About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

*I Am Super Confident in Daaku Maharaaj: Shraddha Srinath*

‘డాకు మహారాజ్’ సినిమా ఒక పూర్తి ప్యాకేజ్ లా ఉంటుంది : కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్

నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలలో మరింత జోరును పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బాలకృష్ణ గారి గురించి?
ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను, నేనొక బిగ్ స్టార్ ని అనే అహం బాలకృష్ణ గారిలో కొంచెం కూడా ఉండదు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. తనకంటే చిన్నా పెద్దా అని చూడకుండా దర్శకుడికి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
‘డాకు మహారాజ్’ సినిమాలో నటించడం ఎలా ఉంది?
నేను ఇప్పటివరకు కొన్ని విభిన్న సినిమాలు చేశాను. అయితే ఈ చిత్రం మాత్రం ఒక పూర్తి ప్యాకేజ్ లా ఉంటుంది. ఇలాంటి నేను ఇప్పటి వరకు చేయలేదు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. పైగా బాలకృష్ణ గారి సినిమా అంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు నా ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది.
మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
నా పాత్ర పేరు నందిని. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎంతో ఓపిక ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుసు. నా పాత్రలో ఎంతో డెప్త్ ఉంటుంది. నటనకు కూడా ఎంతో ఆస్కారముంది.
‘డాకు మహారాజ్’ మీ సినీ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపనుంది?
ఈ సినిమాపైనా, ఇందులో నేను పోషించిన నందిని పాత్ర పైనా ఎంతో నమ్మకంగా ఉన్నాను. నందిని పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నాను.
ఈ సినిమా ప్రయాణంలో మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది ఏంటి?
నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందులో డైలాగ్ లు కరెక్ట్ మెజర్ లో ఉంటాయి. డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రతి డైలాగ్ మీద ఎంతో కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పించారు.
మీ పాత్ర పరంగా ‘జెర్సీ’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు?
రెండూ వేటికవే ప్రత్యేకం. జెర్సీలో నేను పోషించిన సారా పాత్ర నా మనసుకి బాగా నచ్చిన పాత్ర. ప్రేక్షకులు కూడా ఎంతో ఆదరించారు. ఇప్పుడు డాకు మహారాజ్ లోని నందిని పాత్ర కూడా ప్రేక్షకులకు ఆ స్థాయిలో చేరువ అవుతుందనే నమ్మకం ఉంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ గురించి?
సితార ఎంటర్టైన్మెంట్స్ నాకు జెర్సీ వంటి మెమరబుల్ ఫిల్మ్ ని ఇచ్చింది. నాపై నమ్మకం ఉంచి, ఇప్పుడు ‘డాకు మహారాజ్’లో మరో మంచి పాత్ర ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. సితార ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ ఉంటుంది. అలాంటి బ్యానర్ లో సినిమా చేయడం ఎప్పుడూ గౌరవంగానే భావిస్తాను.
దర్శకుడు బాబీ గారి గురించి?
బాబీ గారు ప్రతిభగల దర్శకుడు. సినిమా పట్ల ఆయనకు ఎంతో పాషన్ ఉంది. అలాగే, బాబీ గారిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. అద్భుతమైన సూచనలు ఇస్తూ, నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకుంటారు.
మీకు ఎలాంటి సినిమాలు, పాత్రలు చేయాలని ఉంది?
అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు పోషించడానికి ఎక్కువ ఇష్టపడతాను.
*I Am Super Confident in Daaku Maharaaj: Shraddha Srinath*
