T.S.R. LALITAKALA PARISHAT

లెజండ‌రి సింగ‌ర్ ఆశాభోస్లేకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన య‌శ్ చోప్రా 5వ జాతీయ అవార్డు ప్ర‌దానం..!

లెజండ‌రి సింగ‌ర్ ఆశాభోస్లేకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన య‌శ్ చోప్రా మెమురియ‌ల్ జాతీయ అవార్డు 2018ని టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేష‌న్  ఫిబ్ర‌వ‌రి 16న ముంబాయిలోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్ లో ప్ర‌దానం చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో టి.సుబ్బిరామిరెడ్డి, మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు, బాలీవుడ్ న‌టి రేఖ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రేఖ ఆశా భోస్లేకి త‌మ అభినంద‌న‌లు తెలియ‌చేస్తూ…పాదాభివంన‌దం చేసి త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌మ్ చోప్రా, అల్క య‌గ్నిక్, జాకీ షాఫ్ర్, ప‌రిణితి చోప్రా, పూన‌మ్ దిలాన్, జ‌య‌ప్ర‌ద త‌దిత‌ర బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.
ఈ అవార్డ్ ను గ‌తంలో ల‌తా మంగేష్క‌ర్, అమితాబ్ బ‌చ్చ‌న్, రేఖ‌, షారుఖ్ ఖాన్ అందుకున్నారు. 84 సంవ‌త్స‌రాల ఆశా భోస్లే సుదీర్ఘ సినీ సంగీత ప్ర‌స్ధానంలో 7 ద‌శాబ్ధాలుగా 11వేల పాట‌ల‌ పాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు 20 భాష‌ల్లో పాట‌లు పాడి ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారామె.
ఈ అవార్డ్ జ్యూరీలో యశ్ చోప్రా స‌తీమ‌ణి ప‌మేలా చోప్రా, బోనీక‌పూర్, మ‌ధుర్ భాండార్క‌ర్, సింగ‌ర్ అల్కా య‌గ్నిక్, న‌టుడు ప‌ద్మిని కోహ్ల‌పూర్, స్ర్కిప్ట్ రైట‌ర్ హ‌నీ ఇరానీ, అను, శ‌శి రంజ‌న్ స‌భ్యులుగా ఉన్నారు. 2012లో చ‌నిపోయిన య‌శ్ చోప్రా జ్ఞాప‌కార్ధం టి.సుబ్బిరామిరెడ్డి అను రంజ‌న్, శ‌శి రంజ‌న్ క‌ల‌సి ఈ అవార్డును నెల‌కొల్పారు. ఈ అవార్డ్ తో పాటు 10 ల‌క్ష‌లు న‌గ‌దును కూడా అంద‌చేసారు.
 2 3 6 DSC_2165 DSC_2284 DSC_2287 DSC_2296 DSC_2310 DSC_2324 DSC_2334 DSC_2355 IMG_6156 IMG_6204 IMG_6354 IMG_6414 IMG_6552 IMG_6561 IMG_6574 IMG_6582 IMG_6586 IMG_6669 1 4 5 7 8 9 10 12
Legendary playback singer Asha Bhosle was presented with the 5th Yash Chopra Memorial national Award 2018 by T Subbarami Reddy foundation on 16 February at a star hotel in Mumbai. The fifth recipient of the award, the singer was felicitated by TSR, Hon’ble Governor of Maharashtra Shr. Vidya Sagar Rao, Rekha etc.  Rekha kissed Asha and even touched the latter’s feet. Also present at the event were Pam Chopra, Alka Yagnik, Jackie Shroff, Parineeti Chopra, Poonam Dhillon and Jaya Prada and other bollywood celebrities.
Previous recipients of the award are Lata Mangeshkar, Amitabh Bachchan, Rekha, and Shah Rukh Khan.

Yash Chopra’s wife Pamela Chopra, filmmakers Boney Kapoor, Madhur Bhandarkar, singer Alka Yagnik, actor Padmini Kohlapure, scriptwriter Honey Irani, and Anu and Shashi Ranjan were part of the award jury panel.

Bhosle, 84, whose illustrious music career spans nearly seven decades and recorded over 11,000 songs in 20 different languages, was selected for the award instituted in the memory of the filmmaker.

The award has been instituted by MP Dr.T Subbarami Reddy in the memory of Chopra, who died in 2012, in association with Anu Ranjan and Shashi Ranjan. The award also carries a cash prize of Rs 10 lakh.

 

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌ బిరుదు ప్రదానం

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌ బిరుదు ప్రదానం చేశారు. విశాఖలో జరిగిన మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం సాగింది. మంగళవారం రాత్రి ఆర్కేబీచ్‌ తీరంలో జరిగిన కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ వ్యవస్థాపకుడు సుబ్బరామిరెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా కైకాల సత్యనారాయణకు బిరుదుతో పాటు బంగారు కంకణాన్ని ప్రదానం చేశారు. సినీ రంగంలో కైకాల చేసిన కృషికి ఈ అవార్డును బహుకరిస్తున్నట్లు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. సుమారు 780 చిత్రాల్లో నటించిన కైకాలను సత్కరించుకోవటం ఆనందంగా ఉందని బాలకృష్ణ అన్నారు. సినీ, కళా, సామాజిక రంగాల్లో కృషిచేసిన పలువురికి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శివశక్తి అవార్డులను సైతం బాలకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు.– 

20180214_105508 20180214_105709 20180214_110124 20180214_110312 20180214_110613 BVN_3540 BVN_3543 BVN_3561 BVN_3589 BVN_3592 BVN_3600 BVN_3607 YRK_2472 YRK_2518_1 YRK_2525 YRK_2574 YRK_2575

Dr.T.Subbaraamireddy pressmeet

DSC_5421 DSC_5476 new doc 2018-02-10 12.40.40_1 new doc 2018-02-10 12.41.18_1

YASH CHOPRA NATIONAL MEMORIAL AWARD FOR ASHA BHOSLE

 

tsr
T Subbarami Reddy Foundation Instituted National Yeah Chopra National Memorial  Award 2017 which carries Rs 10.00 lakhs cash with swarna kankanam.
T Subbarami Reddy said that Asha Bhosle is best known as a playback singer in Hindi cinema, has done playback singing for over a thousand Bollywood movies.
 
