About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Oopirey, the third song from Siddharth, Divyansha Kaushik’s bilingual action romance Takkar launched

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి ‘ఊపిరే’ పాట విడుదల
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’ పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఊపిరే’ అంటూ సాగే మూడో పాట విడుదలైంది.
ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, కృష్ణకాంత్ అన్ని పాటలకు సాహిత్యం అందించారు. ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’ పాటల మాదిరిగానే ‘ఊపిరే’ పాట కూడా కట్టిపడేసేలా ఉంది. అభయ్ జోధ్‌పుర్కర్, సంజన కలమంజే ఈ పాటను ఎంతో అందంగా ఆలపించారు. “సొగసే మా వీధి వైపు.. సరదాగా సాగెనే.. దిశలేమో నన్ను చూసి.. కను గీటెనే” అంటూ కథానాయికపై కథానాయుడికి ఉన్న ప్రేమను తెలిపేలా ఎంతో అందంగా ఉంది ఈ పాట. తేలిక పదాలతో లోతైన భావం పలికించారు కృష్ణకాంత్.
నాయకా నాయికల మధ్య మొహాన్ని తెలిపేలా అద్భుతమైన సాహిత్యంతో పాట సాగింది. సంగీతానికి, సాహిత్యానికి తగ్గట్టుగానే నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. పాట వినగానే నచ్చేలా ఉంది. గత రెండు పాటల్లాగే ఈ పాట కూడా విశేష ఆదరణ పొందుతుందని స్పష్టమవుతోంది. మొత్తానికి టక్కర్ నుంచి విడుదలవుతున్న ఒక్కో పాట విశేషంగా ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను రోజురోజుకి పెంచేస్తోంది.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తున్నారు.
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్టర్: ఉదయ కుమార్ కె
స్టంట్స్ కోరియోగ్రఫీ: దినేష్ కాశి
పబ్లిసిటీ డిజైన్స్: 24AM
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహా నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్
Oopirey, the third song from Siddharth, Divyansha Kaushik’s bilingual action romance Takkar launched
Siddharth, known for films like Bommarillu and Nuvvostanante Nenoddantana, is set to woo crowds in a refreshing avatar for his upcoming Tamil-Telugu action romance Takkar. Written and directed by Karthik G Krish, the film features Divyansha Kaushik as the female lead.
Produced by TG Vishwa Prasad and Abhishek Agarwal, in collaboration with People Media Factory, Abhishek Agarwal Arts, and Passion Studios, Takkar releases in theatres on June 9. After hogging the limelight for the action-packed trailer, teaser and the two songs Kayyale and Pedhavulu Veedi Maunam, a new single from the film titled Oopirey was unveiled today.
Nivas K Prasanna composes the music for the film while Krishna Kanth is the sole lyricist. Abhay Jodhpurkar, Sanjana Kalmanje have crooned for the feel-good, soothing number Oopirey. ‘Sogasey Maa Veedhi Vaipu..Saradaga Saageney..Dishalemo Nannu Choosi..Kanu Geeteny,’ the opening lines express the protagonist’s fascination for his lady love in simple yet effective words.
The lyrics are full of metaphors from nature to convey the intensity of their romance. The terrific on-chemistry between the lead pair further contributes to its impact. The song has a certain surreal quality and grows on the listener gradually. The music of Takkar has already received an overwhelming response and added to the buzz surrounding the film.
Apart from Siddharth and Divyansha, Takkar boasts a talented ensemble cast including Abimanyu Singh, Yogi Babu, Munishkanth, and RJ Vigneshkanth in significant roles. Vanchinathan Murugesan handles the cinematography, and GA Gowtham takes charge of the editing. People Media Factory and Abhishek Agarwal Arts have previously delivered noteworthy hits like Karthikeya 2 and Dhamaka, further raising expectations for the success of Takkar.
Casts: Siddharth, Divyansha, Abimanyu Singh, Yogi Babu, Munishkanth, RJ Vigneshkanth.
Written and directed by Karthik G Krish
Cinematographer: Vanchinathan Murugesan
Editor: GA Gowtham
Art Direction: Udaya Kumar K
Stunts Choreography: Dinesh Kasi
Publicity Designs : 24AM
Teaser cut – Pradeep E Ragav
Producers: T G Vishwa Prasad, Abhishek Agarwal
Co-producer: Vivek Kuchibhotla
Executive producer : Mayank Agarwal
Takkar 12

*Unveiling the Thrills: Exploring the Intriguing Trailer of Siddharth’s bilingual action romance ‘Takkar’*

