Jan 15 2025
Posts by Venugopal L:
Jan 15 2025
*Grand SUCCESS EVENT will be held in Ananthapur this week : Naga Vamsi*
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ : నిర్మాత సూర్యదేవర నాగవంశీ
‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ‘డాకు మహారాజ్’ సినిమాకి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, “తెలుగు ప్రేక్షకులు అందరికీ పేరు పేరునా మా టీం తరపున థాంక్స్ చెబుతున్నాము. రెండేళ్ళ క్రితం ఒక ఆలోచనతో ఈ ప్రయాణం, ఈ సంక్రాంతి కానుకగా మీ ముందుకు వచ్చింది. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలని టీమ్ అందరం ఎంతో కష్టపడ్డాము. బాలకృష్ణ గారి కెరీర్ లో గొప్ప సినిమాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుందని గతంలో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా నాగవంశీ గారు అన్నారు. ఆయన ఈ సినిమాని ఎంతో నమ్మారు. వంశీ గారి నమ్మకం నిజమై ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 2023 సంక్రాంతి వాల్తేరు వీరయ్యతో విజయాన్ని అందుకున్నాను. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో వచ్చాను. సంక్రాంతి అనేది నాకు మరింత ప్రత్యేకమైన పండుగలా మారిపోయింది. తమన్ కావచ్చు, విజయ్ కార్తీక్ కావచ్చు.. అద్భుతమైన టీమ్ వల్లే ఈ అవుట్ పుట్ వచ్చిందని చెప్పవచ్చు. తమన్ సంగీతం సినిమాకి మెయిన్ పిల్లర్లలో ఒకటిగా నిలిచింది. అలాగే విజయ్ కార్తీక్ విజువల్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఎడిటర్లు నిరంజన్ గారు, రూబెన్ గారు, ఫైట్ మాస్టర్ వెంకట్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా పని చేశారు. బాలకృష్ణ గారికి వీరాభిమాని అయిన నాగవంశీ గారు ఒక గొప్ప సినిమాని తీయాలనే ఉద్దేశంతో నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ప్రేక్షకులు థియేటర్ లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం మనసు పెట్టి సినిమా తీస్తే, తెలుగు ప్రేక్షకులు దానిని గుండెల్లోకి తీసుకుంటారని మరోసారి రుజువైంది. సినిమాకి వస్తున్న స్పందన పట్ల బాలకృష్ణ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. నా ఈ అవకాశం ఇచ్చి, ఫ్రీడమ్ ఇచ్చి, అడిగివన్నీ సమకూర్చి, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నాగవంశీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశాము. అందుకే ఈ వారంలో సక్సెస్ మీట్ ను అనంతపురంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా పట్ల బాలకృష్ణ గారి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. పండగ సీజన్ కూడా కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉంది.” అన్నారు.
కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, “ఇది నాకు చాలా ప్రత్యేకమైన మరియు ఎప్పటికీ మరచిపోలేని పుట్టినరోజు. నా పుట్టినరోజు నాడు విడుదలైన డాకు మహారాజ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇంత మంచి సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. నాకు అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అందరూ కుటుంబంతో కలిసి థియేటర్లలో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.” అన్నారు.
కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, “ఈ సంక్రాంతి మాకు మరచిపోలేని బహుమతి ఇచ్చింది. టీమ్ అంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశాము. ఇప్పటి వరకు నేను ఇలాంటి ఎక్స్ పీరియన్స్ చూడలేదు. ముఖ్యంగా బాలయ్య బాబు గారి అభిమానులకు ధన్యవాదాలు. సినిమాని అందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.” అన్నారు.
నటి ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, “ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తున్న సందర్భంగా దర్శకుడు బాబీ గారికి, టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చిన బాబీ గారికి థాంక్స్. నాగవంశీ గారు ఫైర్ బ్రాండ్ ప్రొడ్యూసర్. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. లెజెండరీ బాలకృష్ణ గారితో పని చేయడం అనేది వరల్డ్ క్లాస్ ఎక్స్ పీరియన్స్. డాకు మహారాజ్ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందంగా ఉంది.” అన్నారు.
ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ మాట్లాడుతూ, “డాకు మహారాజ్ సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. నన్ను ఈ సినిమాలో భాగం చేసిన దర్శకుడు బాబీ గారికి, నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు. బాలకృష్ణ గారు, బాబీ డియోల్ గారు, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రానికి పని చేయడం అనేది ఒక మంచి అనుభూతి.” అన్నారు.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
*‘Daaku Maharaaj’ Blockbuster Press Meet*
*We believed we made a Hit, today audience are calling it a BLOCKBUSTER : Bobby Kolli*
*Grand SUCCESS EVENT will be held in Ananthapur this week : Naga Vamsi*
The team of Daaku Maharaaj gathered to celebrate the overwhelming success of the film at a grand event. Speaking at the meet, the cast and crew expressed their gratitude and excitement for the film’s phenomenal reception.
