Sir/Vaathi’s first single Mastaaru Mastaaru launched, GV Prakash’s melody woos music buffs

ధనుష్ ‘సార్’ నుంచి ‘ మాస్టారు… మాస్టారు‘ గీతం విడుదల
 
*తమిళంలో ‘ధనుష్‘, తెలుగు లో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన గీతం
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న  ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతూ ’సార్’  చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ’సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో  నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు) ‌’వాతి’,(తమిళం) నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా, మరోవైపు చిత్రం పాటల ప్రచార పర్వం వైపు అడుగు వేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే చిత్రానికి సంభందించిన తొలి గీతం ఈరోజు విడుదల అయింది.
‘ మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు‘… అంటూ సాగే  ఈ గీతానికి తమిళంలో ‘ధనుష్‘, తెలుగు లో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించటం విశేషం.  జి వి ప్రకాష్ స్వరాలు, శ్వేతామోహన్ స్వరం పోటీ పడ్డాయనిపిస్తింది. 
 
పాట చిత్రీకరణ కూడా అంతే. నాయిక, నాయికల భావోద్వేగాలు,కనిపించే దృశ్యాలు, వారి అభినయం వీక్షకుల మనసును హత్తుకుం టాయి. కళాశాల నేపధ్యంలో శేఖర్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిం చుకున్న ఈ గీతం చిత్ర కథానుసారం కథానాయకుడు ధనుష్ ప్రవర్తన, అతని మంచి మనస్తత్వం, గొప్పతనం గుర్తెరిగిన నాయిక సంయుక్త మీనన్ మనసు ప్రేమైక భావన కు గురైన సందర్భం. ఆ ఊహల్లో, అలాంటి నేపధ్యంలో వచ్చే గీతం ఇది. పాటానుసారం ధనుష్, సంయుక్త మీనన్, విద్యార్థులు కనిపిస్తారు. సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ కుమార్ స్వర పరిచిన బాణీలు సంగీత ప్రియుల్ని మధురమైన భావనకు గురిచేస్తాయి అంటున్నారు ఈ పాట రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి. ఆయన మాటల్లోనే ఇంకా చెప్పాలంటే.. ఇది అచ్ఛ తెలుగు పాట, ఓ అందమైన పాట, మంచి పాట, ప్రయోజనం ఉన్న పాట, ఉపయోగం ఉన్న పాట, సున్నితమైన భావోద్వేగాలు కలిగిన పాట ఇది. పాట రాయటానికి కొంత కష్ట పడినప్పటికీ, దర్శకుడు వెంకీ గారు చెప్పిన పాట సందర్భం, ఆయన ఆలోచనలు అన్నీ చక్కని సాహిత్యం సమకూర్చటానికి నన్ను ముందుకు నడిపాయి. ఈ పాట కు ఇటు నేను, అటు తమిళంలో ధనుష్ సాహిత్యం అందించటం కొత్త అనుభూతి. భావం ఒక్కటే అయినా శైలి భిన్నంగా ఉంటుంది. జి వి ప్రకాష్ బాణీ ల్లో మరింతగా ఒదిగిన సాహిత్యం ఉన్న పాట ఇది. గాయని శ్వేతా మోహన్ గాత్రం పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తుంది.
చాట్ బస్టర్స్ లో నిలిచే పాట ఇది. అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య గార్లకు కృతజ్ఞతలు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం పరిచారు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి.
ఇటీవల చిత్రం నుంచి విడుదల అయిన
 ప్రచార చిత్రాలు ‘సార్‘  పై ప్రపంచ సినిమా వీక్షకులలో అమితాసక్తి కలిగించాయి. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు ’సార్’ జీవితాన్ని  ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.
తారాగ‌ణం: ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌, సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి
, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
సినిమాటోగ్రాఫ‌ర్:  జె.యువరాజ్
మ్యూజిక్: జి.వి. ప్ర‌కాష్‌కుమార్‌
యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్
స‌మ‌ర్ప‌ణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌
రచన- దర్శకత్వం: వెంకీ అట్లూరి
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
Sir/Vaathi’s first single Mastaaru Mastaaru launched, GV Prakash’s melody woos music buffs
Award-winning actor Dhanush and Samyuktha Menon are teaming up for the much awaited college drama, Sir a.k.a Vaathi, a Telugu-Tamil bilingual, written and directed by Venky Atluri. S Naga Vamsi and Sai Soujanya are bankrolling the film under Sithara Entertainments and Fortune Four Cinemas while Srikara Studios presents it. GV Prakash scores the music for the drama which is nearing completion. Mastaaru Mastaaru, the first single from Sir/Vaathi, was unveiled today, much to the delight of Dhanush’s fans.
Sung by Shweta Mohan and lyricised by Ramajogaiah Sastry, Mastaaru Mastaaru is a catchy montage song amidst a college backdrop, where the female protagonist expresses her liking for the character played by Dhanush, a lecturer (named Bala Gangadhar Tilak). Shweta’s mellifluous voice captures the various layers in the song with the lyrics beautifully, exploring the mind of a woman smitten by the idealism of the man she falls for. Sekhar master has choreographed the number.
Several glimpses of the romance between a handsome Dhanush and Samyuktha in a traditional avatar, their on-screen chemistry in the lyrical video, leaves us craving for more. The opening lines ‘Seetakaalam manasu..Nee manasuna chotadiginde..Sitakumalle neetho adugese maatadiginde..’ is enough proof of Ramajogaiah Sastry’s smart yet intimate word play and his effort to understand the soul beneath the number. A brief video of the song sung by Dhanush was also shared by GV Prakash Kumar earlier this week. Interestingly, Dhanush himself has written the lyrics for the Tamil version.
Expressing his happiness on working for Mastaaru Mastaaru, Ramajogaiah Sastry shares, “I am happy to be associated with the first single in a film produced by two leading banners. Despite being a bilingual, I’ve written the number keeping the tastes of Telugu viewers in mind, more like a straight Telugu film. Mastaaru Mastaaru was written before the Tamil version. The song takes listeners through the romance angle between the leads in the story.”
“Mastaaru Mastaaru is an upbeat melody with an underplayed folk element that has all the makings of a chartbuster. While GV Prakash’s strengths as a composer needs no introduction, the director Venky Atluri has clear vision about his story and impressive music taste; his previous films have proved the same. He kept pushing me to give my best for it. The song arrives at a crucial juncture and digs deep into the perspective of the woman. I’m confident that it’ll be liked by one and all,” he adds.
Sir’s teaser, released recently, received terrific response. Sai Kumar, Tanikella Bharani, Samuthirakani, Thotapalli Madhu, Narra Srinivas, Pammi Sai, Hyper Aadhi, Shara, Aadukalam Naren, Ilavarasu, Motta Rajendran, Hareesh Peradi and Praveena too play crucial roles in the film. J Yuvraj cranks the camera while Navin Nooli is the editor and Avinash Kolla is the production designer. Venkat handles the action choreography.
Still_003 Still_002 Still_001