితగా విభిన్న కథాచిత్రమని. ఇందులో కథానాయకుడు సిద్ధు ఎవరితోనో సంభాషణ ఈ విధంగా సాగుతుంది…..
”అరె సత్తి షోల్డర్ మసాజ్ చెయ్యరా…
సాయంత్రం సాంగ్ లాంచ్ ఉన్నది
పార్టీలోన… జిమ్ కొడుతున్నట్టున్నావ్ గా గట్టిగా
ఏడరా… మొత్తం కీటో డైట్ మీదున్నా నేను
ఏందన్నా… అది
కీటో డైట్ రా… రైస్ తినం… ఆలుగడ్డ తినం… ఖాళీ ప్రోటీన్ తింటాం… ఫాట్ తింటాం..నో కార్బో హైడ్రేట్..
డైట్ లో ఫాట్ తింటావా అన్నా…
మరి… ఫాటే కదరా లోపలికి పోయి ఫాట్ ను కట్ చేసేటిది.
ఏ… ఊరుకో అన్నా  మజాక్ చేయకు ప్లీజ్
అరె… హవులే…. డైమండ్ ను ఎట్లా కోస్తారో తెలుసారా నీకు ఆ…
చెప్పు..
డైమండ్ తోని….
నిజంగానా…
ఎట్టుంటది మరి మనతోని….
తిన్న ప్రొటీనంతా ఏడికి పోతుందిరా టిల్లు…..
గమ్మత్తుగా సాగే ఈ సంభాషణ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రంలో ఏ సందర్భంలో వస్తుందో వెండితెరపై చూడాల్సిందే”….

పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్  జరుపుకుంటోంది.
కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అని తెలిపారు దర్శకుడు విమల్ కృష్ణ.

చిత్రంలో  ప్రిన్స్  ఓ ప్రధాన పాత్ర పోషిస్తుండగా,  ఇతర ప్రధాన పాత్రలలో, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ ఇప్పటివరకు ఎంపికైన తారాగణం.

‘నరుడి బ్రతుకు నటన‘ చిత్రానికి
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోని
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి

దర్శకత్వం: విమల్ కృష్ణ
Sithara entertainments released a video on the occasion of siddu jonnalagadda’s birthday.

Sithara entertainments producing narudi brathuku natana movie with siddu jonnalagadda as hero and neha shetty as heroine.

Narudi brathuku natana movie shooting is happening in and around Hyderabad .

Tollywood’s well known movie production house sithara entertainments producing a movie with young hero siddu jonnalagadda as hero and neha shetty as heroine . Movie is titled NARUDI BRATHUKU NATANA. Producer surya devara naga vamsi introducing young talent vimal krishna who worked in writing department and direction department for KRISHNA AND HIS LEELA  is being introduced as director with this movie.

Sithara entertainments released a video which consists of interesting dialogues. Analysing the video teaser one can understands this movie is going to be intersting and with fresh feel.

This video involves a conversation between the hero siddu and a barber

Hey sathi, need a shoulder massage
I should be prepared from the my song launch.

Looks like you have been working out  alot with your shoulders Anna

Nothing too much. I am on my keto diet.

What is it anna??

Keto diet, no rice no potato, only protein and fat no carbo hydrate

Do you take fat in your diet anna ??

Yess, fat is what cuts the fat inside

Dont make me a fool anna

Do you know how diamond are broken ??

Noo

With diamond

Really ?!!

Then!!!

Where is all protein that i have been eating tillu ????

Humorous conversation will make the audience wait for the film to get featured on big screen.

Pdv presents Producer Suryadevara naga vamsi film is on sets.
Nbn director vimal krishna has told that its a new age romantic love story.

Movie also cast Prince, Brahmaji, Narra Srinivas.

NARUDI BRATHUKU NATANA
Written by: Vimal Krishna, Siddu jonlagadda
Dialogues: Siddu Jonlagadda
Music: sricharan pakala
Photography: Sai Prakash Ummadi
Executive Producer: Dheeraj Mogilineni
Production Designer: Ravi Antony.
P.R.O: Lakshmi Venugopal
Presents: P.D.V Prasad
Producer: Surya Devara Nagavamshi
Director: Vimal Krishna

4P5A6609