Pragya Jaiswal shared her joy, saying, “This is my most memorable birthday ever. I feel truly blessed to be a part of this film and the incredible team behind it. Watch Daaku Maharaaj with your families this Sankranti!”
Shraddha Srinath said, “Today, I watched the film at Sreeramulu Theatre, and the response was unbelievable. It’s a special day I’ll never forget. I’m overwhelmed by the audience’s love for our performances.”
Urvashi Rautela expressed her happiness, stating, “I am so proud to be part of this film, not just for the Dabidi Dibidi song but also for my character. Thank you all for the amazing response to Daaku Maharaaj!”
DOP Vijay Karthik Kannan remarked, “We had an amazing time shooting on the sets with Balayya sir and the rest of the team. Seeing the audience appreciate our efforts is truly overwhelming.”
Director Bobby Kolli reflected on his journey, saying, “My last release was during Sankranti 2023, and now, in Sankranti 2025, I’m grateful to score another success. Balakrishna garu’s compliments deeply moved me. I thank my entire cast and crew for making this film a grand success.”
Producer Naga Vamsi added, “We are thrilled with the positive response to Daaku Maharaaj. People are talking about the technical brilliance of the film. We aimed to bring a fresh perspective to commercial cinema, and I believe we succeeded. If censor formalities are completed on time, the Tamil and Hindi versions will release theatrically on January 17.”
The event concluded with the team thanking fans and audiences for making Daaku Maharaaj a sensational hit this Sankranti.
Presented by: Srikara Studios
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Title: Daaku Maharaaj
Release Date: January 12, 2025
Genre: Action Drama
Cast:
Hero: Nandamuri Balakrishna
Co-Stars: Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandhini Chowdary
Technical Crew:
Director: Bobby Kolli
Producer: Naga Vamsi
Music Director: Thaman S
Cinematography: Vijay Kartik Kannan
Editor: Niranjan Devaramane, Ruben
Production Designer: Avinash Kolla
Jan 15 2025
*Daaku Maharaaj is About NBK in a Never-Before-Seen Performance” – Bobby Kolli*
‘డాకు మహారాజ్’ సినిమాలో విజవల్స్ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు : దర్శకుడు బాబీ కొల్లి
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు బాబీ కొల్లి, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘డాకు మహారాజ్’ ఎలా ఉండబోతుంది?
బాలకృష్ణ గారి ఇమేజ్ ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకొని ‘డాకు మహారాజ్’ సినిమా చేయడం జరిగింది. అయితే బాలకృష్ణ గారి గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాము. బాలయ్య గారు సెటిల్డ్ గా డైలాగ్ లు చెప్తే చాలా బాగుంటుంది. ‘నరసింహానాయుడు’, ‘సమరసింహారెడ్డి’ తర్వాత ‘సింహా’ ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. డాకు మహారాజ్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. చాలా నిజాయితీగా కథను చెప్పాము.
బాలకృష్ణ గారి గురించి?
బాలకృష్ణ గారి నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ గారు గౌరవిస్తారు. అభిమానులు తనను చూడటానికి వస్తారు కదా అని, డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు.
ట్రైలర్ లో విజువల్స్ కి మంచి పేరు వచ్చింది కదా. ఎలాంటి కేర్ తీసుకున్నారు?
నిర్మాత నాగవంశీ గారు బాలకృష్ణ గారిని ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తమ బ్యానర్ లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండాలి అనుకున్నారు. అలాగే ఒక దర్శకుడిగా నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలి అనుకున్నాము. డీఓపీ విజయ్ కన్నన్ తో నాకు ముందే పరిచయముంది. అప్పుడు ఆయన జైలర్ సినిమాకి పని చేస్తున్నారు. నాగవంశీ గారు కూడా విజయ్ పేరు చెబితే వెంటనే ఓకే అని, ఆయనతో మాట్లాడారు. అలా విజయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేస్తారు. కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి.
సినిమా ఉపయోగించిన ఆయుధాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టున్నారు?
హీరోకి ఆయుధం అనేది కీలకం. ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాల్లో గొడ్డలి వంటి పవర్ ఫుల్ ఆయుధం బాగా ఫేమస్. ఈ సినిమాలో ఆలాంటి శక్తివంతమైన ఆయుధం ఉండాలి, కానీ అది కొత్తగా ఉండాలి అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు అద్భుతమైన ఆయుధాలను డిజైన్ చేశారు.
