Uncategorized

Pedhavulu Veedi Maunam, a new melody from Takkar, starring Siddharth, Divyansha Kaushik, is an ode to love

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘పెదవులు వీడి మౌనం’ విడుదల
* ప్రేమ మైకంలో ముంచేలా ‘పెదవులు వీడి మౌనం’ పాట
* ప్రత్యేక ఆకర్షణగా సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల కెమిస్ట్రీ
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’ సాంగ్ కూడా విశేష ఆదరణ పొందింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి ‘పెదవులు వీడి మౌనం’ అనే సాంగ్ విడుదలైంది.
‘పెదవులు వీడి మౌనం’ లిరికల్ వీడియోని చిత్రబృందం శనివారం విడుదల చేసింది. నివాస్ కె ప్రసన్న స్వరపరిచిన ఈ రొమాంటిక్ సాంగ్ కట్టిపడేస్తోంది. “పెదవులు వీడి మౌనం.. మధువులు కోరే వైనం.. తనువులు చేసే స్నేహం.. నేడే…” అంటూ సాగిన పాట ప్రేమ మైకంలో ముంచేసేలా ఉంది. ఆ పాట మూడ్ కి సందర్భానికి తగ్గట్టుగా నివాస్ కె ప్రసన్న ఎంత చక్కగా స్వరపరిచారో.. కృష్ణ కాంత్ అందించిన సాహిత్యం కూడా అంతే చక్కగా కట్టిపడేసేలా ఉంది. తేలికైన పదాలతో లోతైన భావాలను పలికించారు కృష్ణ కాంత్. దీపక్ బ్లూ, చిన్మయి శ్రీపాద ఎంతో అందంగా ఈ పాటను ఆలపించి, తమ మధుర గాత్రంతో మాయ చేశారు. ఇక నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని, వెండితెరపై ఈ జోడి మ్యాజిక్ చేయబోతోందని ఈ లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తున్నారు.
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్టర్: ఉదయ కుమార్ కె
స్టంట్స్ కోరియోగ్రఫీ: దినేష్ కాశి
పబ్లిసిటీ డిజైన్స్: 24AM
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహా నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్
Pedhavulu Veedi Maunam, a new melody from Takkar, starring Siddharth, Divyansha Kaushik, is an ode to love
Takkar, the action-romance starring Siddharth, Divyansha Kaushik in the lead roles, is gearing up for a theatrical release in Tamil and Telugu worldwide on May 26. The film is written and directed by Karthik G Krish and jointly produced by TG Vishwa Prasad and Abhishek Agarwal under People Media Factory and Abhishek Agarwal Arts in collaboration with Passion Studios.
After grabbing eyeballs with the teaser and the video song Kayyale, the team released another song from the film Pedhavulu Veedi Maunam today. Nivas K Prasanna scores the music for the project while Deepak Blue, Chinmayi Sripada are the singers. Krishna Kanth has written the lyrics for the feel-good melody.
The song takes you through the intimate moments in the life of the on-screen couple as they lose track of the world amidst each other’s company. The soothing composition and the mellowed singing leave a terrific aftertaste. Krishna Kanth’s lyrics express the emotions of the characters with immense sensitivity.
‘Pedhavulu Veedi Maunam..Madhuvulu Kore Vainam..Thanuvulu Chese Sneham Nede,’ the opening lines offer a peek into the mood of the song, that progresses like a gentle breeze brushing your face. The fantastic chemistry between Siddharth and Divyansha further beautifies the listening experience.
Abhimanyu Singh, Yogi Babu, Munishkanth, and RJ Vigneshkanth play other important roles in the film. Vanchinathan Murugesan is the cinematographer and GA Gowtham is the editor. People Media Factory and Abhishek Agarwal Arts scored big hits in their previous collaborations like Karthikeya 2 and Dhamaka.
Cast: Siddharth, Divyansha, Abhimanyu Singh, Yogi Babu, Munishkanth, RJ Vigneshkanth.
Written and directed by Karthik G Krish
Cinematographer: Vanchinathan Murugesan
Editor: GA Gowtham
Art Direction: Udaya Kumar K
Stunts Choreography: Dinesh Kasi
Publicity Designs: 24AM
Teaser cut – Pradeep E Ragav
Producers: T G Vishwa Prasad, Abhishek Agarwal
Co-producer: Vivek Kuchibhotla
Executive producer: Mayank Agarwal
plain SONG-POSTER-WOL

An intense birthday poster of Vijay Deverakonda’s VD12, directed by Gowtam Tinnanuri, unveiled; wows fans and netizens

 

విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ‘VD12′ నుంచి ప్రత్యేక పోస్టర్
* ‘VD12′ కొత్త పోస్టర్ లో ఉట్టిపడుతున్న క్రియేటివిటీ
యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 3న సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
నేడు(మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ చాలా క్రియేటివ్ గా ఉంది. పియానోని తలపిస్తూ పేర్చిన కాగితపు ముక్కలపై కథానాయకుడి రూపం కనిపించడం ఆకట్టుకుంటోంది. కథానాయకుడి కళ్ళలో ఇంటెన్స్ కనిపిస్తోంది. అలాగే పోస్టర్ పై “I don’t know where I belong, to tell you whom I betrayed – Anonymous Spy” అని రాసుంది. పోస్టర్ ను రూపొందించిన తీరు చూస్తుంటే సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతోంది.
గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘జెర్సీ’ చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. ‘జెర్సీ’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రతిభకు, అతి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విజయ దేవరకొండ తోడయ్యారు. అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.
ఈ చిత్రంలో విజయ్ సరసన నాయికగా శ్రీలీల నటిస్తున్నారు. తన అందం, అభినయం, నాట్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యువ తార మొదటిసారి విజయ్ తో జోడీ కడుతుండటం విశేషం. ఇక ‘జెర్సీ’లో తన సంగీతంతో కట్టిపడేసిన అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ‘జెర్సీ’తో జాతీయ అవార్డును అందుకున్న నవీన్ నూలి ఎడిటర్ గా పని చేయనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా గిరీష్ గంగాధరన్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎందరో ప్రతిభావంతులు కలిసి పని చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.
తారాగణం: విజయ దేవరకొండ, శ్రీలీల
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
డీఓపీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
An intense birthday poster of Vijay Deverakonda’s VD12, directed by Gowtam Tinnanuri, unveiled; wows fans and netizens
Vijay Deverakonda and director Gowtam Tinnanuri are teaming up for a period drama, directed by Gowtam Tinnanuri, where Sreeleela plays the female lead. Tentatively titled VD12, the film is jointly produced by S Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas. The drama is presented by Srikara Studios. One of the country’s top composers, Anirudh Ravichander scores the music. VD12 was formally launched last week.
Commemorating Vijay Deverakonda’s birthday today, VD12 makers have come up with a special surprise for fans even before the film went on floors. A new sepia-tinted retro poster of the untitled film was launched today. In the special birthday poster, various pieces of paper when brought together unveil a partial glimpse of the actor’s look. His look is introduced through a black-and-white portrait where his intense expressions grab eyeballs.
The quote of an anonymous spy – ‘I don’t know where I belong, to tell you whom I betrayed’ adds to the intrigue. “Happiest birthday to you Vijay. You deserve all the success and love in the world. Wishing Kushi to be a blockbuster and we continue the run,” the director wrote while sharing the poster.
With the intensity of Vijay Deverakonda and the storytelling abilities of Gowtam Tinnanuri, the director of Jersey and Malli Raava, one can expect a cracker of an outing on the big screen. One also can’t wait to watch Vijay Deverakonda and Sreeleela’s on-screen pairing.
Girish Gangadharan is the cinematographer while Navin Nooli(National Award winner for Jersey) is the editor. Avinash Kolla is the art director. The shoot of VD12 commences this June. Other details surrounding the film, cast will be announced shortly.

InstaPost-#VD12-HBD copy TW-InstaStory-#VD12-HBD

 

#VD12Begins

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్ టైన్మెంట్స్
నిర్మిస్తున్న కొత్త చిత్రం ఘనంగా ప్రారంభం
* ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన ‘VD12′ చిత్రం
* కథానాయికగా శ్రీలీల, సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌
యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “I don’t know where I belong, to tell you whom I betrayed – Anonymous Spy” అంటూ జనవరిలో ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం ప్రకటన పోస్టర్ తోనే అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
పలువురు ప్రముఖుల సమక్షంలో బుధవారం (3-5-2023)ఉదయం 11:16 కి హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ‘VD12′ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) తన చేతుల మీదుగా స్క్రిప్ట్ ని చిత్ర బృందానికి అందజేశారు. ముహూర్తపు షాట్ కి ప్రగతి ప్రింటర్స్ ఎండీ శ్రీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేయగా, హానరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా శ్రీ చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు.
గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘జెర్సీ’ చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. ‘జెర్సీ’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రతిభకు, అతి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విజయ దేవరకొండ తోడయ్యారు. అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.
ఈ చిత్రంలో విజయ్ సరసన నాయికగా శ్రీలీల నటిస్తున్నారు. తన అందం, అభినయం, నాట్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యువ తార మొదటిసారి విజయ్ తో జోడీ కడుతున్నారు. ఇక ‘జెర్సీ’లో తన సంగీతంతో కట్టిపడేసిన అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ‘జెర్సీ’తో జాతీయ అవార్డును అందుకున్న నవీన్ నూలి ఎడిటర్ గా పని చేయనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా గిరీష్ గంగాధరన్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎందరో ప్రతిభావంతులు కలిసి పని చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.
తారాగణం: విజయ దేవరకొండ, శ్రీలీల
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
డీఓపీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
పీఆర్ఓ: లక్ష్మి వేణుగోపాల్,
జి ఎస్ కె మీడియా
#VD12Begins – Vijay Deverakonda & director Gowtam Tinnanuri’s period drama, directed by Gowtam Tinnanuri, Co-starring Sreeleela., produced by Sithara Entertainments, Fortune Four Cinemas, Presented by Srikara Studios formally launched with a Pooja Ceremony Today.
Director Gowtam Tinnanuri, who rose to prominence with the romance drama Malli Raava and the award-winning sports drama Jersey, is back in action with VD12 [Untitled Film], a period tale, featuring the Rowdy boy The Vijay Deverakonda. One of the most happening heroines in Telugu cinema, Sreeleela is the female lead.

