About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Panja Vaisshnav Tej and Sithara Entertainments’ Adikeshava title & first glimpse released now

పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రానికి ‘ఆదికేశవ’ టైటిల్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ గ్లింప్స్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు మంచి కంటెంట్‌తో పాటు మంచి విలువలతో ప్రేక్షకులను అలరించే చిత్రాలను నిర్మిస్తున్నాయి.
ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పంజా వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌లో తొలిసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేస్తుండటం విశేషం.
పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా రూపొందుతోన్న ఈ అదిరిపోయే యాక్షన్ ఫిల్మ్ ‘PVT04′కి ‘ఆదికేశవ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం నాడు చిత్ర బృందం ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ ను విడుదల చేసింది.
ఆదికేశవ గ్లింప్స్ లో పంజా వైష్ణవ్ తేజ్ మనకు రుద్రగా పరిచయం అయ్యాడు. ఒక చిన్న గ్రామంలో గూండాలు శివాలయాన్ని ఆక్రమించాలని చూస్తుండగా, రుద్ర వారిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది?, ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తిని కలిగించేలా గ్లింప్స్ ఉంది.
గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా గ్లింప్స్ ని ముగించిన తీరు ఆకట్టుకుంది. రుద్రగా పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం చూపించారు. లుక్స్, యాక్షన్ తో అదరగొట్టారు. పవర్ ఫుల్ యాక్షన్ పాత్రలో తేలికగా ఒదిగిపోయారు. ఇది అసలు ఆయనకు మొదటి యాక్షన్ ఫిల్మ్ అనే భావన మనకు కలగదు.
అందరి మనసులను దోచుకునే అందమైన చిత్ర పాత్రలో శ్రీలీల నటిస్తుండగా, వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ నటిస్తున్నారు.
ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో ఆయన అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఆదికేశవ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్‌ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గ్లింప్స్ కి ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచేసింది.
జూలై నెలలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
తారాగణం: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, అపర్ణా దాస్, జోజు జార్జ్ తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి
సంగీత దర్శకుడు:  జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
డీఓపీ: డడ్లీ
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
Panja Vaisshnav Tej and Sithara Entertainments’ Adikeshava title & first glimpse released now
Sithara Entertainments and Fortune Four Cinemas are producing films that entertain audiences with great content and good values.
Now, they are producing a big action spectacle with Panja Vaisshnav Tej and Sreeleela. Panja Vaisshnav Tej has decided to do action entertainer film for the first time in his career.
The adrenaline rush inducing action film, PVT04, has been titled as Aadikeshava. The team has released a high octane action packed teaser, introducing us into the world of the characters and the film.
Adikeshava teaser introduces us to Rudra, Panja Vaisshnav Tej’s character. In a small village, goons look to occupy Shiva temple and he decides to stop them. Where will this clash lead to and what will happen next?
The teaser ends on this high intrigue and in Rudra character, Panja Vaisshnav Tej looks macho and sharp. In an action role, the actor looks at ease and it doesn’t look like his first Acton film.
Sreeleela is playing the role of Chitra, a heart stealer and   Aparna Das is playing the role of Vajra Kaleswari Devi.
Joju George is debuting in Telugu Cinema with this movie and he is playing an evil antagonist.
Aadikeshava is produced by Naga Vamsi S & Sai Soujanya. Presented by Srikara Studios and National Award winning editor, Navin Nooli is editing the movie.
Srikanth N Reddy is debuting with this action entertainer in a big way. GV Prakash Kumar is composing music for the film and his BGM for the  teaser, has increased expectations for the movie.
More details about the film to be announced soon.
Cast: Panja Vaisshnav Tej, Sreeleela, Aparna Das, Joju George and others.
Technical Crew:
Writer, Director: Srikanth N Reddy
Music Director: G.V. Prakash Kumar
Producers: S Naga Vamsi, S Sai Soujanya
Banners: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios
DOP: Dudley
Art: A.S. Prakash
Editor: Navin Nooli
 #AadiKeshava-FL #AadiKeshava-Still

Naalo Nene Lenu, the catchy love track from Kiran Abbavaram’s Rules Ranjan, is a hit with listeners

కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ నుంచి ‘నాలో నేనే లేను’ పాట విడుదల
* ఆకట్టుకుంటున్న ‘రూల్స్ రంజన్’ మొదటి పాట
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే యువతకి ఎంతగానో చేరువైన నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘రూల్స్ రంజన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదలైంది.
‘నాలో నేనే లేను’ : విభిన్న ప్రేమ గీతం
‘నాలో నేనే లేను’ లిరికల్ వీడియోని సోమవారం ఉదయం విడుదల చేసింది చిత్ర బృందం. తన ప్రేమను కథానాయకకి చెప్పడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చూపించారు. కళ్లద్దాలు, నుదుటున బొట్టుతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్న కథానాయకుడు.. నాయికని ఫాలో అవుతూ ఆమె గురించి పాడుకోవడం ఆకట్టుకుంది. లిరికల్ వీడియోలో నాయికలా నాట్యం చేయబోయి కథానాయకుడు కిందపడటం, ఆమె నడిచొస్తుంటే అతను పూలు చల్లడం వంటి సరదా సన్నివేశాలు అలరించాయి. అమ్రిష్ గణేష్ స్వరపరిచిన సంగీతం వినసొంపుగా, ఆహ్లాదకరంగా ఉంది. సంగీతానికి తగ్గట్టుగానే రాంబాబు గోసాల అందించిన సాహిత్యం ఎంతో హాయిగా, స్వచ్ఛంగా ఉంది. అందరికీ అర్ధమయ్యే భాషలో ఎంతో అర్థవంతంగా పాటను రాశారు. ఇక శరత్ సంతోష్ ఎంతో అందంగా పాటను ఆలపించి కట్టిపడేశారు.
కథానాయకుడు ‘ప్రేమాలాపన‘:
‘నాలో నేనే లేను’ పాట విడుదల సందర్భంగా గీత రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ.. ” రూల్స్ రంజన్ చిత్రంలో నాలో నేనే లేను అనే పాట రాసినందుకు చాలా సంతోషం, మా దర్శకులు రత్నం కృష్ణ గారు చాలా మంచి సందర్భాన్ని నాకు వివరించారు. చాలా అందమైన చిన్న చిన్న పదాలతో తన ప్రేమని కథానాయిక కి తెలియజేయడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చెప్పాము. ‘నాలో నేనే లేను నీలోనే ఉన్నాను’ అంటూ మొదలయ్యి నేను ఊహల్లో లేను ఎప్పుడూ నీ ఊసుల్లోనే ఉంటున్నాను నువ్వు ఏం మాయ చేసావు నీ రూపం ఒక మాయ నువ్వే ఒక మాయ నాకు నిద్ర పట్టట్లేదు కానీ చాలా హాయిగా ఉంది ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు అనుకుంటూ తన ఫీలింగ్స్ ని చెప్పుకునే పాట. చాలా అందమైన బాణీకి చాలా మంచి తేలిగ్గా పాడుకునేటట్లుగా ఉండే పదాలతో పాటని రాయమని చెప్పారు. చరణాలు కవితాత్మకంగా చెప్పాము.పువ్వులా నువ్వు వస్తే నీ నుంచి వచ్చే పరిమళాల గాలి నాతో మాట్లాడింది అని, నువ్వు సిగ్గుపడుతూ నవ్వుతుంటే నన్ను నేను మర్చిపోయానని చరణాలు స్టార్ట్ అవుతాయి. నాతో ఇంత మంచి పాట రాయించినందుకు మా దర్శకులకి కృతజ్ఞతలు, అలాగే హీరో హీరోయిన్లు కిరణ్ అబ్బవరం గారు నేహా శెట్టి ఈ పాటలో చాలా అందంగా కనిపించారు. చాలా చాలా బాగుంది విజువల్ గా, సంగీత దర్శకులు అమ్రిష్ గారు చాలా మంచి బాణీ అందించారు. అలాగే గాయకులు శరత్ సంతోష్ చాలా బాగా పాడారు. ఈ పాట పెద్ద హిట్ అవుతుందని అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇంత మంచి ప్రొడక్షన్లో ఇంత మంచి సినిమాకి ఇంత మంచి పాట రాసినందుకు మా నిర్మాతలకి అలాగే నన్ను ఎంకరేజ్ చేసిన మా టీం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పాటని సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
‘రూల్స్ రంజన్‘: నూరు శాతం వినోదం: చిత్ర నిర్మాతలు, దర్శకుడు
వినోదమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోంది. కథానాయకుడు కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ,ఇమేజ్ కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటం తో పాటు, పూర్తి స్థాయి వినోద భరిత కథాచిత్రమిది.  సగటు సినిమా ప్రేక్షకుడు మనసారా వినోదాన్ని ఆస్వాదించే చిత్రమవుతుంది. ఇందుకు చిత్ర కథ, నాయకా నాయికల పాత్రలు, కథానుగుణంగా సాగే ఇతర ప్రధాన తారాగణం పాత్రలు, సంభాషణలు, సంగీతం ఇలా అన్నీ సమపాళ్లలో చక్కగా కుదిరిన ఓ మంచిత్రం అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి, దర్శకుడు  రత్నం కృష్ణ. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై నెలలో చిత్రాన్ని విడుదల చేయాలన్నది సంకల్పం అని తెలిపారు.
తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
Naalo Nene Lenu, the catchy love track from Kiran Abbavaram’s Rules Ranjan, is a hit with listeners
Kiran Abbavaram, who made a mark as a performer and a commercially bankable actor with films like Raja Varu Rani Garu, SR Kalyana Mandapam, Vinaro Bhagyamu Vishnu Katha, is back in a fun entertainer titled Rules Ranjan. He’ll be seen in a brand new bespectacled, nerdy avatar in the film. DJ Tillu girl Neha Shetty plays the female lead in the project.