Q: You’ve been in the industry for over a decade, working with multiple stars across languages. What’s unique about Nandamuri Balakrishna?
Shraddha Srinath: Despite being in the industry for decades, Balakrishna sir remains curious and innocent in his approach. He genuinely listens to what the director wants to convey without any starry inhibitions. He surrenders himself completely to the director’s vision, which is very rare for a star of his stature.
Q: How did you feel when you were offered a role in Daaku Maharaaj?
Shraddha Srinath: The films I’ve done so far are mostly subtle, serious, or thrillers. But Daaku Maharaaj is different. Being part of a Balakrishna film means the entire world will be watching me. For me, it’s an opportunity to showcase my talent to a wider audience. It’s a do-or-die opportunity, and I am determined to give my best.
Q: Can you tell us about your character?
Shraddha Srinath: I play Nandini, a composed and soft-spoken yet courageous character. She knows when to speak and what to say. My role has a lot of emotional depth. Commercial cinema is often about looking pretty with limited scope for performance, but in this film, I got to do both. It was a challenging role, and I thoroughly enjoyed it.
Q: Did you have any reference points for your character?
Shraddha Srinath: Bobby garu had a clear vision of how my character should look on screen. We did extensive research and put a lot of effort into the look and costumes, down to details like nail polish.
Q: Do you believe Daaku Maharaaj will have an impact on your career?
Shraddha Srinath: I am super confident about this film. I truly believe it will have a very positive impact on my career.
Q: Did you dub for your role?
Shraddha Srinath: Yes, I dubbed for myself.
Q: How was your working experience with Balakrishna?
Shraddha Srinath: His energy surpasses all of ours combined. He’s so cool and asked me to call him “Bala” instead of “sir,” though I didn’t have the courage to do so. He jokes around on set, but when the camera rolls, he transforms into his character effortlessly.
Q: How does it feel to work with Sithara Entertainments again after Jersey?
Shraddha Srinath: I feel they have a lot of trust in me. They gave me one memorable film with Jersey, and I’m thrilled to be working with them again for Daaku Maharaaj. I look forward to being associated with them for more films. Their lineup is always exciting, with the perfect mix of content and entertainment.
Q: Tell us about your experience working with Bobby Kolli.
Shraddha Srinath: Bobby Kolli is extremely passionate and has an incredible understanding of acting. I often joke that I want to learn acting from him. Initially, I wasn’t sure if I could pull off this character, but I followed his instructions and trusted his vision. I’ll always be grateful to him for believing in me.
IMG 4886 IMG 4855 IMG 4753 IMG 4733 IMG 4778 IMG 4734 IMG 4838