మీ గత చిత్రాలతో పోలిస్తే ‘డాకు మహారాజ్’లో కొత్తదనం ఏం ఉండబోతుంది?
నా గత సినిమాలతో బాబీ కథాకథనాలు బాగా రాస్తాడు అనే పేరు తెచ్చుకోగలిగాను. అయితే హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకునేలా చేయలేకపోయాను. ఇప్పుడు ‘డాకు మహారాజ్’తో విజువల్స్ పరంగా గొప్ప పేరు వస్తుంది.
రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ సమయంలో అందరూ బాగా కష్టపడ్డారని తెలిసింది?
దర్శకుడు, నటీనటుల కష్టం కంటే కూడా సిబ్బంది ఎక్కువ కష్టపడ్డారని చెప్పగలను. ఎందుకంటే మేము షూట్ గ్యాప్ లో నీడలో ఉంటాము. కానీ సిబ్బంది విరామమే లేకుండా ఎండలో ఎంతో కష్టపడతారు. అందుకే వారి కష్టం ముందు మా కష్టం చిన్నది అనిపిస్తుంది.
చిరంజీవి గారు, బాలకృష్ణ గారితో కలిసి పని చేయడం ఎలా ఉంది?
సినిమా విషయంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరిలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. ఇద్దరూ పని రాక్షసులే. నిర్మాతలకు అసలు నష్టం రానివ్వకూడదనే ఉద్దేశంతో పని చేస్తూ ఉంటారు. సినిమా కోసం ఎంతయినా కష్టపడతారు. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా రావడానికి, వారికున్న అపార అనుభవంతో పలు సూచనలు ఇస్తూ ఉంటారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వంటి సీనియర్ హీరోలతో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి?
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు హీరోయిన్లు మంచి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. వారివి రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కావు. నటనకు ఆస్కారమున్న పాత్రలు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
బాబీ డియోల్ గారి గురించి?
రెగ్యులర్ విలన్ పాత్రలా కాకుండా బాబీ డియోల్ గారి పాత్ర కొత్తగా ఉంటుంది. ఆయన నిబద్ధతగల నటుడు. పాత్రకి న్యాయం చేయడం కోసం సెట్ లో ఎంత సమయాన్ని అయినా కేటాయిస్తారు. అలాగే బాబీ డియోల్ గారు ఎన్టీఆర్ గారిని, బాలకృష్ణ గారిని ఎంతో గౌరవిస్తారు.
*Daaku Maharaaj is About NBK in a Never-Before-Seen Performance” – Bobby Kolli*
Bobby Kolli: Daaku Maharaaj is a story centered around the transformation of Sitaram into Daaku Maharaaj. We’ve created a technically advanced film while focusing on subtle filmmaking and honest storytelling.
Q: How is it working with industry stalwarts like Bala Krishna and Chiranjeevi?
Bobby Kolli: Both Bala Krishna and Chiranjeevi have many common qualities as senior actors from the same generation. Their discipline towards the craft is incredible, and they are both workaholics. They always prioritize the well-being of their producers, working tirelessly in any conditions, whether it’s heat or rain, without any relaxation when the work on set needs to be done.
Q: Daaku Maharaaj seems to present a never-before-seen side of Balakrishna. Can you tell us more about it?
Bobby Kolli: If you observe, there’s often a certain loudness in Balakrishna’s recent performances. In this film, we attempted a much more subtle and settled portrayal. Personally, I admire his performance in Simha, especially in the doctor role, which was subtle yet impactful. My aim was to present him in that same restrained manner, and I hope I’ve been successful in achieving that.
Q: Balakrishna’s films typically have larger-than-life sequences. Does Daaku Maharaaj feature such moments?
Bobby Kolli: No, we did not focus on any over-the-top sequences. This is an honest attempt, and we kept the storytelling grounded in realism.
Q: Can you tell us about your experience working with Naga Vamsi?
Bobby Kolli: Naga Vamsi is a producer who is truly passionate about delivering a great film, especially with Nandamuri Balakrishna. He didn’t compromise on any technical aspects, which is why we brought in DOP Vijay Karthik Kannan. As a result, the visuals of the film have been receiving a lot of appreciation.
Q: How was your experience working with the three heroines in the film?
Bobby Kolli: It was a wonderful experience working with all of them. The film features two heroines: Shraddha Srinath and Pragya Jaiswal. Urvashi plays a crucial role, adding a typical glamour touch to the film. Going by the story, Shraddha has a larger scope for performance, and we also have Chandini Chowdary in an important role.
Q: Shooting in Rajasthan must have been challenging. Can you tell us more about that?
Bobby Kolli: Honestly, as actors or directors, we have some comforts, but I always worry about the unit. The crew had to endure the intense heat without any protection like umbrellas. Their challenges were much greater than ours, and I truly salute their dedication and hard work.
