సడన్ స్టార్’ (నరేష్) ను అభినందించిన ‘సూపర్ స్టార్’ (రజనీ కాంత్)సడన్ స్టార్’ (నరేష్) ను అభినందించిన ‘సూపర్ స్టార్’ (రజనీ కాంత్)

 అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ సాధించిన ఘన విజయం ‘తమిళ నాడు’ కు పాకింది. తమిళ సూపర్ స్టార్ ‘రజనీకాంత్’ సుడిగాడు ని చూసేలా చేసింది.
‘సుడిగాడు’ ను చూసేందుకు చెన్నై లో ఏర్పాట్లు చేయాలని చిత్ర దర్శక నిర్మాతలను ఆయన కోరటం జరిగింది. ఈ నేపధ్యంలో ‘సుడిగాడు’ చిత్రాన్ని బుధవారం చెన్నై లోని తన నివాసం లో చిత్రాని రజనీ చూసారు. ఆద్యంతం వినోదాన్ని చిత్రం పంచిందన్న అభిప్రాయాన్ని ఆయన వెలి బుచ్చారు. చిత్ర కధానాయకుడు నరేష్ , దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు , నిర్మాత చంద్రశేఖర్ . డి. రెడ్డి లు సూపర్ స్టార్ రజనీ తమ చిత్రాన్ని చూడటం ఏంటో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.