Feb 5 2020
Starring Kalyaan Dhev, Reputed Production house GA2 Pictures is presenting a film, produced by People Media Factory, Abhishek Agarwal Arts.
* ‘కళ్యాణ్ దేవ్’ హీరోగా ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ‘పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం.
* దర్శకునిగా ‘శ్రీధర్ సీపాన’ పరిచయం.
మంచి కధాబలం కలిగిన చిత్రాలను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించటం అన్నది ఇటీవల కాలంలో ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న వైనం గమనార్హం. ఇదే కోవలో మూడు ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థలు ఓ చిత్ర నిర్మాణానికి నడుం బిగించాయి.
భలే భలే మగాడి ఓయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే వంటి విజయవంతమైన చిత్రాలను ప్రస్తుతం ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ చిత్రాన్ని నిర్మిస్తున్న
‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ఇటీవలే ‘వెంకీ మామ’ వంటి ఘనవిజయం సాధించిన చిత్రాన్ని నిర్మించిన ‘పీపుల్ మీడియా ఫాక్టరీ‘, మరో చిత్ర నిర్మాణ సంస్థ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‘ తో కలసి ఈ చిత్ర నిర్మాణానికి సమాయత్తమవుతున్నాయి. నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘విజేత’ వంటి ఓ మంచి కథాబలం కలిగిన చిత్రంతో వెండితెరకు కథానాయకునిగా పరిచయమయిన మెగాస్టార్ చిరంజీవి అల్లుడు ‘కళ్యాణ్ దేవ్‘ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది.
విక్టరీ వెంకటేష్ ‘నమో వెంకటేశ’, మహేష్ బాబు ‘దూకుడు’ వంటి చిత్రాలకు రచనా సహకారం అందించటం తో పాటు, అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం,సౌఖ్యం, డిక్టేటర్ వంటి పలు చిత్రాలకు కథ, మాటలు అందించిన రచయిత ‘శ్రీధర్ సీపాన’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్న ‘శ్రీధర్ సీపాన‘మాట్లాడుతూ…’ రచయితగా నాకున్న అనుభవంతో ఓ మంచి కథను దర్శకునిగా పరిచయం కావటానికి సిద్ధం చేసుకున్నాను. ఈ కధకు హీరో ‘కళ్యాణ్ దేవ్‘ సరైన నాయకుడని అనిపించింది. ప్రేమ తో కూడిన వినోద భరిత కుటుంబ కధా చిత్రం గా దీనికి రూపకల్పన చేయటం జరిగింది. హీరో పాత్ర ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దర్శకునిగా నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు సర్వదా కృతజ్ఞుడను. వారి గౌరవాన్ని పెంచే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తానని నమ్మకంగా చెప్పగలనన్నారు ‘శ్రీధర్ సీపాన‘.
ఈ ఏడాది మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం లోని ఇతర నటీ నట, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో ప్రకటిస్తామని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.
సమర్పణ: ‘జిఏ 2 పిక్చర్స్’
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
కథ,మాటలు,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీధర్ సీపాన
GA 2 Pictures, which has bankrolled films like Bhale Bhale Magadivoy, Geetha Govindam and Prati Roju Pandaage, will present a film which will be jointly produced by TG Vishwa Prasad, Abhishek Agarwal under the banners People Media Factory and Abhishek Agarwal Arts. Kalyaan Dhev, son-in-law of Megastar Chiranjeevi and who made his debut with recently released Vijetha, has been signed on to play the lead role in this yet untitled film. The film will be directed by debutante Sreedhar Seepana who has worked on films like Venkatesh’s Namo Venkatesa and Mahesh Babu’s Dookudu as a writer.
“Having worked as a writer for many films, I’ve made this script which I feel would work greatly. I felt Kalyaan Dhev was the right actor for this script. The script has all the elements in it like love, emotions etc and makes it a complete family entertainer. I would like to thank my producers for giving me this opportunity and would do my best,” said director Sreedhar Seepana.
More details about the complete cast and crew will be revealed soon. The shooting of the film will begin in March this year.
Presents: GA 2 PICTURES
Co-Producer: VIVEK KUCHI BHOTLA
Producers: T.G.VISWAPRASAD, ABHISHEK AGARWAL
Story,Dialogues,Screen play, Direction: SREEDHAR SEEPANA