Oct 18 2012
వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమా గురించి " ఏవీ ఎస్’
వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమా గురించి
బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా రూపొందిన ” వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం ” చిత్రాన్ని వెంటనే నిషేధించాలి. బ్రాహ్మణ స్త్రీలను
కించపరుస్తూ వారిని హీనంగా చూపిస్తూ ఈ సినిమా నిర్మించటం దుర్మార్గం…దుస్సాహసం…ఇది నూటికి నూరు పాళ్ళూ బ్రాహ్మణుల
సహనాన్ని పరిక్షించటమే. ఒక్క బ్రాహ్మణ కులాన్ని మాత్రమే కాదు… ఏ కులాన్ని కించపరిచే అధికారం ఎవరికీ లేదు. ఈ చిత్రాన్ని
ఎక్కడ సెన్సార్ చేసారో, ఈ టైటిల్ ను ఎక్కడి చాంబర్ మంజూరు చేసిందో వెంటనే తెలపాలి. నాగరిక సమాజంలో ఇటువంటి ధోరణులు
తీవ్ర అభ్యంతరకరం ….రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సినిమా విడుదల కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ సినిమాకు సంబంధించి పత్రికలలో, ఎలెక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి ప్రకటనలు రాకుండా చూడాలి.చిత్ర నిర్మాత, దర్శకుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. భవిష్యత్తులో మరెవ్వరూ ఈ తరహా సినిమాలు నిర్మించకుండా అవసరమైన చట్టాన్ని
రూపొందించాలి. ఇందుకు ఆంద్ర ప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి , దర్శకుల సంఘం కూడా సహకరించాలని విజ్ఞప్తి ….
ఏవీయస్
తెలుగు చలనచిత్ర నటుడు, రచయిత, దర్శకుడు …
18 – 10 – 2012
roses
Oct 23, 2012 @ 06:18:21
This is really interesting…
Rosesandgifts.com