Sep 20 2021
BLITZ OF DANIEL SHEKAR IN ‘BHEEMLA NAYAK’
‘భీమ్లా నాయక్’ చిత్రం నుంచి ‘డేనియల్ శేఖర్‘ గా ‘రాణా‘ పరిచయ చిత్రం విడుదల
పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ
చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
‘భీమ్లా నాయక్’ చిత్రం నుంచి ‘రాణా‘ పరిచయ చిత్రం ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేశారు చిత్ర బృందం.
డేనియల్ శేఖర్ గా రాణా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్న దానికి ఈ ప్రచార చిత్రం ఓ కర్టెన్ రైజర్ లాంటిది.
“నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్ నడుస్తోంది…
నేనెవరో తెలుసా ధర్మేంద్ర … హీరో ..హీరో..!
డేనీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్…!”
అంటూ ఈ ప్రచార చిత్రం లో డేనియల్ శేఖర్ పాత్ర పలికే సంభాషణలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాయి.
ప్రస్తుతం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం లో నిత్య మీనన్ నాయిక. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
BLITZ OF DANIEL SHEKAR IN ‘BHEEMLA NAYAK’
*Rana Daggubati’s first glimpse as ‘Daniel Shekar’ from the film ‘Bheemla Nayak’ release.
Pawan Kalyan and Rana Daggubati starrer ‘Bheemla Nayak’ is being produced by Sithara Entertainments. Screenplay and dialogues are given by Ace Writer-Director ‘Trivikram’ while ‘Survyadevara Naga Vamsi’ is producing the film which is being Directed by ‘Saagar K Chandra’.
Rana Daggubati’s first glimpse from the film ‘Bheemla Nayak’ was released today at 6.03 pm by the film unit. This glimpse acts as a curtain raiser for Rana Daggubati’s embodiment and insight towards Daniel Shekar’s character dynamics.
“Nee mogudu Gabbar Singh anta..? Station lo talk nadusthundi.. Nenevaro Telusa .. Dharmendra.. Hero… Hero! Danny Entertainments Production no. 1!”
Roughly translated to,
“There is a talk going around in the station that your husband is Gabbar Singh?..
You know who I am?… Dharmendra.. Hero… Hero! Danny Entertainments Production no. 1!” are the dialogues spoken by the character ‘Daniel Shekar’ in this teaser. These dialogues paint a picture about his characterisation even more clearly.
The film is currently undergoing the shooting process. Producer Suryadevara Naga Vamsi said that his banner is producing this film with great ambition. He also said that the film is set to release on 12 January 2022.
In this Pawan Kalyan and Rana Daggubati’s Multi-starrer Nithya Menen is acting as the female lead. Renowned actors like Rao Ramesh, Murali Sharma, Samuthirakani, Raghu Babu, Narra Srinu, Kadambari Kiran, Chitti, Pammi Sai are playing important characters in this movie.
Dialogues, Screenplay: Trivikram Cinematographer: Ravi K. Chandran (ISC) Music: Thaman.S
Editor: Navin Nooli
Art: A.S.Prakash
VFX Supervisor: Yugandhar.T
P.R.O: LakshmiVenugopal
Presenter: P.D.V. Prasad
Producer: Suryadevara Naga Vamsi
Director: Saagar K. Chandra