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెచ్చిన సిద్ధార్థ్ ‘టక్కర్’ ట్రైలర్
 
* సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ‘టక్కర్’ ట్రైలర్ విడుదల
 
అంచనాలను అమాంతం పెంచేసిన సిద్ధార్థ్ ‘టక్కర్’ ట్రైలర్ 
చార్మింగ్ హీరో సిద్ధార్థ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధార్థ్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి నెలకొనడం సహజం. ఇప్పుడు ఈ చార్మింగ్ హీరో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
తాజాగా చిత్ర బృందం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ సంగమంగా రూపొందిన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.
ఈరోజు(మే 21) సాయంత్రం 5 గంటలకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ‘టక్కర్’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న టక్కర్ సినిమా ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ ట్రైలర్ ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా ఉందని కొనియాడారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
విడుదలైన ‘టక్కర్’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. “ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్ ని నిర్ణయిస్తుంది. ఆ ఆశని నెరవేర్చుకోడానికి ధనమే ఇంధనం. దానిని సంపాదించుకోడానికి ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఆ దారి అందరికీ ఒకటైనప్పుడు” అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న సాధారణ యువకుడిగా కథానాయకుడు కనిపిస్తుండగా, బాగా డబ్బున్న యువతిగా కథానాయిక కనిపిస్తోంది. వారి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తున్నాయి. తనని ఎంతగానో నమ్మిన కథానాయికని డబ్బు కోసం కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి కథానాయకుడికి ఎందుకు వచ్చింది? వారిని ప్రతినాయకులు ఎందుకు వెంటాడుతున్నారు? కథానాయిక ఆత్మహత్యాయత్నానికి కారణం కథానాయకుడేనా? అనే ప్రశ్నలతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ట్రైలర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. ఇక ట్రైలర్ లో యోగిబాబు హాస్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే “డబ్బు సంపాదిస్తానని చెప్పు.. కానీ డబ్బున్నోడిని అవుతానని అనకురా.. నాకు భయంగా ఉంది”, “నా దగ్గర డబ్బుల్లేవు.. నీకు ఇడ్లీలు కొనివ్వాలంటే, నా కిడ్నీలు అమ్ముకోవాలి”, “నూడుల్స్ తినే నీకే ఇంతుంటే.. చేపల పులుసు తినే నాకెంత ఉంటుందిరా” వంటి సంభాషణలు అలరిస్తున్నాయి. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే.. ఖర్చు విషయంలో వెనకాడకుండా భారీ స్థాయిలో నిర్మించారని అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది.
ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలతో ‘టక్కర్’పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’ పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించి, సిద్ధార్థ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె, ఎడిటర్ గా జీఏ గౌతమ్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్టర్: ఉదయ కుమార్ కె
స్టంట్స్ కోరియోగ్రఫీ: దినేష్ కాశి
పబ్లిసిటీ డిజైన్స్: 24AM
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహా నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్
*Supreme Hero Sai Dharam Tej launches the trailer of Siddharth’s bilingual action romance ‘Takkar’*
 