‘Daaku Maharaaj’ Will Be a Reference Point for other Films : Bobby Kolli

బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’ : నిర్మాత సూర్యదేవర నాగవంశీ
 బాలకృష్ణ గారి అభిమానులతో పాటు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రం ‘డాకు మహారాజ్’ : దర్శకుడు బాబీ కొల్లి
 వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాలలో మరింత జోరు పెంచిన చిత్ర బృందం, తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి, కథానాయికలు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
 నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ ఈలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశాం. ‘డాకు మహారాజ్’ సినిమాని తెలుగునాట కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. యూఎస్ లో కూడా భారీ స్థాయిలోనే విడుదల ఉంటుంది. అక్కడ బుకింగ్స్ బాగున్నాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ జనవరి 12న విడుదలవుతోంది. ‘డాకు మహారాజ్’తో ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ఈ సినిమా నేను చూసి నమ్మకంగా చెబుతున్నాను. ‘డాకు మహారాజ్’ చిత్రం అసలు నిరాశ పరచదు. బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.” అన్నారు.
 దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, “మొదటి నుంచి బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో, ప్రతి విషయంలో వైవిధ్యం చూపిస్తూ ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని రూపొందించాం. ప్రచార చిత్రాలకు బాలకృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దాంతో సినిమా విజయం పట్ల మాకు మరింత నమ్మకం పెరిగింది. అలాగే ‘డాకు మహారాజ్’ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. బాలకృష్ణ గారి అభిమానులకు ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇవ్వాలనేది నాగవంశీ గారి డ్రీమ్. అందుకు తగ్గట్టుగానే సరికొత్తగా ఉండేలా, ఒక మంచి సినిమాని తీశాము. ఇందులో ఐదు యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. ప్రతి సీక్వెన్స్ అభిమానులకు ఎంతో హై ఇస్తుంది. యాక్షన్ తో పాటు మంచి వినోదం, హత్తుకునే భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది.” అన్నారు.
 కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, “ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ కు ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. మీరు మా సినిమాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమాని మీకు ఎప్పుడెప్పుడు చూపిస్తామా అని ఎంతగానో ఎదురుచూస్తున్నాం. జనవరి 12న నా పుట్టినరోజు. ఈ చిత్ర విజయాన్ని నా పుట్టినరోజు కానుకగా అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో గుర్తుండిపోయే మంచి పాత్రను పోషించాను. ” అన్నారు.
 కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, “ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంపై నాకు చాలా నమ్మకం ఉంది. నా సినీ ప్రయాణంలో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను. జనవరి 12 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.” అన్నారు.
 ’డాకు మహారాజ్’ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంచలన స్వరకర్త తమన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడిగా విజయ్ కార్తీక్ కన్నన్, కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా సంగీతం: తమన్ ఎస్ ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్ కళా దర్శకుడు: అవినాష్ కొల్లా కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్ దర్శకత్వం: బాబీ కొల్లి నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ సమర్పణ: శ్రీకర స్టూడియోస్ పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
‘Daaku Maharaaj’ Will Be a Reference Point for other Films : Bobby Kolli
 The highly anticipated film Daaku Maharaaj, starring Nandamuri Balakrishna, is set for a grand worldwide release on January 12, 2025. The movie has successfully completed all post-production formalities and is ready to hit the big screens. Directed by Bobby Kolli and produced by Naga Vamsi, the film features Pragya Jaiswal and Shraddha Srinath in pivotal roles. At a press meet held in Hyderabad, the team expressed their confidence in the film’s success.
 Speaking at the event, Director Bobby Kolli said, “We Didn’t Take Any References; We Made Daaku Maharaaj to Serve as a Reference Point. We have crafted a unique trailer, unlike previous Balakrishna films, and the response has been phenomenal. We are anticipating a similar reception on January 12.”
 Producer Naga Vamsi added, “Daaku Maharaaj will be remembered as a landmark film in Nandamuri Balakrishna’s career. We are also thrilled to announce a simultaneous theatrical release in Tamil.”
 Actress Pragya Jaiswal shared, “I am fortunate to have Daaku Maharaaj release on my birthday, January 12. I have portrayed a deglam role in the film, and it’s something audiences must experience on the big screen.
 Shraddha Srinath expressed, “I am very confident in this film, and I believe Daaku Maharaaj will bring a significant turning point in my career.” The film promises a unique cinematic experience, and the team eagerly awaits its grand worldwide release on January 12.
 Presented by: Srikara Studios Banner: Sithara Entertainments & Fortune Four Cinemas Title: Daaku Maharaaj Release Date: January 12, 2025 Genre: Action Drama Cast: Hero: Nandamuri Balakrishna Co-Stars: Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandhini Chowdary Technical Crew: Director: Bobby Kolli Producer: Naga Vamsi Music Director: Thaman S Cinematography: Vijay Kartik Kannan Editors: Niranjan Devaramane, Ruben Production Designer: Avinash Kolla

GANI3941 DSC_3623

Nandamuri Balakrishna – Bobby Kolli – Sithara Entertainments’ Daaku Maharaaj Wild Theatrical Trailer Out