Q: What is one quality you’ve adopted from Nandamuri Balakrishna?
Bobby Kolli: Discipline. I already have some discipline, but seeing Bala Krishna Garu’s dedication has inspired me to adopt even more.
Q: How would you describe Bobby Deol?
Bobby Kolli: Bobby Deol is a very humble person. He’s extremely punctual and gave a fabulous performance in the film, keeping it subtle yet impactful.
Q: What is the runtime of Daaku Maharaaj?
Bobby Kolli: The runtime of Daaku Maharaaj is 2 hours and 27 minutes, including all statutory cards.
Jan 10 2025
From here on, you’ll witness my second innings with double the energy. : Nandamuri Balakrishna
‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించబోతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.
ఈ సందర్భంగా ‘డాకు మహారాజ్’ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయనే పేరు వచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ అంతకుమించి అనేలా ఉంది. “వాడి ఒంటి మీద పదహారు కత్తి పోట్లు, ఒక బుల్లెట్ గాయం.. అయినా కిందపడకుండా అంత మందిని నరికాడంటే అతను మనిషి కాదు, వైల్డ్ యానిమల్” అనే డైలాగ్ తో బాలకృష్ణ పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో తెలిపారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారని రిలీజ్ ట్రైలర్ తో మరోసారి స్పష్టమైంది. అలాగే బాలకృష్ణ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగ్ లకు పెట్టింది పేరు. ‘డాకు మహారాజ్’లోనూ అలాంటి డైలాగ్ లకు కొదవ లేదని రిలీజ్ ట్రైలర్ తో రుజువైంది. “రాయలసీమ మాలూమ్ తేరే కో. ఓ మేరా అడ్డా”, “ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారు.. నేను చంపడంలో చేశా” వంటి డైలాగ్ లతో బాలకృష్ణ అదరగొట్టారు. అలాగే రిలీజ్ ట్రైలర్ లో విజువల్స్, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి.
ప్రీ రిలీజ్ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాధాకర ఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుకను రద్దు చేయడం జరిగింది. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే వారు మా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇన్ని లక్షల, కోట్ల మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను ఆయన ప్రతిరూపంగా మీ హృదయాల్లో నిలిపిన దైవాంశ సంభూతులు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావుకి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాన్న గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, ఆయన మాదిరిగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించుకుంటూ వస్తున్నాను. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల్లో నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే అప్పట్లో ‘ఆదిత్య 369′లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ఈ ‘డాకు మహారాజ్’ కథ పుట్టింది. ఈరోజు విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాలకృష్ణ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉంది. దర్శకుడు బాబీ ఆలోచనకు తగ్గట్టుగా, కెమెరామెన్ విజయ్ కన్నన్ గారు తన అద్భుత పనితీరుతో సన్నివేశాలకు ప్రాణం పోశారు. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ తరహాలో మరోసారి అద్భుతమైన సంగీతం అందించాడు. ఎడిటర్స్ రూబెన్, నిరంజన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఫైట్ మాస్టర్ వెంకట్ ఇలా టీం అంతా మనసు పెట్టి పని చేశారు. ప్రతిభగల నటీమణులు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన పాత్రలు పోషించారు. యానిమల్ రాకముందే బాబీ డియోల్ గారిని ఈ సినిమాలో తీసుకున్నాం. ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుంది. మూడు వరుస ఘన విజయాల తర్వాత వస్తున్న ‘డాకు మహారాజ్’తో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకముంది. ఇక ముందు కూడా ఇలాగే మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తున్నాను. సంక్రాంతికి విడుదలైన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతున్న ‘డాకు మహారాజ్’ కూడా ఘన విజయం సాధిస్తుంది. మీరు ఏం ఊహించుకుంటున్నారో అంతకంటే మించే ఈ సినిమా ఉంటుంది. అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు.” అన్నారు.