Music is composed by one of the top most Music Director’s of India, Anirudh Ravichander.
Naga Vamsi S and Sai Soujanya are bankrolling the prestigious project under Sithara Entertainments & Fortune Four Cinemas respectively. The first poster of the untitled film featuring Vijay as a cop created ripples recently.
VD12 was formally launched at 11.16am with a pooja ceremony amidst the cast, crew and several film dignitaries today.  While producer S Radha Krishna (Chinababu) of Haarika and Hassine Creations handed over the script to the team, Paruchuri Mahendra, MD of Pragati Printers switched on the camera.
Chukkapalli Suresh, Honorary Counsel General of South Korea, sounded the clapboard at the event. The shoot of the cop drama will commence this June.
Girish Gangadharan (National Award Winner for Jallikattu), cranks the camera for the film while Navin Nooli(National Award winner for JERSEY) handles the editing. Avinash Kolla is the art director. More exciting updates about the project, cast, crew will be announced shortly.
#VD12-PoojaCeremony-1 #VD12-PoojaCeremony-3 #VD12-PoojaCeremony-5 #VD12-PoojaCeremony-4 #VD12-PoojaCeremony-6 #VD12-PoojaCeremony-2

Pawan Kalyan joins the shoot of his action drama with director Sujeeth in Mumbai

‘ఓజీ’… సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్
* ముంబైలో ప్రారంభమైన ‘ఓజీ’ చిత్రీకరణ
* ఏప్రిల్ 15 నుంచి నెలాఖరు వరకు మొదటి షెడ్యూల్
* యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ప్రతిభగల యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ‘ఓజీ’(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్)గా ప్రాచుర్యం పొందింది. జనవరి 30న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రకటన వచ్చినప్పటి నుంచే పవన్ కళ్యాణ్ అభిమానులలో, సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు పాల్గొంటారా అని అభిమానూలు, ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆరోజు రానే వచ్చింది. ‘ఓజీ’ సెట్స్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు.
ఏప్రిల్ 15 నుంచి ‘ఓజీ’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం ఉదయం మేకర్స్ ఒక ఫోటోను వదిలారు. అందులో బ్లాక్ హూడీ ధరించి, కళ్లద్దాలతో పవన్ కళ్యాణ్ చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మొదలైన ఈ షెడ్యూల్ లో ముంబై మరియు పరిసర ప్రాంతాల్లో నెలాఖరు వరకు చిత్రీకరణ జరగనుంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ గా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘భీమ్లా నాయక్’కి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బలానికి, స్టార్డమ్ కి సరిగ్గా సరిపోయే కథతో యాక్షన్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం మరియు అద్భుతమైన ఇతర సాంకేతిక వర్గం ప్రతిభ తోడై అటు యాక్షన్ ప్రియులను, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులను అలరిస్తుందని నిర్మాత డీవీవీ దానయ్య ఎంతో నమ్మకంగా ఉన్నారు.
సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్
సంగీతం: ఎస్ థమన్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: డీవీవీ దానయ్య
రచన, దర్శకత్వం: సుజీత్
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
Pawan Kalyan joins the shoot of his action drama with director Sujeeth in Mumbai
Leading Telugu film star Pawan Kalyan is uniting with Sujeeth, one of the most exciting young directors in the industry for a massive action drama. The film, written and directed by Sujeeth, is bankrolled by top producer DVV Danayya under DVV Entertainment, the banner that backed the globally popular, Oscar-winning film RRR in 2022. The film, which was launched recently, went on floors the previous weekend on April 15 in Mumbai.
Pawan Kalyan has joined the shoot of the untitled film in Mumbai today. “THE #OG HAS ARRIVED on sets…#PawanKalyan #TheyCallHimOG #FireStormIsComing,” the production house confirmed the news, sharing a still. The first schedule of the much-awaited film will progress till the end of the month. Several action sequences and key scenes featuring the lead actors will be canned in the schedule that’ll unfold in Mumbai and nearby locations.
Director Sujeeth, among the more popular storytellers in Telugu cinema, is well known for his entertainers and actioners like Run Raja Run and Saaho and he promises an equally powerful and impactful drama with Pawan Kalyan as well. The film, to be mounted on a lavish scale, will have noted cinematographer Ravi K Chandran cranking the camera and AS Prakash handling production design. S Thaman, who scored the music for Bheemla Nayak, is the composer.
With a story that’ll tap Pawan Kalyan’s charisma perfectly and Sujeeth’s potential to execute action dramas, Thaman’s adrenaline-pumping music score and a superb crew, the makers promise a film that’ll be a feast for action junkies and the star’s fans. Other details about the the film will be shared shortly.
MMM_1425_1 (1) WhatsApp Image 2023-04-18 at 13.17.1505 WhatsApp Image 2023-04-18 at 13.17.1403 WhatsApp Image 2023-04-18 at 13.17.1504 WhatsApp Image 2023-04-18 at 13.17.14

