Oct 7 2019
Madhavan in “Nissabdham”
He will steal your heart away with his charm. Meet Anthony, a celebrity musician! #MadhavanAsAnthony #Nishabdham
@ActorMadhavan #AnushkaShetty @hemantmadhukar @peoplemediafcy @KonaFilmCorp @nishabdham
Oct 7 2019
He will steal your heart away with his charm. Meet Anthony, a celebrity musician! #MadhavanAsAnthony #Nishabdham
@ActorMadhavan #AnushkaShetty @hemantmadhukar @peoplemediafcy @KonaFilmCorp @nishabdham
Oct 2 2019
Aug 3 2019
అయితే… కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహ కు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాలనే సదుద్దేశ్యంతో సోషల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ నిర్మాణ సంస్థతో ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్ సంస్థ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా సోషల్ అవేర్నష్ ఫిల్మ్ ను నిర్మిస్తోంది.
‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్ట్ ఇండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీకి ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె దర్శకత్వం వహించిన ల్యాండ్ ఆఫ్ విడోస్ మరియు వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంటరీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మహిళలకు శుభ్రత విషయంలో అవగాహన కల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ మూవీకి నిర్మాత – టి.జి.విశ్వప్రసాద్, కో – ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభోట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శ్రీ నటరాజ్, ప్రాజెక్ట్ డిజైన్ & ఎగ్జిక్యూషన్ – ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్.
Dwayne Bravo has released the poster of short film where he plays a keyrole, posted in his fb account
Producer-TG Viswa Prasad, Co-Producer – Vivek Kuchibhotla, Executive Producer – Sri Nataraj, Project Design and Execution-ANT Productions
Jun 30 2019
హరిరామజోగయ్య గారు త్వరగా కోలుకోవాలి
• నాకు మార్గదర్శకులుగా వ్యవహరించాలి
• జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు
జనసేన పార్టీ హితం కోరుకొనే శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు త్వరగా కోలుకోవాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆకాంక్షించారు. నాకు, పార్టీకి మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరితే వారు అందుకు అంగీకారం తెలిపారని చెప్పారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ శ్రీ హరిరామ జోగయ్య అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం శ్రీ పవన్ కల్యాణ్ గారు శ్రీ హరిరామ జోగయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “నిబద్ధత కలిగిన హరిరామ జోగయ్య గారు నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా 2004-09 కాలంలో ఉండి, మా కుటుంబం కోసం రాజీనామా చేసి వచ్చారు. అనుభవజ్ఞులైన వారి సలహాలు, ఆశీస్సులు అవసరమని పోరాటయాత్ర సమయంలో పాలకొల్లు వెళ్ళి కలిశాను. ఇప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పటికి కూడా జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయం గురించి చర్చించారు. హరిరామ జోగయ్యగారు నాకు మార్గరదర్శకులుగా ఉంటారు.
• జనసేన అధ్వర్యంలో పాలకొల్లులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాలకొల్లు నుంచి ఎందరో వచ్చారు. అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు… ఇలా చాలామంది పాలకొల్లు నుంచి వచ్చినవారే. నవతరంలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దేలా పాలకొల్లులో శ్రీ ఎస్.వి.రంగారావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను జనసేన అధ్వర్యంలో నెలకొల్పనున్నాం. ఈ ఇన్స్టిట్యూట్ కి హరిరామ జోగయ్య గారు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాతగాను ఎన్నో మంచి చిత్రాలు అందించారు. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసు నేతృత్వంలో నడుస్తుంది. ఇందుకు నా అండదండలు ఉంటాయి. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఉంటుంది” అన్నారు.
శ్రీ హరిరామ జోగయ్య మాట్లాడుతూ “చిరంజీవిగారు కుటుంబం అంటే నాకు ఎంతో ఇష్టం. పవన్ కల్యాణ్ గారికి అభిమానిని. జనసేన పార్టీకి ఎప్పుడూ నా సహాయసహకారాలు ఉంటాయి. చివరి శ్వాస వరకూ జనసేన కోసమే పని చేస్తాను. ప్రజలందరి క్షేమం కోరుకొంటూ… అందరినీ సురక్షితంగా చూసుకొనే పార్టీ ఇది. అందరం శ్రీ పవన్ కల్యాణ్ గారు వెన్నంటి నడుద్దాం. పాలకొల్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇస్తాం. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధం అయింది. ఈ శిక్షణాలయం ప్రారంభానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు వస్తారు” అని చెప్పారు.
Jun 29 2019
* ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు
ద్వారెన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం *
ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు
ద్వారెన్ బ్రావో తో తమ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలిం ను నిర్మించటాన్ని ఎంతో సంతోషంగా ప్రకటించారు సంస్థ అధినేత టి.జి.విశ్వప్రసాద్.
ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా వైవిధ్యమైన కథా చిత్రాను నిర్మిస్తూ…విజయాలు సాధిస్తూ..అటు ఆడియన్స్ లోను, ఇటు ఇండస్ట్రీలోను అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్, సిల్లీఫెలో, గూఢచారి చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం సమంత అక్కినేని ప్రధాన పాత్రలో ఓ బేబి, విక్టరీ వెంకటేష్ – యువ సమ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ వెంకీ మామ, అనుష్క, మాధవన్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడసన్ కాంబినేషన్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సైలెన్స్, నాగ శౌర్యతో చిత్రాలను నిర్మిస్తోంది.
ఇలా విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విదేశాలలో షూటింగ్ జరుపుకోవటానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా సమకూరుస్తున్న విషయం విదితమే. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, వీటితోపాటు సామాజిక స్పృహ కు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. విషయానికి వస్తే ఈ సంస్థ మరో ముందడుగు వేసి ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు ద్వారెన్ బ్రావో తో , తమ సంస్థ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CRS )’ లో భాగంగా ఓ షార్ట్ ఫిలింను నిర్మించ బోతోంది. దీనికి సంబంధించి నేటి ఉదయం వీరిరువురి మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ద్వారెన్ బ్రావో తో పాటు చిత్ర నిర్మాత టి.జి.విశ్వప్రసాద్,సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్ళై లు పాల్గొన్నారు.
సోషల్ అవేర్నెస్ కు సంబంధించి రూపొందే ఈ లఘు చిత్రం కోయంబత్తూర్, తమిళనాడు, అలాగే వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టొబాగో లలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రేపటినుంచి కోయంబత్తూర్ లో షూటింగు ప్రారంభమవుతుందని దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలుపుతామని ప్రకటించారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్
*People Media Factory: Social Responsibility Move*
We, People Media Factory, are not only a film making company, but a socially responsible corporate house. We promote, through the medium of film, many socially relevant endeavours and promote the responsible use of our resources.
We are delighted to share the news of signing up with celebrated cricketer Dwayne Bravo, to make a social awareness short film. This forms a part of our CSR project.
The short film will be completing its shooting in Coimbatore, Tamil Nadu and in Trinidad and Tobago, West Indies.
We finalised the project in the presence of producer Mr. T.G. Vishwa Prasad and co producer, Mr.Vivek Kuchibhotla. Mr. Dwayne Bravo and the executive producer, Natraj Pillai, were also present on the occasion of the signing of the deal.
We pledge to serve the social causes in a similar vein in the future too. We expect the valuable suggestions and reactions of citizens after the release of the short film.
Let us make this world a better place to live.
Follow Us!