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, “వాల్తేరు వీరయ్య సినిమా జరుగుతున్నప్పుడు నాగవంశీ గారు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా ఒకే ఒక మాట అడిగారు. ఈ సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు. బాలయ్య బాబు గారితో ఒక సినిమా చేయాలి అన్నారు. అక్కడి నుంచి ఎప్పుడు కలిసినా బాలయ్య బాబు గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సినిమా విడుదల తర్వాత మళ్లీ బాలకృష్ణ గారిని ఒక రోజు కలవాలి అని చెప్పారు. నిజానికి అంతకంటే ముందే ఒకరోజు పూరి జగన్నాథ్ గారి ఆఫీసులో బాలకృష్ణ గారిని కలిసాను. చాలా కూల్ గా మాట్లాడారు. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ఆరోజే నేను చూశాను. ఆ తర్వాత ఈ సినిమా కోసం నేను, వంశీ గారు వెళ్ళి బాలకృష్ణ గారిని కలిశాము. ఆరోజు నుంచి అంతా పాజిటివ్ గానే జరుగుతుంది. బాలకృష్ణ గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. తనని అంతగా ప్రేమిస్తున్న అభిమానుల కోసం నేను ఎంత కష్టమైనా పడతాను అని బాలయ్య బాబు గారు చెప్పేవారు. అభిమానుల కోసం కొత్తగా ఏదైనా చేయాలని తపిస్తూ ఉంటారు. నా టీంతో కలిసి ఎంతో శ్రద్ధగా ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేశాను. బాలకృష్ణ గారితో కలిసి పని చేస్తే ఆయనను ప్రేమిస్తాం, అభిమానిస్తాం. ఆయనతో మళ్ళీ మళ్ళీ కలిసి పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశాము. అందరూ టికెట్స్ బుక్ చేసుకొని, బాలకృష్ణ గారికి మంచి ఓపెనింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఐదేళ్ల క్రితం వైకుంఠ ఏకాదశి రోజున ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాము, ఆ సినిమా జనవరి 12 ఆదివారం విడుదలైంది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ విషయంలో కూడా అదే జరిగింది. ‘అల వైకుంఠపురములో’ లాగే ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. విభిన్న లొకేషన్లలో ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాము. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.” అన్నారు.
సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, “ఈ చిత్ర బృందం సృష్టించిన డాకు మహారాజ్ ప్రపంచం చాలా గొప్పది. చాలా కొత్తగా ఉంటుంది. దీని కోసం టీం అంతా ఎంతో కష్టపడ్డారు. కోవిడ్ సమయంలో అఖండ కోసం బాలకృష్ణ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ‘డాకు మహారాజ్’ కోసం కూడా ఆ స్థాయిలో కష్టపడ్డారు. కొన్ని సినిమాలకు ప్రాణం పెట్టి సంగీతం చేయాలి అనిపిస్తుంది. ఆలాంటి సినిమా ‘డాకు మహారాజ్’. విజయ్ కన్నన్ అద్భుతమైన విజువల్స్ అందించారు. అలాంటి గొప్ప విజువల్స్ వల్లే, నేను మంచి సంగీతం ఇవ్వగలిగాను. బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నా జీవితంలో నాన్న లేరనే లోటు, బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది. నేను బాగుండాలని మనస్ఫూర్తిగా దీవిస్తారు. నన్ను ఆయన ఎంతో నమ్మారు. అందుకే బాలకృష్ణ గారి సినిమాలకి మరింత బాధ్యతగా మనసు పెట్టి సంగీతం అందిస్తాను. ఈ సినిమాతో దర్శకుడిగా బాబీ మరో స్థాయికి వెళ్తారు. నాగవంశీ గారు నా కెరీర్ లో పిల్లర్ లాగా నిలబడ్డారు. సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలవబోతుంది. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం.” అన్నారు.
కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, “ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నా అభిమాన సహ నటుల్లో ఒకరైన బాలకృష్ణ గారితో వరుస సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ గారితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. డాకు మహారాజ్ వంటి గొప్ప సినిమాతో ఆ అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నేను కావేరి అనే ఒక మంచి పాత్ర పోషించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ గారికి, సితార ఎంటర్టైన్మెంట్స్ కి కృతఙ్ఞతలు. సినిమాలో థమన్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. జనవరి 12న విడుదలవుతున్న మా డాకు మహారాజ్ సినిమాని కుటుంబంతో కలిసి థియేటర్లలో చూసి ఆనందించండి.” అన్నారు.
కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, “తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారు లాంటి ఒక లెజెండ్ తో కలిసి నటించడం అదృష్టంgaa భావిస్తున్నాను. నిజానికి బాలకృష్ణ గారిని కలవడానికి ముందు నాకు చాలా భయం ఉండేది. కానీ కలిసిన క్షణాల్లోనే నన్ను చాలా కంఫర్టబుల్ చేసేశారు. అది ఆయనకు చాలా చిన్న విషయం కానీ నాకు చాలా పెద్ద విషయం. ఎంత పెద్ద స్టార్ అయినా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మిమ్మల్ని ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అంటారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. బాబీ గారు నాకు ఈ సినిమాలో నందిని అనే పాత్రను ఇచ్చారు. ఈ పాత్ర నా కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది. సితార బ్యానర్ లో మరిన్ని చేయాలని ఉంది.” అన్నారు.