Rathinam Krishna, the brain behind acclaimed films Nee Manasu Naaku Telusu, Oxygen, is the writer and the director of the film. He has come up with a non-stop laughter ride that’ll appeal to the tastes of all audiences. Young, passionate producers Divyang Lavania, Murali Krishnaa Vemuri are bankrolling the film under Star Light Entertainment.
While the promotional material of Rules Ranjan has made a mark among film buffs already, the first single from the entertainer Naalo Nene Lenu was launched today. Amrish composes the music for the project. Promising singer Sarath Santosh has crooned for the love track which has lyrics by Rambabu Gosala. The song unfolds at a college where the geeky protagonist is completely smitten by his lady love.
‘Naalo nene lenu, neeloney unnaanu..Oohallonaa lenu, pillaa oosulloney unnaanu,’ the opening lines of the feel-good number describes the plight of a lovestruck youngster. The relatable lyrics, catchy composition strike a chord with a listener instantly. Kiran Abbavaram’s antics, Neha Shetty’s traditional girl-next-door appeal, their on-screen chemistry in addition to the classy cinematography and the lively backdrops contribute to its appeal.
“I’m very happy to have written a song for Rules Ranjan. The director Rathinam Krishna came up with a very interesting situation and asked me to use simple words to convey the boy’s love for a girl. Right from the opening stanza ‘Naalo Nene Lenu..Neelone Unnanu’, the music complements the lyrics beautifully. Kiran Abbavaram and Neha Shetty look great in the relatable number that’s shot well and has a fantastic tune. The singer Sarath Santosh has done complete justice to it. I’m confident it’ll be a major hit. I thank the producers for giving me the opportunity to work for such a good banner and the entire team for their encouragement. I wish the film becomes a huge hit too,” the lyricist Rambabu Gosala said.
The producers have left no stone unturned to make the project on a lavish canvas and they’re quite confident of drawing audiences to theatres. The story, dialogues, the characterisation of the lead actors, the humour and the entertaining screenplay are the USPs of the film, they say. The team is believed to be very happy with the output and is planning to promote the film aggressively in the coming weeks. Rules Ranjan has wrapped its shoot and the post production formalities are progressing at a brisk pace. The film is slated to release in the early half of July.
While Vennela Kishore, Hyper Aadhi, Viva Harsha, Nellore Sudarshan, Subbaraju, Ajay, Goparaju Ramana too essay crucial roles in the film With huge Supporting cast from BollyWood fame Annu Kapoor, Siddharth Sen, Atul Parchure, Vijay Patkar, Makarand Deshpande, Abhimanyu Singh and Gulshan Pandey. Dulip Kumar is the cinematographer. M Sudheer is the art director for the film.
MOVIE DETAILS
CAST – Kiran Abbavaram, Neha Shetty, Meher Chahal, Vennela Kishore, Subbaraju, Hyper Aadhi, Viva Harsha, Annu Kapoor, Ajay, Atul Parchure, Vijay Patkar, Makarand Deshpande, Nellore Sudarshan, Goparaju Ramana, Abhimanyu Singh, Siddharth Sen.
CREW –
Written and Directed by: Rathinam Krishna
Produced by: Star Light Entertainment Pvt Ltd
Presented by: A.M. Rathnam
Producers: Divyang Lavania, Murali Krishnaa Vemuri
D.O.P – Dulip Kumar M.S
Co-producer – Rinkhu Kukreja
Art – Sudheer Macharla
Choreography – Sirish
Styling (Kiran Abbavaram and Neha Shetty) – Harshitha Thota
Costume Designer – Aruna Sree Sukala
Co- director – Ranganath Kuppa
Marketing Head – Prasad Chavan
P.R.O – Lakshmi Venu gopal
Naalo-Nenne-Lenu-first-lyrical-plain-still

Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04 Fiery Glimpse to release on Monday, 15th May!

పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘PVT04′ నుంచి మే 15న పవర్ ఫుల్ గ్లింప్స్ విడుడల
తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకుని, అందరినీ ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్.. అరంగేట్రం నుండి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నారు. తన తదుపరి చిత్రంగా ఓ అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ‘PVT04′ రూపంలో ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను అందించనుంది. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
మే 15వ తేదీన, సోమవారం సాయంత్రం 4:05 గంటలకు ‘PVT04′ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ అత్యంత శక్తిమైన గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. క్రూరత్వంతో కూడిన ఆయన పవర్ ఫుల్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పంజా వైష్ణవ్ తేజ్‌కి, జోజు జార్జ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్రబృందం చెబుతోంది. వైష్ణవ్ తేజ్‌ పాత్రను పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ ఇంకా విడుదల చేయాల్సి ఉందని, అది ప్రేక్షకుల అంచనాలకు మించేలా ఉంటుందని మూవీ టీమ్ తెలిపింది.
ఈ సినిమాలో శ్రీలీల అందరి మనసులు దోచుకునే అందమైన ‘చిత్ర’ పాత్ర పోషిస్తున్నారు. వజ్ర కాళేశ్వరి దేవి అనే కీలక పాత్రలో అపర్ణా దాస్ నటిస్తున్నారు. ఈ పాత్రలను పరిచయం చేస్తూ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలను పంచేశాయి.
శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంచలన సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కి సంగీతం అందిస్తున్నారు. ఆయన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
తారాగణం: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, అపర్ణా దాస్, జోజు జార్జ్ తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి
సంగీత దర్శకుడు:  జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
డీఓపీ: డడ్లీ
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04 Fiery Glimpse to release on Monday, 15th May!
Panja Vaisshnav Tej has been making smart script choices from his debut. He has decided to take on a high octane action entertainer for his next.
Sithara Entertainments and Fortune Four Cinemas, who have been synonymous with content oriented entertaining films have come up with high adrenaline rush inducing action packed entertainer with PVT04. Srikara Studios is presenting the film.
The movie team has announced the release of a fiery and fiesty glimpse that delves into the world of PVT04 on Monday, the 15th of May, at 4:05 PM.
Joju George, national award winning actor from Malayalam Cinema, is making his debut with this film in Telugu. His look from movie looks devilishly evil. The character poster of the actor indicated it already.  We are in for a treat with confrontational scenes between him and Panja Vaisshnav Tej, as the team already introduced Vaisshnav Tej’s character in the announcement video.
First look of the actor is yet to be unveiled and it will be one beyond imagination, promises the team.
Sreeleela as Chitra is beautiful and charming as ever. Aparna Das as Vajra Kaleswari Devi is pretty and gorgeous on the eye. Their character posters released by the team have created very positive buzz for the film.
BGM by sensational music director, GV Prakash Kumar is expected to give right pump to the mighty action spectacle. Srikanth N Reddy is debuting with the film as writer and director.
AS Prakash is doing the art work and Navin Nooli is editing the film.
Cast: Panja Vaisshnav Tej, Sreeleela, Aparna Das, Joju George and others.
Technical Crew:
Writer, Director: Srikanth N Reddy
Music Director: G.V. Prakash Kumar
Producers: S Naga Vamsi, S Sai Soujanya
Banners: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios
DOP: Dudley
Art: A.S. Prakash
Editor: Navin Nooli
#PVT04-FirstGlimpse-Announcement-Still