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్ర ట్రైలర్ విడుదల
- డల్లాస్ లో ఘనంగా ‘డాకు మహారాజ్’ ట్రైలర్ విడుదల కార్యక్రమం
నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
‘డాకు మహారాజ్’ ట్రైలర్ విడుదల కార్యక్రమం డల్లాస్ లో ఘనంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 8:39 కి ట్రైలర్ ను విడుదల చేశారు. 2 నిమిషాల 44 సెకన్ల నిడివితో రూపొందిన ‘డాకు మహారాజ్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. “అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డ వాళ్ళంతా ఆయనను డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజ్.” అంటూ ఒక పాప వాయిస్ తో ట్రైలర్ ను ప్రారంభించిన తీరు మెప్పించింది. డాకు మహారాజ్ గా బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అమోఘం. నందమూరి బాలకృష్ణ పాత్ర విభిన్న కోణాలను కలిగి ఉంది. విభిన్న రూపాలలో ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు. మొదట డాకు మహారాజ్ గా, తరువాత ఒక చిన్నారిని రక్షించే నానాజీగా విభిన్న కోణాలలో కనిపిస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి బాలకృష్ణను మునుపెన్నడూ చూడని అవతార్‌లో అభిమానులు, ప్రేక్షకులు మెచ్చేలా సరికొత్తగా చూపిస్తున్నారు.
 బలమైన కథాకథనాలతో.. హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో అద్భుతమైన చిత్రంగా ‘డాకు మహారాజ్’ రూపుదిద్దుకుందని ట్రైలర్ తో స్పష్టమైంది. ట్రైలర్ లో డాకు మహారాజ్ ని ఢీ కొట్టే బలమైన ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తున్నారు. అలాగే కీలక పాత్రధారులైన శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, మకరంద్ దేశ్‌పాండే పాత్రలను కూడా ట్రైలర్ లో పరిచయం చేశారు. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ట్రైలర్ లో విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొన్ని విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉన్నాయి. ఇక సంచలన స్వరకర్త తమన్ తనదైన నేపథ్య సంగీతంతోమరోసారి కట్టిపడేశారు.
మొత్తానికి డాకు మహారాజ్ ట్రైలర్ ఒక మంచి విందు భోజనంలా ఉంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్ళాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో కలిసి దర్శకుడు బాబీ కొల్లి, థియేటర్లలో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించబోతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
Nandamuri Balakrishna – Bobby Kolli – Sithara Entertainments’ Daaku Maharaaj Wild Theatrical Trailer Out
The much-anticipated theatrical trailer of Daaku Maharaaj, is here and setting social media on fire. The trailer launched grandly at a Dallas event. It introduces the intense world of Daaku, played by powerhouse actor Nandamuri Balakrishna, highlighting the protagonist’s action-packed journey for his people. The trailer also explores his past and the numerous enemies he had during Daaku.
Nandamuri Balakrishna’s character has multiple shades; once he was a Daaku Maharaaj, then Nanaji, to protect a child. Director Bobby Kolli took the challenge and presented NBK in a never-before-seen avatar showcasing his mass rage and swag at his best. His portrayal is one of the film’s key strengths. The high-octane action sequences in the trailer promise a mad treat for fans in theatres.
The trailer also introduces the menacing antagonist Bobby Deol and other key actors like Shraddha Srinath, Urvashi Rautela, Makarand Deshpande, and others in key roles. Vijay Karthik Kannan’s stylish cinematography adds a distinct visual flair to the film, while sensational composer Thaman S elevates the atmosphere with his intense background score. Once again, Thaman delivers his best for Balayya.
The trailer has generated significant buzz, and the film’s gripping content and epic mass elevations will create mass fervor in theatres. Alongside Nandamuri Balakrishna, the film stars Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandini Chowdary, and Urvashi Rautela in significant roles. Directed by Bobby Kolli, Daaku Maharaaj is shaping up to be a grand cinematic experience.
Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, the film is slated for a worldwide theatrical release on January 12, 2025, this Sankranti. Blending action, drama, entertainment, and heartfelt emotions, Daaku Maharaaj promises to deliver a grand cinematic experience.
Movie Title: Daaku Maharaaj
Release Date: January 12, 2025
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Presented by: Srikara Studios
Cast & Crew :
Hero: Nandamuri Balakrishna
Co-Stars: Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandini Chowdary, Urvashi Rautela
Director: Bobby Kolli
Producers: Naga Vamsi S, Sai Soujanya
Music Director: Thaman S
Cinematography: Vijay Kartik Kannan
Editor: Niranjan Devaramane, Ruben
Production Designer: Avinash Kolla
DaakuMaharaaj-TrailerOutNow-2 DaakuMaharaaj-TrailerOutNow Plain-2

Daaku Maharaaj’s Third Song “Dabidi Dibidi” ft. Nandamuri Balakrishna and Urvashi Rautela is out