నటి ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, “అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 12న విడుదలవుతున్న మా డాకు మహారాజ్ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇది కుటుంబంతో కలిసి చూసి ఆనందించదగ్గ చిత్రం. ట్రైలర్స్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందనకు ఎంతో ఆనందంగా ఉంది. బాలకృష్ణ గారితో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. థమన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికి థాంక్స్. నాకు ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీ గారికి, నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు.” అన్నారు.
వైజాగ్ ఎంపీ భరత్, నందమూరి తేజస్విని, ఛాయాగ్రాహకుడు విజయ్ కన్నన్, రచయిత మోహన్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘డాకు మహారాజ్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
‘Daaku Maharaaj’ Pre-Release Event Held Grandly in Hyderabad.
From here on, you’ll witness my second innings with double the energy. : Nandamuri Balakrishna
The God of Masses, Nandamuri Balakrishna, is all set to deliver yet another blockbuster with his upcoming film Daaku Maharaaj this Sankranti. After the massive success of Akhanda, Veera Simha Reddy, and Bhagavanth Kesari, Balakrishna returns in a dynamic and versatile role in this action-packed drama. Directed by the blockbuster director Bobby Kolli, the film is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners Sithara Entertainments and Fortune Four Cinemas. The music is composed by Thaman, with Pragya Jaiswal and Shraddha Srinath playing the lead female roles. Bobby Deol, Urvashi Rautela, and Chandini Chowdary also play key roles. The film is set to release worldwide on January 12, 2025, just in time for the festive season.
A pre-release event was held at ITC Kohinoor, Hyderabad, on Friday evening, where the much-awaited Daaku Maharaaj release trailer was unveiled. It’s everything fans of Nandamuri Balakrishna could have hoped for – and more. Packed with fiery dialogues, breathtaking visuals, and NBK’s signature mass appeal, the trailer perfectly sets the stage for a Sankranti blockbuster. True to the expectations of Balakrishna’s die-hard fans, the trailer delivers powerful one-liners that are sure to resonate with audiences. Among them, the standout line, “I did a master’s in murders,” reflects NBK’s fierce and bold screen persona.
Director Bobby Kolli has brought out a refreshing yet intense side of Balakrishna, presenting him in a subtle yet power-packed avatar that adds depth to the larger-than-life character. Visually, Daaku Maharaaj is a spectacle.
At the pre-release event, Balakrishna expressed his gratitude and shared his thoughts on the film. He said, “The tragic incident at Tirumala deeply affected me. I pray for the souls of those who lost their lives. Due to the incident, we had to cancel the celebration planned in Anantapur. My fans are like disciplined soldiers, and they have accepted our decision. I am deeply thankful for the love and support of my fans. I believe Daaku Maharaaj will be another major success, and this film will stand out beyond expectations.”
Director Bobby Kolli expressed his excitement about working with Balakrishna and shared his journey toward making the film. He stated, “Balakrishna garu’s love for his fans is unmatched, and he has always been humble despite his stardom. He puts in his best effort for his audience, and working with him on Daaku Maharaaj has been a privilege. I am proud of the work we’ve done together.”
Producer Suryadevara Naga Vamsi also shared his enthusiasm for the project, stating, “We’ve worked hard on this film, and I am hopeful that Daaku Maharaaj will be another success, just like Ala Vaikunthapurramuloo.”
Music director Thaman praised the visuals and music, highlighting the effort that went into creating the film’s soundtrack. He mentioned, “This is a film where the music blends seamlessly with the intense visuals. Working with Balakrishna garu is always a joy, and I’m sure Daaku Maharaaj will be a massive success this Sankranti.”
Lead actress Pragya Jaiswal expressed her happiness about the positive feedback for the trailer and her experience working with Balakrishna. She said, “I’m thrilled to be a part of Daaku Maharaaj. Balakrishna garu’s humility and dedication are truly inspiring. It’s been a wonderful experience working with the team, and I hope the audience loves the film.”
Actress Shraddha Srinath also shared her excitement, adding, “Working with a legend like Balakrishna was an incredible experience. I’m glad to be a part of this film, and I’m sure it will be remembered for years to come.”
Urvashi Rautela concluded, “This is a family entertainer, and everyone should watch Daaku Maharaaj with their loved ones. It’s a privilege to work with such talented people, and I am confident the audience will love the film.”
The event was also attended by notable personalities such as MP Bharat, Nandamuri Tejaswini, cinematographer Vijay Kartik Kannan and writer Mohan Krishna, who all expressed their best wishes for the film’s success on January 12.
