‘వరుడు కావలెను’ మంచి ప్రేమకథ థియేటర్‌లోనే ఆస్వాదించండి – పూజాహెగ్డే

*మా సినిమా బాగా వచ్చిందని గర్వంగా చెప్పుకొంటాం
ఇది ఓవర్‌ కాన్షిడెన్స్‌ కాదు… సినిమా పట్ల ఉన్న నమ్మకం
– ‘ వరుడు కావలెను‘ సంగీత్‌ వేడుకలో నాగశౌర్య

నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌ను మేకర్స్‌ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ ను  విడుదల చేసిన చిత్ర యూనిట్‌, శనివారం సంగీత్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అగ్ర కథానాయిక పూజాహెగ్డే హాజరయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధా కృష్ణ ( చినబాబు), చిత్ర నాయకా, నాయికలు నాగశౌర్య, రీతు వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సప్తగిరి, మాటల రచయిత గణేష్‌ రావూరి, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, గేయ రచయిత రాంబాబు గోశాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూజాహెగ్డే మాట్లాడుతూ…
‘‘హీరోయిన్‌ని అతిథిగా ఆహ్వానించడం అరుదుగా జరుగుతుంది. నన్ను అతిథిగా ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆ క్రెడిట్‌ చిన్నబాబు, వంశీలకు దక్కుతుంది. హారికా అండ్‌ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్‌. చినబాబుగారు నన్ను ఇంట్లో మనిషిలా చూస్తారు. కరోనా వల్ల ఎంతో బాధపడ్డాం. కాస్త రిలాక్స్‌ అవ్వడం కోసం థియేటర్‌లోనే సినిమా చూడండి. దర్శకత్వ శాఖలో మహిళలు చాలా తక్కువ ఉంటారు. ‘వరుడు కావలెను’ మహిళా దర్శకురాలు తెరకెక్కించిన మంచి ప్రేమకథ. అందరూ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. దర్శకురాలిగా సౌజన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా హిట్టై టీమ్‌కు మంచి పేరుతోపాటు నిర్మాతలకు లాభాలు రావాలి. ఇదే జోష్‌తో సక్సెస్‌ పార్టీలో కలుద్దాం’’ అని అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ…
2018లో కథ విన్నాను. వెంటనే ఓకే చేశా. 2019లో షూటింగ్‌ మొదలుపెట్టాం. ఈ జర్నీలో రెండుసార్లు కరోనా మహమ్మారిని చూశాం. చాలా కష్టపడి సినిమా పూర్తి చేసి విడుదల వరకూ వచ్చాం. సినిమా అవుట్‌పుట్‌ ఒక రేంజ్‌లో వచ్చింది. ‘మన కుటుంబం మంచిది’ అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో.. మా సినిమా బాగా వచ్చిందని అంతే గర్వంగా చెప్పుకొంటాం. ఇది ఓవర్‌ కాన్షిడెన్స్‌ కాదు. సినిమా పట్ల ఉన్న నమ్మకం. సినిమాకు బాగా వచ్చిందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయినా నిర్మాతలు థియేటర్‌ రిలీజ్‌ కోసమే వేచి చూశారు. సౌజన్య అక్క ఎన్నో సంవత్సరాలుగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ ఓ మంచికథ రాసుకుంది. ఈ సినిమాతో దర్శకురాలిగా అవకాశం అందుకుంది. మంచి అవుట్‌పుట్‌ కోసం చాలా పోరాడింది. ఈ సినిమా హిట్‌తో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ అందించిన సంగీతంతో మేం మొదటి సక్సెస్‌ అందుకున్నాం. భూమి పాత్రకు రీతూవర్మ పర్ఫెక్ట్‌గా సూట్‌ అయింది. తనతో మళ్లీమళ్లీ పని చేయాలనుంది. చినబాబుగారు, వంశీలతో జర్నీ చాలా అందంగా ఉంటుంది. కథను, సినిమాను ప్రేమించే నిర్మాతలు వీరు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. మంచి కథకు ఎక్కడా వెనకాడకుండా బడ్జెట్‌ పెడతారు. ఈ నెల 29న విడుదల కానున్న మా చిత్రానికి ఎలాంటి భయం లేకుండా అందరూ రావాలి. థియేటర్ల దగ్గర కొవిడ్‌ నిబంధనలు అన్ని పాటిస్తున్నాం’’ అని అన్నారు.

రీతూవర్మ మాట్లాడుతూ
‘‘ప్రేమ, అనుబంథం ఇతివృత్తంగా పూర్తిగా కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ కథ నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. లక్ష్మీ సౌజన్య మంచి కథతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతంలో మంచి డాన్స్‌ నంబర్స్‌ కుదిరాయి. శౌర్య సపోర్ట్‌తో నా వర్క్‌ చాలా ఈజీ అయింది. హీరోయిన్‌ను అతిథిగా పిలవడం రేర్‌గా జరుగుతుంది. మా ఈవెంట్‌కు పూజా రావడం చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది’’ అని అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ…
‘‘కథా బలం, కుటుంబ కథా చిత్రాల మీద మా సంస్థ దృష్టి పెడుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌, యువతకు బాగా ఆకట్టుకునే చిత్రమిది. అతిథిగా హాజరైన పూజాహెగ్డేకు కృతజ్ఞతలు. సహకరిస్తున్న అభిమానులకు, మీడియాకు చాలా థ్యాంక్స్‌’’ అని అన్నారు.

సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ…
‘‘కథకు తగ్గ పాటలు, నేపథ్య సంగీతం కుదిరాయి. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

~Varudu Kavalenu Is A Beautiful Love Story To Be Watched In Theatres – Pooja Hegde
~We Proudly Boast That Varudu Kavalenu Came Out Nicely. It Is Not Over Confidence, It Shows Our Belief On The Film: Naga Shaurya

Starring Naga Shaurya and Ritu Varma in the lead roles, ‘Varudu Kavalenu’ marks the directorial debut of Lakshmi Sowjanya. The film, presented by PDV Prasad and produced by Naga Vamsi Suryadevara under prestigious production house Sithara Entertainments, is all set for release on October 29th in theatres. The producers have been surprising with unique round of promotions with this film. After holding the trailer launch event recently, the makers have held the Sangeet event of ‘Varudu Kavalenu’ on Saturday night at a star hotel in Hyderabad. Lucky mascot Pooja Hegde has graced the event as the chief guest and wished all the success to the ‘Varudu Kavalenu’ team. Whole cast and crew have attended the event. Haarika & Hassine Creations founder and ace producer Radha Krishna Suryadevara (Chinna Babu), lead actors Naga Shaurya, Ritu Varma, producer Naga Vamsi, music composer Vishal Chandrasekhar, dialogue writer Ganesh Ravuri, lyric writer Rambabu Gosala and others have attended the do.

Speaking at the Sangeet event of ‘Varudu Kavalenu’, Pooja Hegde said, “Today I’ll keep it short. First of all, thanks for having me here. It is rare to have a heroine as a chief guest for a filmy function. I’m really elated with this. I’d like to thank producers Chinna Babu Garu and Naga Vamsi for this. The credit goes to them. Haarika & Hassine Creations is like my home banner. Chinna Babu Garu treats me like his family member. The women representation in direction department is relatively less in the industry. ‘Varudu Kavalenu’ is directed by newcomer Lakshmi Sowjanya. It is a beautiful love story. I wish a great success to the film and hope it brings good profits to producers. I hope director Lakshmi Sowjanya will have a bright future. Everyone have suffered during Covid pandemic. People want some relief and entertainment. So watch ‘Varudu Kavalenu’ only in theatres. Forget all your tensions and troubles by watching the film. With the same energy and josh, I’ll meet the film’s team at the success bash.”

Hero Naga Shaurya said, “I had heard the story of ‘Varudu Kavalenu’ for the first in 2018. As soon as I heard it, I decided to do the film. We’ve started the film’s shoot in 2019. We witnessed two waves of Covid. Certainly, it was a tough journey and finally we’re releasing our film in theatres on October 29th. Producers might be flooded with the OTT offers and continuous calls from the OTT platforms. I really appreciate and thank producers for releasing the film in theatres  first. We proudly boast that ‘Varudu Kavalenu’ came out nicely. It is not over-confidence. But it is our belief and confidence on our film. Sowjanya Akka who earlier worked as an assistant director has written a beautiful love story and that’s ‘Varudu Kavalenu’. She is turning her dream into real. She worked hard for the film’s output and she succeeded in it. With this film, she will bag success. We got our first success with Vishal Chandrasekhar’s music. Song have become chartbusters. Ritu Varma is most apt for the role of Bhumi. Looking forward to working with her again. Producers Chinna Babu Garu and Naga Vamsi are passionate makers. They love cinema and they won’t compromise on the budgets to ensure that the story is justified. The journey with them was beautiful. I urge audiences to watch the film only in theatres. Please come to theatres without any fear as all Covid protocols are being followed at theatres.”

Talking at the event, heroine Ritu Varma shared, “With Love and affection as the central points, the film is a family entertainer and appeals to all sections of audiences. I’m really lucky to get this story and Bhumi’s character. Director Lakshmi Sowjanya is being launched with a good film.There are good dance numbers in the film, thanks to music composer Vishal Chandrasekhar. With co-star Naga Shaurya’s support, it has become quite easy for me. It is rare to invite a heroine as the chief guest. I’m very glad that Pooja Hegde has graced for our event to support us. I’m sure ‘Varudu Kavalenu’ is going to be a big hit for all of us.”

Producer Naga Vamsi said, “Our production always gives importance to films with strong story line and family elements. ‘Varudu Kavalenu’ will equally appeal to families and youth. Thanks to Pooja Hegde for attending and wishing us success. I’d like to extend my thanks to all media and fans for supporting our film.”

Music director Vishal Chandrasekhar said, “All the songs have suited well to the story. Background score is complimenting the film. I’m really happy to be part of such a beautiful film.”

The film’s important cast includes Nadhiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, ‘Rangasthalam’ Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Sidhiksha and others.

For this movie
Dialogues: Ganesh Kumar Ravuri,
Cinematographer: Vamsi Patchipulusu,
Music : Vishal Chandrashekhar
Editor: Navin Nooli
Art: A.S Prakash
PRO: Lakshmivenugopal
Presents by: P.D.V Prasad
Produced by: Surya Devara NagaVamsi
Story- Direction:Lakshmi Sowjanya

 

DSC_4367 DSC_4361 DSC_4358 DSC_4374 DSC_4347