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్రం నుంచి మూడవ గీతం ‘దబిడి దిబిడి’ విడుదల
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఈ సంక్రాంతికి ఆయన ‘డాకు మహారాజ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, రెండింటికీ మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడవ గీతం విడుదలైంది.
‘డాకు మహారాజ్’ చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూడవ గీతం ‘దబిడి దిబిడి’ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఒక ఊపు ఊపుతోంది. నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్ లకు పెట్టింది పేరు. అలాంటి బాలకృష్ణ చిత్రాలలోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్ లతో రూపుదిద్దుకున్న ‘దబిడి దిబిడి’ గీతం అభిమానులకు నిజమైన విందును అందిస్తోంది. ఈ మాస్ నృత్య గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా కాలు కదిపారు. తమ అసాధారణ ఎనర్జీతో, అదిరిపోయే స్టెప్పులతో మాస్ ప్రేక్షకులు మెచ్చేలా పాటను మలిచారు.
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కలయికలో వచ్చే ప్రతి పాట ప్రేక్షకులని రంజింపచేస్తుంది. ఇప్పుడు ‘దబిడి దిబిడి’ కోసం తమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వాగ్దేవి తన శక్తివంతమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఇక ప్రతిభావంతులైన గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సంగీతానికి తగ్గట్టుగా డైలాగ్ లతో అద్భుతమైన సాహిత్యం అందించారు. సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరి.. ఇది గొప్ప నృత్య గీతంగా మారింది. “జై బాలయ్య” తరహాలో అభిమానుల హృదయాల్లో ఈ పాట నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్, శేఖర్ వీజే అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను నిజమైన మాస్ ట్రీట్ లా మార్చాయి. అభిమానులతో పాటు, అన్ని వయసుల వారు కాలు కదిపేలా ఉన్న ఈ గీతం, ఖచ్చితంగా చాలా కాలం వినిపించే పాటగా నిలుస్తుంది.
నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రియులకు ఒక గొప్ప అనుభూతిని అందించేలా డాకు మహారాజ్ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
Daaku Maharaaj’s Third Song “Dabidi Dibidi” ft. Nandamuri Balakrishna and Urvashi Rautela is out
The much-anticipated third song from Daaku Maharaaj, titled “Dabidi Dibidi,” is here and setting social media on fire! This lavishly shot mass dance number pays tribute to the legendary dialogues of Nandamuri Balakrishna, offering a true feast for his fans. Featuring the powerhouse actor Nandamuri Balakrishna alongside the glamorous Urvashi Rautela, the song captures the essence of mass appeal with both delivering high-energy performances.
Vagdevi’s powerful vocals infuse the track with vibrancy, while lyrics penned by the talented lyricist Kasarla Shyam seamlessly blend Balakrishna’s iconic monologues with Thaman’s high-octane beats and dynamic musical arrangement. The lyrics not only celebrate the grandeur of his dialogues but also transform the track into a dance anthem, set to become the next “Jai Balayya” for fans. This song is bound to become a favorite for all. Rich and striking visuals captured by Vijay Karthik Kannan, combined with high-energy choreography by Shekar VJ, create a larger-than-life experience that guarantees this track will be a true mass treat and a sure-shot hit among fans of all ages.
Alongside Nandamuri Balakrishna, the film stars Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandini Chowdary, and Urvashi Rautela in significant roles. Directed by Bobby Kolli, Daaku Maharaaj is shaping up to be a grand cinematic experience. With stellar cinematography by Vijay Kartik Kannan and precise editing by Niranjan Devaramane and Ruben, the film promises to captivate audiences on a grand scale. Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, the film is slated for a worldwide theatrical release on January 12, 2025, this Sankranti. Blending action, drama, entertainment, and heartfelt emotions, Daaku Maharaaj promises to deliver a grand cinematic experience.
Movie Title: Daaku Maharaaj
Release Date: January 12, 2025
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Presented by: Srikara Studios
Cast & Crew :
Hero: Nandamuri Balakrishna
Co-Stars: Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandini Chowdary, Urvashi Rautela
Director: Bobby Kolli
Producers: Naga Vamsi S, Sai Soujanya
Music Director: Thaman S
Cinematography: Vijay Kartik Kannan
Editor: Niranjan Devaramane, Ruben
Pro: LakshmiVenugopal
Production Designer: Avinash Kolla

Daaku Maharaaj DD Out Now Daaku Maharaaj DD Plain (1) Daaku Maharaaj DD Out Now WWM (1) Daaku maharaaj duo Dabidi WWM (1)

The Much-Awaited ’7G Brindavan Colony 2′ Nears Completion!