Presented by: Srikara Studios
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Title: Daaku Maharaaj
Release Date: January 12, 2025
Genre: Action Drama
Cast:
Hero: Nandamuri Balakrishna
Co-Stars: Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandhini Chowdary
Technical Crew:
Director: Bobby Kolli
Producer: Naga Vamsi
Music Director: Thaman S
Cinematography: Vijay Kartik Kannan
Editors: Niranjan Devaramane, Ruben
Production Designer: Avinash Kolla
Jan 10 2025
*”Daaku Maharaaj Releasing on My Birthday Is the Biggest Coincidence Ever: Pragya Jaiswal”*
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలలో మరింత జోరును పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక ప్రగ్యా జైస్వాల్, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది?
2015 లో తెలుగులో నా సినీ ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసి, సినిమా గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పలు మంచి సినిమాల్లో భాగమయ్యాను. మరిన్ని మంచి సినిమాలతో అలరించడానికి ప్రయత్నిస్తున్నాను.
అఖండ, డాకు మహారాజ్, అఖండ-2.. బాలకృష్ణ గారితో వరుస సినిమాలు చేయడం ఎలా ఉంది?
బాలకృష్ణ గారితో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. కోవిడ్ సమయంలో ఎవరూ పెద్దగా సినిమా చేయలేదు. అలాంటి సమయంలో బోయపాటి శ్రీను గారు అఖండ కథ చెప్పి, అంత గొప్ప సినిమాలో నన్ను భాగం చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించి, నా సినీ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు డాకు మహారాజ్ లాంటి మరో మంచి సినిమాలో బాలకృష్ణ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. డాకు మహారాజ్ కూడా ఘన విజయం సాధిస్తుందని, ఈ చిత్రంలోని నా పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను.
డాకు మహారాజ్ లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇందులో నేను కావేరి పాత్ర పోషించాను. నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర ఇది. డీ గ్లామరస్ రోల్ చేశాను. నేను ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. కావేరి పాత్రను బాబీ గారు డిజైన్ చేసిన తీరు బాగుంది. ఈ పాత్ర నాకు నటిగా ఛాలెంజింగ్ గా అనిపించింది. కావేరి పాత్రతో పాటు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.
దర్శకుడు బాబీ గారి గురించి?
బాబీ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం ఇంత కాలానికి వచ్చింది. బాబీ గారు అద్భుతమైన దర్శకుడు. మంచి మనిషి. సెట్స్ లో చాలా కూల్ గా ఉంటారు. నటీనటులను ఒత్తిడికి గురి చేయకుండా, వారి పనిని తేలిక చేసి, మంచి నటనను రాబట్టుకుంటారు. బాబీ గారు కథ చెప్పినప్పుడే ఇది మంచి చిత్రం అవుతుందని నమ్మాను. నేను ఊహించిన దానికంటే గొప్పగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బాలకృష్ణ గారిని సినిమాలో చాలా కొత్తగా చూపించారు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.
బాలకృష్ణ గారి గురించి?
బాలకృష్ణ గారికి సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ, ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తనలో తాను స్ఫూర్తి నింపుకోవడమే కాకుండా, ఇతరులలోనూ ఆ స్ఫూర్తి నింపుతూ ఉంటారు. సెట్స్ లో బాలకృష్ణ గారు అందరితో ఎంతో సరదాగా ఉంటారు. సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకోవచ్చు. ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చారంటే, నటుడిగా దర్శకుడికి ఏం కావాలంటే అది నూటికి నూరు శాతం ఇస్తారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ గురించి?
తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. సితారలో ప్రతి ఒక్కరూ సినిమా పట్ల ఎంతో పాషన్ తో ఉంటారు. నాగవంశీ గారు గొప్ప నిర్మాత. దర్శకులను, టీంని ఎంతో నమ్ముతారు. అందరిని స్వేచ్ఛగా పని చేసుకోనిస్తారు. వంశీ గారు తక్కువ మాట్లాడతారు.. కానీ ఎప్పుడూ మంచి సినిమాలను అందించడానికి తపిస్తూ ఉంటారు.
తమన్ గారి సంగీతం గురించి?
మన సినీ పరిశ్రమలో ఉన్న గొప్ప సంగీత దర్శకులలో తమన్ గారు ఒకరు. ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాల్లో ఆయన సంగీతం మరింత గొప్పగా ఉంటుంది. ‘డాకు మహారాజ్’ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. నాకు ది రేజ్ ఆఫ్ డాకు సాంగ్ ఎంతగానో నచ్చింది. దబిడి దిబిడి, చిన్న సాంగ్స్ కూడా బాగున్నాయి. పాటలతో పాటు ఈ చిత్ర నేపథ్య సంగీతం కూడా బాగుంటుంది.
జనవరి 12 మీ పుట్టినరోజు కదా.. అదే రోజు డాకు మహారాజ్ విడుదలవుతుండటం ఎలా ఉంది?
