About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Powerstar Pawan Kalyan’s ‘Hari Hara Veera Mallu Part-1′: Sword vs Spirit First Song Out on January 6, 2025

జనవరి 6న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నుంచి మొదటి గీతం ” మాట వినాలి” విడుదల

ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపే వార్తను తాజాగా నిర్మాతలు పంచుకున్నారు. ‘హరి హర వీర మల్లు’ నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే మొదటి గీతాన్ని జనవరి 6వ తేదీన ఉదయం 9:06 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ ను వదిలారు. తుఫానుకి ముందు ప్రశాంతతలా, యుద్ధానికి ముందు చిరునవ్వు చిందిస్తూ ప్రశాంతంగా కనిపిస్తున్న యోధుడిలా ఉన్న పవన్ కళ్యాణ్ లుక్  పోస్టర్ లో ఆకట్టుకుంటోంది. పెంచల్ దాస్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషం.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన సినిమాల్లోని పాటలు కేవలం ఉత్సాహాన్ని కలిగించడమే కాదు, సమాజాన్ని చైతన్య పరిచేలా, యువతలో స్ఫూర్తి నింపేలా ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల్లోని ఎక్కువ శాతం పాటలు ఎవర్గ్రీన్ గా నిలుస్తుంటాయి. ఇక తన సినిమాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించే పాటలకు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంది. ‘తమ్ముడు’,  ’జానీ’, ‘అత్తారింటికి దారేది’ అజ్ఞాత వాసి‘, వంటి పలు సినిమాల్లో తన గాత్రంతో కట్టిపడేశారు. ఇప్పుడు ‘హరి హర వీర మల్లు’లో ‘మాట వినాలి’ అంటూ మరోసారి తన స్వరంతో మాయ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, ‘బాహుబలి’ ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Powerstar Pawan Kalyan’s ‘Hari Hara Veera Mallu Part-1′: Sword vs Spirit First Song Out on January 6, 2025

The much-awaited moment has arrived! Hari Hara Veera Mallu kicks off its promotional campaign this New Year with a massive musical announcement. The first single, Maata Vinaali (Telugu), Kekkanum Guruve (Tamil), Kelkkanam Guruve (Malayalam), Maathu Kelayya (Kannada), and Baat Nirali (Hindi), will be released on January 6, 2025, at 9:06 AM.

Sung by the one and only Powerstar Pawan Kalyan, the track is a powerful and mesmerizing song that showcases his vocal prowess. The music is composed by Oscar Award-winner MM Keeravaani, with lyrics penned by Penchal Das (Telugu), P.A. Vijay (Tamil), Mankombu Gopalakrishnan (Malayalam), Aazad Varadaraj (Kannada), and Abbas Tyrewala (Hindi), making for an extraordinary collaboration eagerly anticipated by fans.

What makes this song truly special is Pawan Kalyan’s vocals for the Telugu version. His journey in music isn’t new; over the years, he has lent his voice to several memorable tracks in films like Thammudu, Johnny, Attarintiki Daredi, Agnyaathavaasi, and a few other films.

This song is set to make waves with its electrifying energy and soulful lyrics. Stay tuned for this grand musical treat!

The movie is in its final stages of shooting and post-production, with just 5 days of shooting left. Everything is on schedule for a grand worldwide release on March 28, 2025.

About Hari Hara Veera Mallu:

Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit is a high-budget period action drama set against the backdrop of the 17th century Mughal Empire and stars Pawan Kalyan in the titular role. The film also features a stellar cast including Bobby Deol, Nidhhi Agerwal, Nargis Fakhri, and Nora Fatehi. Directed by Krish Jagarlamudi and Jyothi Krishna, the film is an epic tale of a legendary outlaw, Veera Mallu, who battles injustice and fights for the oppressed.