తుది దశకు చేరుకున్న ’7G బృందావన కాలనీ 2′ చిత్రీకరణ

దక్షిణ భాషా చిత్రాలలో కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిన వాటిలో ’7G బృందావన కాలనీ’ చిత్రం ఒకటి. సినిమా విడుదలై రెండు దశాబ్దాలవుతున్నా, ఇప్పటికీ ఎందరికో అభిమాన చిత్రంగా ఉంది. అలాంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ గా ’7G బృందావన కాలనీ 2′ రూపొందుతోంది.

శ్రీ సూర్య మూవీస్ పతాకంపై పలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది.

’7G బృందావన కాలనీ 2′ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. కట్టిపడేసే కథాకథనాలు, హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించేలా అద్భుతంగా ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచిన రవికృష్ణ, మరోసారి తనదైన శైలిలో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన సరసన అనశ్వర రాజన్‌ నటిస్తున్నారు.

సీక్వెల్ పై ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచేలా, ఈ చిత్రంలో జయరామ్, సుమన్ శెట్టి, సుధ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మొదటి భాగం విజయంలో యువన్ శంకర్ రాజా యొక్క అద్భుతమైన సంగీతం కీలక పాత్ర పోషించింది. సీక్వెల్ తో కూడా ఆయన మరోసారి తన సంగీతంతో మ్యాజిక్ చేయబోతున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు రామ్‌జీ తనదైన కెమెరా పనితనంతో సీక్వెల్ కి మరింత అందం తీసుకురానున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ “7G బృందావన కాలనీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న చిత్రం. సినీ చరిత్రలో ఈ చిత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్ తో నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త మరియు ఆకట్టుకునే కథనాన్ని అందించి, అప్పటి మ్యాజిక్‌ను పునఃసృష్టి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.” అన్నారు.

’7G బృందావన కాలనీ 2′ అనేది సెల్వరాఘవన్ శైలి కథాకథనాలు, బలమైన భావోద్వేగాలతో రూపొందుతోన్న హృదయాలను హత్తుకునే ఓ విభిన్న ప్రేమ కథా చిత్రం. ఇది ప్రేక్షకులను ఎప్పటికీ మరచిపోలేని సరికొత్త అనుభూతిని అందించనుంది.

The Much-Awaited ’7G Brindavan Colony 2′ Nears Completion!

Sri Surya Movies and the celebrated producer A.M. Rathnam, known for delivering blockbuster and content-rich films, proudly announce that the highly anticipated sequel to the cult classic ’7G Brindavan Colony 2′ is in its final stages of shooting.

Directed by the visionary filmmaker Selvaraghavan, the sequel promises to captivate audiences with its masterful storytelling and emotional depth, hallmarks of the director’s unique cinematic style. The film features Ravi Krishna in a reprisal of his career-defining role, alongside the talented Anaswara Rajan as the female lead.

Adding to the excitement, the movie boasts a stellar supporting cast, including the versatile Jayaram, the brilliance of Suman Shetty, and the seasoned acting prowess of Sudha.

The sequel is further elevated by the magical music of Yuvan Shankar Raja, whose iconic compositions for the first installment continue to resonate with fans. Acclaimed cinematographer Ramji brings his expert visual storytelling to the project, ensuring a visually stunning experience.

Speaking about the film, producer A.M. Rathnam said: “The original ’7G Brindavan Colony 2′ is a film that touched hearts and has a special place in Tamil cinema history. With the sequel, we aim to recreate that magic while delivering a fresh and compelling narrative for today’s audience.”

’7G Brindavan Colony 2′ is set to be an emotional rollercoaster packed with love, heartbreak, and Selvaraghavan’s signature storytelling, making it a cinematic experience not to be missed.

 WhatsApp Image 2025-01-01 at 14.57.25_6c294575
-