An intriguing teaser of Butta Bomma, starring Anikha Surendran, Surya Vashistta, Arjun Das, unveiled

“బుట్ట బొమ్మ” టీజర్ విడుదల

*నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా
“బుట్ట బొమ్మ”  టీజర్ విడుదల

*అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట  ల తో  ’సితార ఎంటర్ టైన్ మెంట్స్’ , ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‘….”బుట్ట బొమ్మ”
* “బుట్ట బొమ్మ” గా అనిక సురేంద్రన్
* అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు కథా నాయకులు
*శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం

వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో  చిత్రం “బుట్ట బొమ్మ”

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట  లు నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి
నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌ నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు.

నేడు సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు
సందర్భాన్ని పురస్కరించుకుని  ”బుట్ట బొమ్మ” ప్రచార చిత్రం ను విడుదల చేసింది చిత్ర బృందం.

విడుదలైన ప్రచార చిత్రం ను పరికిస్తే….ఆద్యంతం ప్రతిక్షణం ఆకట్టుకుంటూ,ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల అభినయం ఆకట్టుకుంటుంది.
“మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్…
ఇంకోసారి చెయ్యాలంటే … ఇప్పుడు కాల్ కట్ చెయ్యాలి గా”…
“మాటింటే మనిషిని చూడాలనిపిం చాలి.. మాట్లాడుతుంటే పాట ఇంటున్నట్టుండాలి”…
వంటి పాత్రోచితంగా సాగే సంభాషణలు చిత్రం పై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. అరవై ఐదు క్షణాల పాటు సాగే ఈ వీడియో లో వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం చిత్రాన్ని మరో  మెట్టెక్కిస్తాయి అని నమ్మకంగా చెప్పొచ్చు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ…‘బుట్ట బొమ్మ‘ గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండి పోతాయి.‘ప్రేమ’ లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు.. విడుదలైన ఈ వీడియోను చూస్తే ఆయన మాటలు నిజమనిపిస్తాయి. సంభాషణల రచయిత గా ‘ వరుడు కావలెను‘ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. సంభాషణల్లో  తనదైన బాణీ పలికించటానికి ఆయన తపన స్పష్టమవుతుంది.
చిత్ర నిర్మాణ కార్యక్రమాలు దాదాపు గా పూర్తి కావస్తున్నాయి. చిత్రం విడుదల ఇతర వివరాలు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఒక్కొక్కటిగా తెలియ పరుస్తామని తెలిపారు నిర్మాతలు.

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నాయిక, నాయకులుగానటిస్తున్న ఈ చిత్రంలో
నవ్య స్వామి, నర్రాశ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి,ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్ల పాలెం కిషోర్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు.

సాంకేతిక నిపుణులు:
ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు
సంగీతం: గోపిసుందర్
మాటలు: గణేష్ కుమార్ రావూరి
పాటలు: శ్రీమణి, ఎస్. భరద్వాజ్ పాత్రుడు
ఎడిటర్: నవీన్ నూలి
పోరాటాలు : డ్రాగన్ ప్రకాష్
ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై
ప్రొడక్షన్ కంట్రోలర్: సి హెచ్. రామకృష్ణా రెడ్డి
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌
దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్

An intriguing teaser of Butta Bomma, starring Anikha Surendran, Surya Vashistta, Arjun Das, unveiled

Sithara Entertainments, the popular production house synonymous for delivering one blockbuster after the other, is teaming up with Fortune Four Cinemas for a gripping rural drama Butta Bomma. Anikha Surendran, Surya Vashistta and Arjun Das play the lead roles in the film directed by first-time filmmaker Shourie Chandrasekhar Ramesh. A gripping teaser of the feel-good saga was unveiled today, commemorating the birthday of star writer-director Trivikram Srinivas.

In the teaser, Satya is introduced as a chirpy, innocent girl in a village who sways everyone with her enthusiasm and charm. She has her way with words and is happy in her little cocoon. Satya gradually falls in love with an auto driver. A grandma later asks her to solve a riddle, through which the premise is introduced to the viewer. There’s tension, drama in the proceedings and the antagonist is keen on redemption. Will Satya’s life take a drastic turn? The teaser leaves you curious.

The catchy background score contributes to the film’s laidback yet feel-good vibe. Navya Swami, Narra Srinu, Pammi Sai, Karthik Prasad, Vasu Inturi, Mirchi Kiran, Kancharapalem Kishore and Madhumani essay supporting roles in this countryside romance. The film has cinematography by Vamsi Patchipulusu and is produced by S Naga Vamsi and Sai Soujanya.  Ganesh Kumar Ravuri, the writer who shot to fame with Varudu Kavalenu, pens the dialogues. Butta Bomma is set for a theatrical release soon.

Crew:
Cinematography: Vamsi Patchipulusu
Music: Gopi Sundar
Dialogues: Ganesh Kumar Ravuri
Lyrics: Shreemani, S Bharadwaja Pathrudu
Editor: Navin Nooli
Production designer: Vivek Annamalai
Production controller: C H Ramakrishna Reddy
PRO: Lakshmi Venugopal
Producers: S Naga Vamsi and Sai Soujanya
Director: Shourie Chandrasekhar Ramesh

ButtaBomma_Still1 ButtaBomma_TeaserOutNow ButtaBomma_TeaserPoster_Still ButtaBomma_Still2