*Unveiling the Thrills: Exploring the Intriguing Trailer of Siddharth’s bilingual action romance ‘Takkar’*
Siddharth, known for his successful films such as Bommarillu and Nuvvostanante Nenoddantana, is all set to mesmerize the audience once again with his upcoming Tamil-Telugu action romance titled Takkar. Directed by Karthik G Krish and written by the same, the film features Divyansha as the female lead. Takkar is a joint production venture by TG Vishwa Prasad and Abhishek Agarwal, in collaboration with People Media Factory, Abhishek Agarwal Arts, and Passion Studios.
The makers have announced that Takkar will hit the theaters on June 9, much to the anticipation of fans. The teaser of the film, along with two songs titled Kayyale and Pedhavulu Veedi Maunam, both composed by Nivas K Prasanna, has received an overwhelming response and added to the buzz surrounding the film.
Supreme Hero Sai Dharam Tej has launched Takkar’s trailer today. “Happy to launch the Trailer of #Takkar for my producers @peoplemediafcy. Very Intriguing & Entertaining. All the best #Siddharth bro, @Karthik_G_Krish @itsdivyanshak @AAArtsOfficial @PassionStudios_ @nivaskprasanna @editorgowtham and the whole team,” tweeted Sai Dharam Tej.
Takkar’s trailer released today delivers an exhilarating mix of action, drama, and romance that promises to captivate audiences. It delves into the lives of diverse individuals and their strategies to amass wealth swiftly. With its intricate plot, the film takes viewers on a rollercoaster ride filled with unexpected twists, turns, and a gripping kidnapping drama. Moreover, the movie doesn’t shy away from infusing ample doses of humor, adding an extra layer of entertainment.
In Takkar, Siddharth showcases a fresh look with a beard under his chin, while Divyansha, who is familiar to Telugu cinema enthusiasts through films like Majili and Ramarao on Duty, sizzles the screen and delivers a promising performance as the female lead. The film is expected to redefine Siddharth’s image as an action hero and unveil a new dimension to his acting abilities. Takkar will be released in both Tamil and Telugu languages on June 9, offering a thrilling and captivating experience to the audience.
Apart from Siddharth and Divyansha, Takkar boasts a talented ensemble cast including Abimanyu Singh, Yogi Babu, Munishkanth, and RJ Vigneshkanth in significant roles. The music for the film is composed by Nivas K Prasanna, while Vanchinathan Murugesan handles the cinematography, and GA Gowtham takes charge of the editing. People Media Factory and Abhishek Agarwal Arts have previously delivered noteworthy hits like Karthikeya 2 and Dhamaka, further raising expectations for the success of Takkar.
Casts: Siddharth, Divyansha, Abimanyu Singh, Yogi Babu, Munishkanth, RJ Vigneshkanth.
Written and directed by Karthik G Krish
Cinematographer: Vanchinathan Murugesan
Editor: GA Gowtham
Art Direction: Udaya Kumar K
Stunts Choreography: Dinesh Kasi
Publicity Designs : 24AM
Teaser cut – Pradeep E Ragav
Producers: T G Vishwa Prasad, Abhishek Agarwal
Co-producer: Vivek Kuchibhotla
Executive producer : Mayank Agarwal

Takkar 22

People Media Factory, Abhishek Agarwal Arts to release Siddharth’s bilingual Takkar on June 9

జూన్ 9న విడుదల కానున్న సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.
సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ టీజర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఇక టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’ పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. కథానాయిక స్వభావాన్ని తెలియజేసేలా, ప్రకృతి అందాల నడుమ చిత్రీకరించిన ‘కయ్యాలే’ పాట కట్టిపడేసింది. నాయకానాయికల ఘాటు ప్రేమను తెలిపేలా సాగిన ‘పెదవులు వీడి మౌనం’ పాట మనసు దోచేసింది. ఇలా పాటలు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించి, సిద్ధార్థ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె, ఎడిటర్ గా జీఏ గౌతమ్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్టర్: ఉదయ కుమార్ కె
స్టంట్స్ కోరియోగ్రఫీ: దినేష్ కాశి
పబ్లిసిటీ డిజైన్స్: 24AM
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహా నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్
People Media Factory, Abhishek Agarwal Arts to release Siddharth’s bilingual Takkar on June 9
Siddharth, who shot to fame with several hits like Bommarillu, Nuvvostanante Nenoddantana, will be seen in next in a Tamil-Telugu action romance titled Takkar. Divyansha plays the female lead in the film, written and directed by Karthik G Krish. Takkar is jointly produced by TG Vishwa Prasad and Abhishek Agarwal under People Media Factory and Abhishek Agarwal Arts in collaboration with Passion Studios.
The film is all set to release in theatres on June 9, revealed the makers. The teaser of Takkar, two songs from the film, Kayyale, Pedhavulu Veedi Maunam, which has music by Nivas K Prasanna, opened to good responses and has contributed to its buzz. Takkar takes us through the highs and lows in the relationship between a poor boy and a rich girl. While the guy is a hard-core romantic, the girl, despite liking him, doesn’t believe in the idea of love and marriage.
Siddharth, with beard under his chin, will be seen in a new look in the film while the lead actress Divyansha is a familiar face in Telugu with films like Majili, Ramarao on Duty, name a few. Takkar promises to revamp Siddharth’s image as an action hero and unveil a new dimension to him as an actor.  The action romance will be out in theatres in Tamil and Telugu on June 9.
Abimanyu Singh, Yogi Babu, Munishkanth, RJ Vigneshkanth play other important roles in the film. Nivas K Prasanna scores the music. Vanchinathan Murugesan cranks the camera and GA Gowtham is the editor. People Media Factory and Abhishek Agarwal Arts scored big hits in their previous collaborations like Karthikeya 2 and Dhamaka.
Casts: Siddharth, Divyansha, Abimanyu Singh, Yogi Babu, Munishkanth, RJ Vigneshkanth.
Written and directed by Karthik G Krish
Cinematographer: Vanchinathan Murugesan
Editor: GA Gowtham
Art Direction: Udaya Kumar K
Stunts Choreography: Dinesh Kasi
Publicity Designs : 24AM
Teaser cut – Pradeep E Ragav
Producers: T G Vishwa Prasad, Abhishek Agarwal
Co-producer: Vivek Kuchibhotla
Executive producer : Mayank Agarwal
Takkar 1 Takkar 3 Takkar 9 Takkar 13 Takkar 18 Takkar 19 Takkar 20 Takkar 22 Takkar 23 Takkar 24 Takkar 25