Cast & Crew Details:

Featuring: Pawan Kalyan, Nidhhi Agerwal, Bobby Deol, M. Nassar, Sunil, Raghu Babu, Subbaraju & Nora Fatehi
Directors: Krish Jagarlamudi, Jyothi Krishna
Producer: A Dayakar Rao
Presenter: AM Rathnam
Banner: Mega Surya Production
Music: MM Keeravaani
Cinematography: Gnanashekar VS, Manoj Paramahamsa
Editor: Praveen KL
Lyrics: ‘Sirivennela’ Seetharama Sastry, Chandrabose
Visual Effects: Hari Hara Suthan, Sozo Studios, Unifi Media, Metavix
Production Designer: Thota Tharani
Choreography: Brinda, Ganesh
Stunts: Sham Kaushal, Todor Lazaro JuJi, Ram-Laxman, Dhileep Subbarayan, Vijay Master

song announcement-ENGLISH

song announcement still 2

The Mad Gang is back with a BANG delivering the Maddest Song of the Year – ‘Swathi Reddy’

మ్యాడ్ స్క్వేర్’ చిత్రం నుండి రెండవ గీతం ‘స్వాతి రెడ్డి’ విడుదల
‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో, కేవలం ప్రకటనతోనే రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘మ్యాడ్’ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దీంతో ‘మ్యాడ్ స్క్వేర్’ పాటలపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంది. ‘లడ్డు గాని పెళ్లి’ అంటూ ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి గీతంకి విశేష స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతంగా ‘స్వాతి రెడ్డి’ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ‘లడ్డు గాని పెళ్లి’ తరహాలోనే విన్న వెంటనే కట్టిపడేసేలా ఎంతో ఉత్సహంగా ఈ గీతం సాగింది.
మొదటి భాగంలో ‘కళ్ళజోడు కాలేజ్ పాప’ వంటి బ్లాక్ బస్టర్ పాటతో ఒక ఊపు ఊపిన భీమ్స్ సిసిరోలియో, ‘స్వాతి రెడ్డి’తో మరోసారి తన సత్తా చాటారు. రాబోయే రోజుల్లో ఈ పాట తెలుగునాట ఒక ఊపు ఊపడం ఖాయంగా చెప్పవచ్చు. ఉత్సాహభరితమైన సంగీతం అందించడమే కాకుండా, అంతే ఉత్సాహంగా స్వాతి రెడ్డితో కలిసి ఈ పాటను ఆలపించారు భీమ్స్. ఇక సురేష్ గంగుల సాహిత్యం ప్రేక్షకుల నాడిని పట్టుకున్నట్టుగా ఉంది. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో అద్భుతమైన సాహిత్యం అందించారు.
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ ల త్రయం మరోసారి నవ్వించడానికి వస్తున్నారు. మొదటి భాగానికి మించిన వినోదాన్ని పంచడానికి ఈ ముగ్గురు సిద్ధమవుతున్నారు. అదే ఉత్సాహం తాజాగా విడుదలైన రెండవ గీతంలోనూ కనిపించింది. ఇక ఈ పాటలో రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ఈ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై శ్రీకర స్టూడియోస్ తో కలిసి హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ ఫిబ్రవరి 26, 2025న థియేటర్లలో అడుగు పెట్టనుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్
కూర్పు: నవీన్ నూలి
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
The Mad Gang is back with a BANG delivering the Maddest Song of the Year – ‘Swathi Reddy’
Mad Square has already earned its place as one of the most anticipated franchises in recent times. With Part 1 setting the bar sky high, all eyes are now on Part 2 and the team isn’t holding back!
The young and dynamic crew has dropped their second single ‘Swathi Reddy’. It’s an energetic and striking number that’s already hitting the bullseye as another instant chartbuster.
The track is composed by Bheems Ceciroleo who also delivered the blockbuster Kallajodu College Papa in the first part. This time he’s back with another rocking and crazy song that’s set to be the talk of the town in the days ahead. Bheems Ceciroleo and Swathi Reddy lend their voices to this energetic track and Suresh Gangula lyrics hit right on the audience’s pulse.
The trio of Sangeeth Shobhan, Narne Nithin and Ram Nithin are back in their element bringing their absolute best to this much awaited sequel. Reba Monica John sets the stage on fire with her electrifying moves in the special song. This song is going to be a theatrical treat for audience everywhere!
Renowned technicians Cinematographer Shamdat Sainudeen ISC and National Award winning Editor Navin Nooli are at their finest. Looks like Director Kalyan Shankar is on the brink of delivering yet another blockbuster with this crazy entertainer.
Produced by the esteemed Haarika Suryadevara and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas in collaboration with Srikara Studios.
Presented by the Blockbuster Producer S. Naga Vamsi.
The film is Set to hit theatres in the first half of 2025. Mad Square Part 2 is already raising the excitement levels. More updates will follow soon.
 2nd single001 copy MAD-2-Jamachettu-OutNow Image 1