Asha Bhosle was officially acknowledged by the Guinness Book of World Records as the most recorded artist in music history ,The Government of India honoured her with the Dadasaheb Phalke Award in 2000 and the Padma Vibhushan in 2008.
T Subbarami Reddy held a meeting of Jury Members on January 27th 2018 consisting of T. Subbarami Reddy as the chairman and Boney Kapoor, Madhu Bhandarkar, Honey Irani and Padmini kolhapure as members. Under his chairmanship they had long discussions and declared legandary singer Asha Bhousle to be given this year the Yash Chopra National Memorial Award.
Earlier Shri Lata Mangeshkar, Shri Amitabh Bachchan, Shri Rekha, Shri Shahrukh Khan have received the Yash Chopra National Memorial Award.
He has also decided that the award celebration will be held on February 16th 2018 at mumbai in a glittering function. The Governer of Maharastra C.H. Vidyasagar Rao and Lata Mangeshkar will be honoring her with the award. The entire film fraternity which include Amitabh Bachchan, Shahrukh Khan, Amir Khan, Sridevi, Jayaprada and other dignitaries will participate in the function and will cherish the memories of Yash Chopra.
ప్రముఖ నేపథ్య గాయని శ్రీమతి ఆశాభోస్లేకు 
టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్
 
భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే కళాబంధు శ్రీ టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకనిర్మాత యశ్ చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధం తోనే యశ్ చోప్రా తనువు చాలించిన తర్వాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుండీ నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్ ను సినీ ప్రముఖులకు అందచేస్తున్నారు. ఈ సారి 2017కి గానూ ఈ అవార్డును ప్రముఖ నేపథ్య గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఆశాభోస్లేకు అంద చేయబోతున్నారు. శనివారం ముంబైలో సమావేశమైన టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు సర్వశ్రీ బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి… శ్రీమతి ఆశాభోస్లే పేరును నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు.
గతంలో ఈ అవార్డును శ్రీమతి లతా మంగేష్కర్, శ్రీ అమితాబ్ బచ్చన్, శ్రీమతి రేఖ, శ్రీ షారుక్ ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017′ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. 
1933లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ ప్రాయంలోనే నేపథ్య గాయనిగా తన కెరీర్ ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలు ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్’ మరో కలికితురాయిగా నిలువబోతోంది.

ఈ నెల 17న టీఎస్సార్ ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’

 2018-01-13-PHOTO-00000012 DSC_2371 DSC_2375ఈ నెల 17న టీఎస్సార్ ’కాకతీయ కళా వైభవ మహోత్సవం’
ఎప్పుడూ కళలను, కళాకారులను గౌరవిస్తూ, ప్రోత్సహించే మంచి మనసున్న మనిషి ’కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి. టీఎస్సార్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్టణం నగరాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. ఇప్పుడు కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే విధంగా ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించనున్నట్టు తెలిపారు. టీఎస్సార్ కాకతీయ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుక వివరాలు తెలియజేయడం కోసం శనివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ- “కాకతీయుల పరిపాలన స్వర్ణయుగం. 600 ఏళ్ల క్రితమే తెలుగు సంస్కృతి, నాగరికతలు ఘనంగా చాటారు. కళల్ని పోషించారు. ఎన్నో గొప్ప దేవాలయాలను శిల్పకళా నైపుణ్యం, చాతుర్యంతో నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు నుంచి తెలుగుజాతికి వారసత్వాన్ని అందించారు.  వరంగల్ రాజధానిగా 300 ఏళ్లు తెలుగువారిని పరిపాలించారు. వాళ్ల  పేరు మీద ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ నెల 17న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక నిర్వహిస్తాం. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా వేడుక ప్రారంభమవుతుంది. ఈ వేడుకలోనే సుమారు 560 చిత్రాల్లో నటించి, చిత్రపరిశ్రమలో 42 ఏళ్లు పూర్తి చేసుకున్న మోహన్ బాబును ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదుతో సత్కరిస్తున్నాం. పలువురు ఆధ్యాత్మిక, రాజకీయ, సినీ, సాంస్కృతిక  ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరు కానున్నారు. తర్వాత తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో రెండు మూడు నెలలకు ఒకసారి కాకతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తాం” అన్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ- “కళాకారులను, కళలను గౌరవించే వ్యక్తుల్లో టి. సుబ్బరామిరెడ్డిగారు ముందుంటారు.   కాకతీయుల కళా వైభోగాన్ని ప్రజలకు చాటి చెప్పాలనుకోవడం అభినందనీయం. ఇక, నాకు ఇవ్వనున్న ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదు గురించి ముందు చెప్పగానే… ‘బిరుదులు నాకు ఎందుకు?’ అన్నాను. వద్దని విశాఖలో చెప్పాను. మళ్లీ  ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్పారు.  దాంతో ఆయన అభీష్టాన్ని కాదనలేకపోయా” అన్నారు.
ఈ కార్యక్రమంలో రచయిత-నటుడు పరుచూరి గోపాలకృష్ణ, ‘లయన్ క్లబ్’ సభ్యులు, ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ ఉత్సవ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, కూచిపూడి నృత్య కళాకారిణిలు పద్మజ, సుజాతలు పాల్గొన్నారు.