Singer, preacher, propagator of Bhagavadgita, L V Gangadhara Sastry to receive honorary doctorate

గీతాగాన, ప్రవచన,ప్రచారకర్త ఎల్.వి. గంగాధర శాస్త్రి కి “గౌరవ డాక్టరేట్ “
ప్రసిద్ధ గాయకులు, గీతాగాన,ప్రవచన ప్రచారకర్త శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి కి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లోని “మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం” “గౌరవ డాక్టరేట్ ” ప్రకటించింది.
భారతీయ సంస్కృతి ని పరిరక్షించడం లో భాగంగా – భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితంగా గాన చేసి వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, విడుదల చేసి అంతటితో తన భాధ్యత తీరిపోయిందని భావించకుండా -స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారమే తన జీవితంగా మలుచుకున్నందుకు శ్రీ గంగాధర శాస్త్రి కి “గౌరవ డాక్టరేట్ ” ను ప్రకటిస్తున్నామని పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి.జి .విజయకుమార్ తెలియజేసారు.
మే 24, 2023 ఉదయం 11 గంటలకు కాఠీ మార్గ్ లోని విక్రం కీర్తి మందిరం, ఉజ్జయిని (మధ్యప్రదేశ్ ) లో జరిగే మహర్షి పాణిని సంస్కృ త్ ఏవం వైదిక్ విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవం లో ఆయనకు గౌరవ డాక్టరేట్ తో సన్మానించునట్లు తెలిపారు.
ఈ సందర్బంగా గీతాగాన, ప్రవచన , ప్రచారకర్త భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్.వి. గంగాధర శాస్త్రి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ -
మధ్యప్రదేశ్ గవర్నరు, ఆ రాష్ట్రం లోని విశ్వవిద్యాలయాల కులపతి శ్రీ మంగుభాయ్  పటేల్ కు, మహర్షి పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ విజయ్ కుమార్ సి.జి కు, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కు , ఉన్నత విద్యాశాఖా మంత్రి శ్రీ మోహన్ యాదవ్ లకు వినమ్ర పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
కాగా – ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా తాను 17 ఏళ్లుగా చేస్స్తున్న కృషిని గుర్తించిన భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ , తెలుగువాడైన శ్రీ పి . మురళీధరరావు ప్రభత్వం దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా తనకీ గౌరవం దక్కిందని, అందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ న్నా న ని గంగాధర శాస్త్రి అన్నారు.
సంస్కృత వ్యాకర్త అయినా ‘పాణిని మహర్షి ‘ పేరు తో స్థాపించిన విశ్వవిద్యాలయం నుంచి ఈ గౌరవం పొందడం సముచితంగా, అదృష్టంగా భావిస్తున్నా న ని  అన్నారు.  తనకు లభించిన ఈ గౌరవం – తనకు జన్మనిచ్చిన తల్లి దండ్రులకు, తన 17 ఏళ్ళ భగవద్గీతా ప్రయాణం లో సహకరించిన భార్యాబిడ్డలకు, మార్గ నిర్దేశకత్వం చేసిన గురువులకు, ప్రపంచం నలుమూలల నుండి చేయూతనందించిన భగవద్గీత అభిమానులకే చెందుతుందని, తాను కేవలం శ్రీ కృష్ణుడు ఉపయోగించుకున్న సాధనం మాత్రమేనని గంగాధర శాస్త్రి అన్నారు.
స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ‘భగవద్గీత ‘ పునాదుల పై నిర్మించిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా గీతా ప్రచారం తో పాటు -
* పేద విద్యార్థులకు, అనాధ బాలలకు వికలాంగులకు , వృద్ధా శ్ర మాలకు చేయూత
* గోసేవ, యోగ శిక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణ
*ఆయుర్వేద, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ
వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు  గంగాధర శాస్త్రి చెప్పారు.
ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా ఆధ్యాత్మిక సామాజిక సేవాక్షేత్రంగా తెలుగునాట ‘ భగవద్గీతా యూనివర్సిటీ ‘ స్థాపనే పరమ లక్ష్యం గా ‘భగవద్గీతా ఫౌండేషన్’ కృషి చేస్తుందని చెబుతూ మతాలకు అతీతమైన జ్ఞాన గ్రంధం ‘భగవద్గీత’ ను ప్రతి ఒక్కరూ చదివి ఆచరించాలని, గీతను బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించాలని కోరారు .