*Naveen Polishetty, Sithara Entertainments “Anaganaga Oka Raju” Pre-Wedding Video teaser out now*

నవీన్ పొలిశెట్టి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ “అనగనగా ఒక రాజు” ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ విడుదల

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న యంగ్ స్టార్ లలో నవీన్ ఒకరు. అయితే తీవ్ర గాయాల కారణంగా ఆయన సంవత్సరం పాటు నటనకు దూరమయ్యారు. ఇప్పుడు పూర్తిగా కోలుకొని, తన నూతన చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్‌ను నిర్మాతలు ఆవిష్కరించారు. నవీన్ పొలిశెట్టి మాదిరిగానే ఈ వీడియో ఎంతో ప్రత్యేకంగా మరియు పూర్తి వినోదాత్మకంగా ఉంది.

ప్రీ వెడ్డింగ్ వీడియోలో నవీన్ పొలిశెట్టి పోషించిన రాజు పాత్ర తన వివాహానికి సిద్ధమవుతున్నట్లు చూపించారు. రాజు గారి పెళ్ళి అంటే ఎలా ఉండాలి? అంటూ భోజనాల దగ్గర చమ్మక్ చంద్ర చేసిన హడావుడి నవ్వులు పూయించింది. ఇక అనంత్ అంబానీ వివాహానికి హాజరైన హాలీవుడ్ ప్రముఖుల ఫోన్ నెంబర్ల కోసం, నవీన్ ఏకంగా ముఖేష్ అంబానీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు చూపించడం కడుపుబ్బా నవ్వించింది.
అలాగే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ సమయంలో వధువుగా మోస్ట్ హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కనిపించారు. ఈ ఫోటోషూట్ సమయంలో కూడా నవీన్ పోషించిన రాజు పాత్ర నవ్వులు పంచింది.

రాజుగా నవీన్ పొలిశెట్టి మార్క్ హాస్యం, అద్భుతమైన విజువల్స్, సంగీతం ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ ని బ్లాక్ బస్టర్ గా మలిచాయి. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, ఫోటోషూట్ సమయంలో మీనాక్షి చౌదరితో నవీన్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. వెండితెరపై ఈ అందమైన జోడి, ప్రేక్షకులను మాయ చేయడం ఖాయమనిపిస్తోంది.

అనగనగా ఒక రాజు చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 2025లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా విడుదలైన ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్, ఈ చిత్రంతో నవీన్ పొలిశెట్టి మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోవడం ఖాయమని హామీ ఇస్తుంది.

*Naveen Polishetty, Sithara Entertainments “Anaganaga Oka Raju” Pre-Wedding Video teaser out now*

Young sensation Naveen Polishetty, has been on a roll with three consecutive blockbusters at the box office. He is the most in demand young star right now. He was out of action this year due to multiple fractures. He has recovered and is back with his new film Anaganaga Oka Raju.

The film is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas. Srikara Studios presenting the film. On the occasion of Naveen Polishetty’s birthday, makers unveiled the pre-wedding video teaser. The video is unique and fully entertaining, just like Naveen Polishetty.

The pre-wedding video showcases Raju, played by Naveen Polishetty, preparing for his marriage. In the video, Naveen calls Mukesh and hilariously requests the Hollywood celebrities that attended the Anant’s wedding. During the photoshoot, the bride, played by the most happening actress, Meenakshi Chaudhary.

Naveen’s character Raju’s signature humour, quality visuals, and thumping score make it a blockbuster one. Naveen’s comedic timing and action in this hilarious glimpse impress everyone. His adorable chemistry with Meenakshi Chaudhary and their photoshoot poses really bring laughs.

Anaganaga Oka Raju will be directed by debutant director Maari. Mickey J Meyer is scoring the music for the film. The pre wedding video teaser promises a blockbuster slated for grand release in 2025.