Pedhavulu Veedi Maunam, a new melody from Takkar, starring Siddharth, Divyansha Kaushik, is an ode to love

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘పెదవులు వీడి మౌనం’ విడుదల
* ప్రేమ మైకంలో ముంచేలా ‘పెదవులు వీడి మౌనం’ పాట
* ప్రత్యేక ఆకర్షణగా సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల కెమిస్ట్రీ
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’ సాంగ్ కూడా విశేష ఆదరణ పొందింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి ‘పెదవులు వీడి మౌనం’ అనే సాంగ్ విడుదలైంది.
‘పెదవులు వీడి మౌనం’ లిరికల్ వీడియోని చిత్రబృందం శనివారం విడుదల చేసింది. నివాస్ కె ప్రసన్న స్వరపరిచిన ఈ రొమాంటిక్ సాంగ్ కట్టిపడేస్తోంది. “పెదవులు వీడి మౌనం.. మధువులు కోరే వైనం.. తనువులు చేసే స్నేహం.. నేడే…” అంటూ సాగిన పాట ప్రేమ మైకంలో ముంచేసేలా ఉంది. ఆ పాట మూడ్ కి సందర్భానికి తగ్గట్టుగా నివాస్ కె ప్రసన్న ఎంత చక్కగా స్వరపరిచారో.. కృష్ణ కాంత్ అందించిన సాహిత్యం కూడా అంతే చక్కగా కట్టిపడేసేలా ఉంది. తేలికైన పదాలతో లోతైన భావాలను పలికించారు కృష్ణ కాంత్. దీపక్ బ్లూ, చిన్మయి శ్రీపాద ఎంతో అందంగా ఈ పాటను ఆలపించి, తమ మధుర గాత్రంతో మాయ చేశారు. ఇక నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని, వెండితెరపై ఈ జోడి మ్యాజిక్ చేయబోతోందని ఈ లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తున్నారు.
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్టర్: ఉదయ కుమార్ కె
స్టంట్స్ కోరియోగ్రఫీ: దినేష్ కాశి
పబ్లిసిటీ డిజైన్స్: 24AM
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహా నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్
Pedhavulu Veedi Maunam, a new melody from Takkar, starring Siddharth, Divyansha Kaushik, is an ode to love
Takkar, the action-romance starring Siddharth, Divyansha Kaushik in the lead roles, is gearing up for a theatrical release in Tamil and Telugu worldwide on May 26. The film is written and directed by Karthik G Krish and jointly produced by TG Vishwa Prasad and Abhishek Agarwal under People Media Factory and Abhishek Agarwal Arts in collaboration with Passion Studios.
After grabbing eyeballs with the teaser and the video song Kayyale, the team released another song from the film Pedhavulu Veedi Maunam today. Nivas K Prasanna scores the music for the project while Deepak Blue, Chinmayi Sripada are the singers. Krishna Kanth has written the lyrics for the feel-good melody.
The song takes you through the intimate moments in the life of the on-screen couple as they lose track of the world amidst each other’s company. The soothing composition and the mellowed singing leave a terrific aftertaste. Krishna Kanth’s lyrics express the emotions of the characters with immense sensitivity.
‘Pedhavulu Veedi Maunam..Madhuvulu Kore Vainam..Thanuvulu Chese Sneham Nede,’ the opening lines offer a peek into the mood of the song, that progresses like a gentle breeze brushing your face. The fantastic chemistry between Siddharth and Divyansha further beautifies the listening experience.
Abhimanyu Singh, Yogi Babu, Munishkanth, and RJ Vigneshkanth play other important roles in the film. Vanchinathan Murugesan is the cinematographer and GA Gowtham is the editor. People Media Factory and Abhishek Agarwal Arts scored big hits in their previous collaborations like Karthikeya 2 and Dhamaka.
Cast: Siddharth, Divyansha, Abhimanyu Singh, Yogi Babu, Munishkanth, RJ Vigneshkanth.
Written and directed by Karthik G Krish
Cinematographer: Vanchinathan Murugesan
Editor: GA Gowtham
Art Direction: Udaya Kumar K
Stunts Choreography: Dinesh Kasi
Publicity Designs: 24AM
Teaser cut – Pradeep E Ragav
Producers: T G Vishwa Prasad, Abhishek Agarwal
Co-producer: Vivek Kuchibhotla
Executive producer: Mayank Agarwal
plain SONG-POSTER-WOL