Singer, preacher, propagator of Bhagavadgita, L V Gangadhara Sastry to receive honorary doctorate

Noted singer, preacher, propagator of Bhagavadgita, LV Gangadhara Sastry is all set to received an honorary doctorate from the Madhya Pradesh-based Maharshi Panini Sanskrit Evam Vedic University.
“For his efforts to spread the glory of Indian tradition, compose 700 slokas from the Bhagavadgita in a musical form along with the Telugu translation, recording it with high-end technology and dedicating his life to spread the essence of the text, the university has decided to honour him with a doctorate,” claimed the University’s Vice Chancellor Acharya C G Vijay Kumar.
He’ll receive the doctorate at Vikram Kirti Mandir, Ujjain as part of the university’s fourth convocation ceremony. Expressing his happiness about the felicitation, the founder of the Bhagavadgita Foundation said, “I take this opportunity to thank Madhya Pradesh’s governor Mangubhai C. Patel, the University’s Vice Chancellor Vijay Kumar CG, CM Shivraj Singh Chouhan and Education Minister Mohan Yadav.
While Gangadhara Sastry founded Bhagavadgita Foundation 17 years ago, it was BJP’s senior politician P Muralidhar Rao who noticed his stellar efforts and gave him his due with the honour. “I truly thank him for this recognition,” the former said. The singer, preacher shared it was a privilege to be receiving an honour from a university named after the sage Panini Maharshi. He dedicated the doctorate to his wife, children, gurus, patrons of the Bhagavadgita across the globe and felt he was merely being Lord Krishna’s messenger to spread the word about the text.
Bhagavadgita Foundation, a non-profit, spiritual organisation, is my attempt to bring about an ideal society and take Bhagavadgita across the world. Through this forum, I help the orphans, needy, specially abled children, take care of the welfare of cows, educate people about yoga, vedas, ayurveda, tradition and environmental conservation, Gangadhara Sastry said.
The main aim behind the foundation is to establish a first-of-its-kind Bhagavadgita University, spread knowledge about Bhagavadgita among kids from childhood, take up social service beyond barriers and ensure a better society, he added.
 Card Card Card Card Document 92 Sri L V Gangadhara sastry. jpg WhatsApp Image 2023-05-18 at 18.18.35 WhatsApp Image 2023-05-18 at 18.18.35 WhatsApp Image 2023-05-18 at 18.18.35 WhatsApp Image 2023-05-18 at 18.18.36 WhatsApp Image 2023-05-18 at 18.18.36 WhatsApp Image 2023-05-18 at 18.18.37 WhatsApp Image 2023-05-18 at 18.18.37 WhatsApp Image 2023-05-18 at 18.18.38

Pawan Kalyan-Sai Dharam Tej’s much-awaited drama, directed by Samuthirakani, titled Bro; here’s the mind-blowing motion poster

 పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ చిత్రానికి ‘BRO’ టైటిల్ ఖరారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ‘PKSDT’ నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేశారు. తన మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి స్క్రీన్ పంచుకుంటున్న చిత్రమిది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.
‘PKSDT’ టైటిల్, ఫస్ట్ లుక్ ని మే 18న సాయంత్రం 4:14 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ క్షణం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూశారు. ఇప్పుడు ఆ క్షణం రానే వచ్చింది. ఈ సినిమాకి ‘BRO’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను పెట్టారు. కాలాన్ని సూచించేలా ఇంగ్లీష్ అక్షరాలతో ఎంతో అందంగా రూపొందించిన టైటిల్ లోగో ఆకట్టుకుంటోంది. ఇక ఈ ‘బ్రో’ మూవీ మోషన్ పోస్టర్ అయితే కట్టిపడేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో పరమేశ్వరుడి రూపం కనిపిస్తుండగా.. “కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం” అనే శ్లోకం వినిపిస్తుండగా.. మెడలో ఓం లాకెట్ ధరించి స్టైలిష్ గాడ్ లా కనిపిస్తున్న కథానాయకుడు పవన్ కళ్యాణ్ రూపాన్ని పరిచయం చేసిన తీరు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. గీత రచయిత కళ్యాణ చక్రవర్తి సాహిత్యం అందించారు. అలాగే ఈ చిత్రాన్ని 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘బ్రో’ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం పట్ల సాయి ధరమ్ తేజ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. నా గురువు అయిన పవన్ కళ్యాణ్ మామతో కలిసి పనిచేయడం నా అతిపెద్ద కల అని, ఆ కల నెరవేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇంతటి అదృష్టం దక్కినందుకు ఓ అభిమానిగా మనసులోనే నాట్యం చేస్తున్నానని తెలిపారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతోంది. ‘కార్తికేయ-2′, ‘ధమాకా’ వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. ప్రస్తుతం పలు చిత్రాలను నిర్మిస్తోంది. అందులో ‘BRO’ వంటి భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో మొదటిసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం, పైగా ఇందులో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండటంతో ప్రకటనతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాణ సంస్థ ఎక్కడా వెనకాడకుండా భారీస్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమా చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని మరింత పెంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
‘BRO’ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ఇంకా పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ మిగిలిన భాగంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ , సముద్ర ఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా,తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృథ్విరాజ్, నర్రాశ్రీను, యువలక్ష్మి , దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్
రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: సెల్వ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
కో-డైరెక్టర్: బి. చిన్ని
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
 
Pawan Kalyan-Sai Dharam Tej’s much-awaited drama, directed by Samuthirakani, titled Bro; here’s the mind-blowing motion poster 
People Media Factory, one of the major production houses in Telugu cinema, that backed hits like Karthikeya 2, Dhamaka are back with another biggie. Their next, in collaboration with ZEE Studios, is Pawan Kalyan-Sai Dharam Tej’s drama, written and directed by Samuthirakani. Trivikram pens the screenplay, dialogues for the film whose title, motion poster were unveiled today.
Pawan Kalyan’s ‘mega’ combo with Sai Dharam Tej is officially titled Bro (The Avatar). This is the first time the star is teaming up with his nephew for a film, making it one of the most anticipated on-screen collaborations in Telugu cinema. Bro is a family drama with an element of fantasy, spirituality and the motion poster gives us every reason for us to be curious about the project.
The motion poster with a catchy background score begins on boisterous note with a Sanskrit hymn ‘Kaala triguna samshlesham…Kaala gamana sankaasham..Kaala varjayeth chaaranam..Kaala janamanaa jaayatey..’ penned by noted lyricist Kalyan Chakravarthi. The later part of the song-bit smartly uses the title ‘bro’ in the lyric to leave behind a stellar impact.
The glimpse, which is a perfect morale booster for Pawan Kalyan fans, begins with the opening of a huge door with motifs of Lord Shiva, chakras, time and other mythical elements grabbing your attention. The star is at his stylish best donning shades and a black costume.
Sharing his excitement while unveiling the motion poster, Sai Dharam Tej wrote, “Working with my Guru @PawanKalyan mama is a BIG BIG DREAM come true. And now I’m super excited and blessed at this amazing opportunity. ( The fanboy in me is dancing like crazy). Happy to present you all the Title & Motion Poster of our #BroTheAvatar.”
The shoot of Bro is nearing completion. The film be wrapped in another 15-working days while the post-production formalities have already commenced and are progressing at a brisk pace. Bro is set to release in theatres on July 28 this year.
Ketika Sharma, Priya Prakash Varrier, Samuthirakani, Rohini, Rajeswari Nair, Raja, Tanikella Bharani, Vennela Kishore, Subbaraju, Prudhvi Raj, Narra Srinu, Yuva Lakshmi, Devika, Ali Reza and Surya Srinivas play other important roles in Bro. Sujith Vaasudev cranks the camera for the film while S Thaman composes the music.
Written & Directed by: P. Samuthirakani
Screenplay | Dialogues: Trivikram
Producer : T G Vishwa Prasad
Co-producer: Vivek Kuchibhotla
D.o.p: Sujith Vaasudev
Music: S Thaman
Art: A S Prakash
Editor : Navin Nooli
Fights: Selva
Vfx supervisor : Nikhil Koduri
Executive producer: S. Venktrathnam
Co- Director: B. Chinni Gatakala
Pro: Lakshmivenugopal
FL-PKSDT still