 

AOK - Couple Palace - post  Clean (1) AOK-Couple-Poster (1) AOR-WeddingVideo AOR-Plain Still

Nandamuri Balakrishna – Bobby Kolli – Thaman S – Sithara Entertainments ‘Chinni’ Lyrical Video from Daaku Maharaaj is Out

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుంచి రెండవ గీతం ‘చిన్ని’ విడుదల

వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ‘డాకు మహారాజ్’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి, ఇటీవల విడుదలైన మొదటి గీతం ‘ది రేజ్ ఆఫ్ డాకు’కి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతం చిన్ని విడుదలైంది.
బాలకృష్ణ, తమన్ కలయిక అంటే పాటలపై సంగీత ప్రియుల్లో అంచనాలు ఉండటం సహజం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘డాకు మహారాజ్’కి తమన్ అద్భుతమైన సంగీతం అందించారని మొదటి గీతంతోనే అర్థమైంది. ఇక ఇప్పుడు రెండో గీతంతో బాలకృష్ణ-తమన్ కలయిక ఎందుకంత ప్రత్యేకమైనదో మరోసారి స్పష్టమైంది. చిన్ని పాటకు తమన్ అందించిన సంగీతం హృద్యంగా ఉంది. మనసుకి హత్తుకునే ఆ సంగీతానికి తగ్గట్టుగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత అందం తీసుకొచ్చింది. ఆయన కలం నుంచి జాలువారిన “నువ్వు తే అంటే నీ ముందు తారా తీరాలే. నువ్వు నవ్వుతుంటే అమావాస్యయినా దీపావళిగా మారాలే.” వంటి సున్నితమైన, సుమధురమైన పంక్తులు కట్టి పడేశాయి. తన మధుర గాత్రంతో గాయకుడు విశాల్ మిశ్రా పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు.
లిరికల్ వీడియోని గమనిస్తే అద్భుతమైన విజువల్స్, విశ్వ రఘు ఆకట్టుకునే కొరియోగ్రఫీ చిన్ని పాటకు జీవం పోశాయి. బాలకృష్ణ, చిన్నారి మధ్య భావోద్వేగ మరియు ఉల్లాసభరితమైన బంధాన్ని ఆవిష్కరిస్తూ ఊటీ నేపథ్యంలో ఈ పాటను ఎంతో అందంగా చిత్రీకరించారు. పాప క్షేమం, సంతోషం కోరే రక్షకుడిగా బాలకృష్ణ ఈ ‘చిన్ని’ గీతంలో కనిపిస్తున్నారు. అలాగే లిరికల్ వీడియోలో చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
‘చిన్ని’ అనే ఈ మధుర గీతం బాలకృష్ణపై కుటుంబ ప్రేక్షకులకు, ఈ తరం పిల్లలకు ఉన్న అభిమానాన్ని మరింత పటిష్టం చేస్తుంది అనడంలో సందేహం లేదు. అటు పిల్లలు, ఇటు పెద్దలు మెచ్చేలా ఈ పాట ఉంది.
‘డాకు మహారాజ్’ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
‘డాకు మహారాజ్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
 
Nandamuri Balakrishna – Bobby Kolli – Thaman S – Sithara Entertainments  ’Chinni’ Lyrical Video from Daaku Maharaaj is Out 
The lyrical video of ‘Chinni’, the second single from the highly anticipated Daaku Maharaaj, has been unveiled, offering audiences a heartwarming glimpse into the emotional and playful bond between Nandamuri Balakrishna and a young girl. This soulful melody beautifully captures the essence of innocence, care and protection, making it a perfect addition to the film’s music album.
Penned by Ananth Sriram, the lyrics seamlessly blend melody with a nostalgic school rhyme, creating an emotional depth that resonates deeply with listeners. Vishal Mishra’s vocals elevate the track, turning it into a heartfelt ballad that tugs at the heartstrings. Once again, Thaman S showcases his unique compositional brilliance with this memorable and evocative piece.
Set against the picturesque backdrop of Ooty, the song is brought to life with stunning visuals and heartfelt choreography by Vishwa Raghu. The lyrical video features playful montages of Balakrishna and the young girl, portraying him as a caring protector whose sole focus is her happiness. Adding further charm to the visuals are Chandini Chowdary and Urvashi Rautela whose presence enhances the song’s freshness and emotional appeal.
This beautiful, emotional melody is sure to strengthen the connection between Balakrishna and his family audience, striking a chord with both children and adults. With its soothing composition and poignant narrative, “Chinni” is poised to become a favorite among families, further solidifying Balakrishna’s rapport with younger audiences.
Alongside Nandamuri Balakrishna, the film also stars Bobby Deol in a crucial role. Pragya Jaiswal, Shraddha Srinath, and Chandhini Chowdary, Urvashi Rautela play significant roles, adding further prominence to the narrative.
Directed by Bobby Kolli, Daaku Maharaaj is shaping up to be a grand cinematic experience. With stellar cinematography by Vijay Kartik Kannan and precise editing by Niranjan Devaramane, the film promises to captivate audiences on a grand scale Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, the film is slated for a worldwide theatrical release on January 12, 2025, this Sankranti. The film promises to blend high-octane action with heartwarming moments, delivering an unforgettable experience for audiences.
Chinni Song-Pic3 Chinni Song-Pic1 Chinni Song-Pic2 Chinni Song-Pic4