Sreeleela to appear as playful and extremely beautiful Chitra in Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04

పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘PVT04′లో అందాల ‘చిత్ర’గా అలరించనున్న శ్రీలీల

బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మెగా చార్మింగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా వెనకాడకుండా.. ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో అత్యున్నత స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. సినిమాకి కీలకమైన పవర్ ఫుల్ పాత్రలలో జోజు జార్జ్, అపర్ణా దాస్ నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను పెంచేశాయి.
అసురన్‌, ఆడుకలం వంటి జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు సంగీతం అందించిన జి.వి. ప్రకాష్‌ కుమార్‌ మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ తో చేతులు కలిపారు. ఇటీవల వీరి కలయికలో వచ్చిన సార్/వాతి చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది.
ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రీలీల పాత్ర వివరాలను తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో ఆమె ఉల్లాసభరితంగా, కొంటెగా ఉంటూ అందరి మనసులు దోచుకునే అందమైన ‘చిత్ర’ పాత్రను పోషిస్తున్నారు. తాను పోషిస్తున్న చిత్ర పాత్ర పట్ల శ్రీలీల ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటిదాకా చిత్రీకరించిన ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయి.
త్వరలోనే ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా ఈ మూవీ నుంచి అదిరిపోయే యాక్షన్ గ్లింప్స్ విడుదల కానుంది. ఎ.ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. PVT04 నుంచి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
తారాగణం: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, అపర్ణా దాస్, జోజు జార్జ్ తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి
సంగీత దర్శకుడు:  జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
డీఓపీ: డడ్లీ
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
 
Sreeleela to appear as playful and extremely beautiful Chitra in Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04
Blockbuster production house, Sithara Entertainments, is producing action entertainer with Mega Charming hero Panja Vaisshnav Tej. Fourtune Four Cinemas is co-producing the film and Srikara Studios is presenting the film.
The movie has been set on a lavish scale and producers – Naga Vamsi and Sai Soujanya are leaving no stone unturned to make it one of the best movie experiences for audiences in theatres.
Srikanth N Reddy is debuting with the movie and he is making it as a high octane mass action entertainer.
Sreeleela is playing leading role and Joju George, Aparna Das have been recently confirmed to be part of the cast with dynamic character posters.
The posters have been loved and lauded by movie-lovers and it created positive buzz for the film.
GV Prakash Kumar, composer of National Award winning films like Asuran, Aadukalam is joining hands for this film again with Sithara Entertainments and Fortune Four Cinemas. Their combination delivered a chartbuster like Sir/Vaathi, recently.
Now, we are glad to reveal the name of our charming leading lady, Sreeleela from the movie. She is playing playful, naughty, bubbly heart-stealer and beautiful charmer Chitra, in the movie.
The actress is excited about the character and her portions have come out superbly.
Soon, an pulsating action glimpse will be released to increase the buzz and expectations of the public.
AS Prakash is working as Art director and National Award winning editor Navin Nooli is editing the film.
More details about PVT04 will be released soon.
Sreeleela-#PVT04 Sreeleela-#PVT04-Still