పుట్టినరోజు ప్రతి ఏడాది వస్తుంది. కానీ బాలకృష్ణ గారి సినిమా అనేది ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆయనతో కలిసి నేను నటించిన సినిమా నా బర్త్ డేకి విడుదల కావడం నా అదృష్టం. ఇది నా పుట్టినరోజుకి ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను. అలాగే నేను నటించిన సినిమా సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు విడుదలవుతుండటం కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా డాకు మహారాజ్ తో పాటు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మీ డ్రీం రోల్ ఏంటి? ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
ఎస్.ఎస్. రాజమౌళి గారు, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకులు తీసే భారీ సినిమాలలో శక్తివంతమైన పాత్రలు పోషించాలని ఉంది. అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలని ఉంది.
*”Daaku Maharaaj Releasing on My Birthday Is the Biggest Coincidence Ever: Pragya Jaiswal”*
Q: How do you feel about working with Nandamuri Balakrishna again in Daaku Maharaaj?
Pragya Jaiswal: Definitely, Balakrishna Sir is a lucky charm. I’m happy to associate with him once again. Daaku Maharaaj is a completely different film and world, brilliantly created by Bobby Sir. My character, Kaveri, is unique and exciting. I already feel positivity around this project because the audience has always appreciated me on screen, and I hope they will enjoy this performance too.
Q: What’s your opinion on the director Bobby Kolli?
Pragya Jaiswal: Bobby Sir was the first director I met in the Telugu film industry, even before I did Kanche. We’ve been in touch for years but never got the chance to collaborate until now. When he approached me for this film, I was instantly on board after watching the teaser. His calm demeanor on set, even during challenging situations, makes the entire experience smooth. Despite the heat, dust, and tough conditions in Rajasthan, he and his team created a stress-free environment. Working with him has been an absolute blessing.
Q: Do you notice any differences in Nandamuri Balakrishna off-screen and on-screen?
Pragya Jaiswal: Surprisingly, there aren’t many differences. Off-screen, Balayya Sir is the same positive, energetic, and childlike person. He’s enthusiastic, talkative, and full of life, always cracking jokes or sharing stories about his father’s movies. On-screen, however, he transforms into a superhuman, especially during intense performances like the Akhanda Agghora character. He truly possesses unmatched dedication and energy.
Q: How was your experience working with Sithara Entertainments?
Pragya Jaiswal: Sithara Entertainments is one of the most prestigious production houses in Telugu cinema. I feel fortunate to be part of their banner. Naga Vamsi Garu is a very driven producer whose silent support means so much. It has been a smooth and enjoyable journey working with their passionate team, and I hope to collaborate with them on more projects in the future.
Q: In the trailer, there’s a shot of you holding a knife ferociously. Can you elaborate on that?
Pragya Jaiswal: It’s a bit of a surprise, and you’ll find out in 2-3 days. Let’s wait and watch—it’s going to be exciting!
Q: Were there any physical challenges during the shoot for Daaku Maharaaj?
Pragya Jaiswal: Absolutely. Shooting in Rajasthan’s extreme heat and dust, along with the use of propeller fans, was physically demanding. I fell sick on the second or third day, but the passion of the team kept me going. Bobby Sir and his crew made sure I could focus solely on my performance, despite the challenging conditions. The DOP Vijay Kannan Sir’s attention to detail brought Bobby Sir’s vision to life, and that motivated me to give my best.
Q: Daaku Maharaaj is releasing on your birthday. How does that feel?
Pragya Jaiswal: I feel truly blessed. It’s the best coincidence ever. Releasing on my birthday, and during Sankranti—a significant festival—is like a sign from the universe. This feels like the biggest celebration I could ask for.
Q: What’s your opinion on Sankranti releases?
Pragya Jaiswal: Sankranti is a special time when many big films release. I believe all good films find success during this season. I wish the best for all films releasing alongside ours and hope they all get the recognition they deserve.
Q: How was it working with music director Thaman?
Pragya Jaiswal: Thaman is one of the best music directors in the industry, and his combination with Balakrishna Sir is on another level. He has created incredible songs and background music for Daaku Maharaaj. My personal favorite is “Rage of Daaku.” Thaman always brings fresh sounds, making every project exciting and unique.
Q: What have you learned professionally and personally from Nandamuri Balakrishna?
Pragya Jaiswal: Discipline is the biggest takeaway from Balakrishna Sir. He wakes up as early as 3:30 AM, does his poojas, workouts, and is always on set before time. Despite years of superstardom, he remains grounded, committed, and passionate about his craft. His childlike energy and unwavering dedication to every director’s vision are truly inspiring. Working with him has been a learning experience, both professionally and personally.
Follow Us!