*‘Daaku Maharaaj’ Grand Worldwide Release on January 12*

డాకు మహారాజ్’ సినిమాలో సరికొత్త బాలకృష్ణను చూస్తారు : ప్రెస్ మీట్ లో చిత్ర దర్శక నిర్మాతలు

బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’ : ప్రెస్ మీట్ లో చిత్ర దర్శక నిర్మాతలు

నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలతో ఆ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలలో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “గత 20-30 ఏళ్ళలో బాలకృష్ణ గారిని చూడనంత కొత్తగా ‘డాకు మహారాజ్’లో కనిపించబోతున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది. బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుంది. జనవరి 12న ప్రపంచం వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నాం. ప్రచార కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా మూడు భారీ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. జనవరి 2న హైదరాబాద్ లో ట్రైలర్ విడుదల వేడుక జరపాలి అనుకుంటున్నాం. జనవరి 4న యూఎస్ లో ప్రీ రిలీజ్ వేడుక చేసి, ఒక పాట విడుదల చేయాలి అనుకుంటున్నాం. జనవరి 8న ఆంధ్రాలో ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నాం.” అన్నారు.

దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, ” పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. వంశీ గారు చెప్పినట్లు, సినిమా చాలా బాగా వచ్చింది. బాలకృష్ణ గారి నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. అదే సమయంలో ఈ సినిమా విజువల్ గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అలాగే ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఉంటాయి. దర్శకుడు ఏం చెప్తే అది నూటికి నూరు శాతం బాలకృష్ణ గారు చేస్తారు. అలాంటి హీరోతో ఏదైనా కొత్తగా చేద్దామని చేసిన ప్రయత్నమే డాకు మహారాజ్. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది.” అన్నారు.

‘డాకు మహారాజ్’ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంచలన స్వరకర్త తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.

*‘Daaku Maharaaj’ Grand Worldwide Release on January 12*

The highly anticipated movie Daaku Maharaaj, starring Nandamuri Balakrishna, is gearing up for its grand release on January 12. The film has completed its shooting formalities and is nearing completion in post-production. Bobby Kolli, the director, and Naga Vamsi, the producer, spoke today at a press meet in Hyderabad, expressing their confidence in the film’s success.

Speaking at the event, Director Bobby Kolli shared, “From the day I thought of making a film with Nandamuri Balakrishna, I aimed to present him in a never-before-seen way while catering to his fans and the masses. I want to make this film appeal to his fans from his prime to today’s children, who rave for NBK’s songs and dialogues, as well as to the people who enjoy his talk show Unstoppable.”

Producer Naga Vamsi said, “We are confident that Daaku Maharaaj will remain one of Nandamuri Balakrishna’s best films in the last 20-30 years, with stunning visuals. We recently watched the first half of the film with Thaman’s re-recording, and we believe it will exceed expectations and become a massive blockbuster.”

The film promises a unique cinematic experience, and the team is eagerly preparing for its worldwide release on January 12.

Movie Title: Daaku Maharaaj
Release Date: January 12, 2025
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Presented by: Srikara Studios

Cast & Crew :
Hero: Nandamuri Balakrishna
Co-Stars: Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandhini Chowdary
Director: Bobby Kolli
Producers: Naga Vamsi S, Sai Soujanya
Music Director: Thaman S
Cinematography: Vijay Kartik Kannan
Editor: Niranjan Devaramane, Ruben
Production Designer: Avinash Kolla

 

GANI3426 GANI3425