Vishwak Sen’s mass entertainer, VS11, directed by Krishna Chaitanya to be produced by Sithara Entertainments and Fortune Four Cinemas

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం
* విశ్వక్ సేన్ పుట్టినరోజు కానుకగా కొత్త చిత్రం ప్రకటన
* సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా విశ్వక్ సేన్ 11వ చిత్రం
* ‘బ్యాడ్’ గా మారిన ‘మాస్ కా దాస్’
యువ సంచలనం, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా ఒక చిత్రం రూపొందనుంది. Prasiddha చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రతిభ గల దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.
కథానాయకుడిగా విశ్వక్ సేన్ కి ఇది 11వ చిత్రం. నేడు(మార్చి 29) విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటల 16 నిమిషాలకు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో రాత్రిపూట నిర్మానుష్య ప్రాంతం నుంచి సరుకుతో ఉన్న మూడు లారీలు బయల్దేరి పోర్టుకి వెళ్తుంటాయి. రాజమండ్రిలోని గోదావరి వంతెనను కూడా వీడియోలో చూపించారు. అలాగే ఒక పడవపై ఉన్న రేడియోను గమనించవచ్చు. “సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో.. బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది” అంటూ వీడియోను చాలా ఆస్తికరంగా రూపొందించారు. దీనిని బట్టి చూస్తే ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందనున్న పీరియాడిక్ ఫిల్మ్ అనిపిస్తోంది. ఇక “మాస్ కా దాస్ ‘బ్యాడ్’ గా మారాడు” అంటూ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఎంతో ఇంటెన్స్ తో రూపొందించిన ఈ వీడియోలో యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’తో అలరించిన విశ్వక్ సేన్.. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మరో ఘన విజయాన్ని అందుకోవడం ఖాయమని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ జనరేషన్ మోస్ట్ ప్రామిసింగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. ముఖ్యంగా యువతలో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ సితార బ్యానర్ లో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు. విశ్వక్ సేన్, సితార బ్యానర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రకటనతోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
తారాగణం: విశ్వక్ సేన్
దర్శకుడు: కృష్ణ చైతన్య
సంగీతం: యువన్ శంకర్ రాజా
సహ నిర్మాతలు: వెంకట్, గోపి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
 
Vishwak Sen’s mass entertainer, VS11, directed by Krishna Chaitanya to be produced by Sithara Entertainments and Fortune Four Cinemas
Actor-director Vishwak Sen, nicknamed Mass Ka Das, who’s on a high after the success of Das Ka Dhamki, has signed another prestigious project VS11. Written and directed by Krishna Chaitanya, VS11, produced by leading banners S Naga Vamsi and Sai Sounjanya under Sithara Entertainments and Fortune Four Cinemas and presented by Srikara Studios, was formally announced today.
Much to delight of movie buffs, the film’s motion poster was also unveiled today. The glimpse follows a series of lorries and the backdrop later shifts to a riverside backdrop with a radio placed inside a boat. ‘In a world that defies social norms, there is no black and white, only grey. Mass Ka Das turns Bad,’ the makers say, while wishing Vishwak Sen on his birthday.
The shoot of VS11 a.k.a Production No. 21 is set to commence soon. This is touted to be an out-and-out mass entertainer and will be a feast for Mass Ka Das fans, the unit is confident. Composer Yuvan Shankar Raja is on board for the entertainer and his stylish background score for the motion poster has heightened the expectations surrounding the film.
Venkat Upputuri and Gopi Chand Innamuri are the co-producers. Sithara Entertainments and Fortune Four Cinemas are on a roll in the recent past, producing hits like DJ Tillu and Sir, while also backing films featuring the biggest names in the industry. Vishwak Sen has been one of the rare actors who’ve risen to great heights among the masses within a short span and he promises to delight audiences in his massiest avatar yet.
Other details surrounding the cast, crew will be announced shortly.
3