Nidhhi Agerwal Opens Up About Her Role in Hari Hara Veera Mallu Ahead of the Grand Release

‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటించడం నా అదృష్టం: కథానాయిక నిధి అగర్వాల్

‘హరి హర వీరమల్లు’ చిత్రం అద్భుతంగా ఉంటుంది: కథానాయిక నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన కథానాయిక నిధి అగర్వాల్.. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
హరి హర వీరమల్లు అనేది ఒక భారీ చిత్రం. ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి. అలాగే నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. పంచమి పాత్రకు తగ్గట్టుగా స్టైలిస్ట్ ఐశ్వర్య దుస్తులను, ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు.

పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?
పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో స్టార్డం ఉంది, ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ అవుతుంది. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు. ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది.

ఇద్దరు దర్శకులు క్రిష్ గారు, జ్యోతి కృష్ణ గారితో పని చేయడం ఎలా అనిపించింది?
క్రిష్ గారు నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు. అలాగే జ్యోతి కృష్ణ గారు సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ఇద్దరూ నాకు స్పెషల్. జ్యోతి కృష్ణ గారు సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకొని.. ఈ తరానికి తగ్గట్టుగా పని చేస్తారు.

ఎ.ఎం. రత్నం గారి గురించి?
ఎ.ఎం. రత్నం గారు గొప్ప నిర్మాత. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. సినిమాని నమ్మి ఇన్నేళ్లు బలంగా నిలబడ్డారు. చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రత్నం గారిలా అందరూ ఉండలేరు. ఐదేళ్ల పాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు. రత్నం గారికి హ్యాట్సాఫ్.

ట్రైలర్ కి వచ్చిన స్పందన ఎలా అనిపించింది?
ట్రైలర్ రాకముందు కొందరు ఈ సినిమా ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేసింది. మేము ఊహించిన దానికంటే ట్రైలర్ కి ఇంకా అద్భుతమైన స్పందన లభించింది.

హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారితో, రాజాసాబ్ లో ప్రభాస్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?
ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత హంబుల్ గా ఉంటారేమో అని వారిద్దరినీ చూస్తే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటుడు. పాత్రలో సులభంగా ఒదిగిపోతారు. ప్రభాస్ గారు చాలా మంచి మనిషి. అందరూ చెప్పినట్టుగానే ఆయన నిజంగానే డార్లింగ్.

పంచమి పాత్ర గురించి చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
క్రిష్ గారు కలిసి నా పాత్ర గురించి, కథ గురించి వివరించారు. ఆయన చెప్తున్నప్పుడే ఈ సినిమా చేయాలనుకున్నాను. ఎందుకంటే భారీ సినిమా, పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం, రత్నం గారు లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను. అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడమే కాకుండా.. మంచి పాత్ర కూడా దక్కింది.

హరి హర వీరమల్లులో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సన్నివేశం?
భరతనాట్యం నేపథ్యంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయం ఛాలెంజింగ్ గా అనిపించింది.

కీరవాణి గారి సంగీతం గురించి?
పీరియడ్ సినిమాలకు కీరవాణి గారు పెట్టింది పేరు. పైగా ఆస్కార్ విజేత. వీరమల్లుకి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో తార తార, కొల్లగొట్టినాదిరో గీతాలు నాకు బాగా నచ్చాయి.

హరి హర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది?
మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు. పవన్ కళ్యాణ్ గారు రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్ లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారితో సహా టీం అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. అందరం కలిసి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందిస్తారని నమ్మకం ఉంది.

Nidhhi Agerwal Opens Up About Her Role in Hari Hara Veera Mallu Ahead of the Grand Release

As the anticipation for Hari Hara Veera Mallu reaches a fever pitch, actress Nidhhi Agerwal shared her experiences and excitement in an exclusive interaction with print and web media. With the epic period action drama set to hit theatres on July 24th, the actress opened up about her powerful role, the film’s scale, and working alongside Power Star Pawan Kalyan.

“I absolutely loved this character. Getting a role like this in a big film is always a blessing. It comes with so many shades. If you look at ‘Kollagottinadhiro’ and ‘Tara Tara’, they’re completely contrasting from each other — and that’s the beauty of it,” Nidhhi shared.
Donning the character of Panchami, Nidhhi revealed the immense effort that went into her transformation.

“The costume and jewellery credits go to the stylists — they worked so hard. It used to take me nearly two hours every day to get into the Panchami look. Every detail, no matter how small, was taken care of with great care and precision.”
When asked about working with Pawan Kalyan, she was visibly emotional.

“I feel privileged to work with Pawan Kalyan Garu. His stardom is truly unmatched. Doing a hundred films is equal to doing just one with him.”
She also highlighted the soul of the film.

“‘Sword vs Spirit’ is the perfect tagline for Part 1. It clearly defines what the film is all about — a war of ideals, faith, and identity.”
Apart from intense performances, Nidhhi also trained hard for the action.

“I’ve been part of a few fight sequences and also learned horse riding and Bharatanatyam specifically for this film. It pushed me as a performer in every way.”
Recollecting her very first day on set, Nidhhi said:

“The song ‘Kollagottinadhiro’ was shot on a real set and it was my first day. From the moment I stepped in, I could feel the scale and seriousness of this film.”
She emphasized how confident and committed the entire crew was.

“I have the most combination scenes with Pawan Kalyan Garu and several others. Every artist and technician gave their best — you’ll see it on screen.”
Speaking about the film’s fictional roots within a real historical timeline, she said:

“Veera Mallu is a fictional character placed in a real era — just like how we could create a story during COVID with imaginary characters. It’s the Indian version of Indiana Jones with royal intensity.”
And of course, the music:

“The periodic genre is Keeravani Garu’s forte. He’s an Oscar winner for a reason. The background score in this film is going to elevate every scene. ‘Tara Tara’ and ‘Kollagottinadhiro’ are my songs, and they’re both very close to my heart.”
Directed by Jyothi Krishna, with music composed by M.M. Keeravani, Hari Hara Veera Mallu is presented by A.M. Rathnam and produced by A. Dayakar Rao under Mega Surya Productions.

The countdown to July 24th has truly begun — and with Nidhhi Agerwal promising both grace and grit, expectations are sky-high for Hari Hara Veera Mallu to be a cinematic spectacle.

GANI6727 GANI6675 GANI6798 GANI6740 GANI6693 (1) GANI6693

Anna Antene from #Kingdom – An Emotional Anthem That Strikes Straight at the Heart

కింగ్‌డమ్’ చిత్రం నుంచి హృదయాన్ని తాకే భావోద్వేగ గీతం ‘అన్న అంటేనే’ విడుదల

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘హృదయం లోపల’ గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతం ‘అన్న అంటేనే’ విడుదలైంది.

‘కింగ్‌డమ్’ నుంచి ‘అన్న అంటేనే’ గీతాన్ని బుధవారం(జూలై 16) సాయంత్రం విడుదల చేశారు నిర్మాతలు. ఉత్సాహవంతమైన గీతాలతో అందరినీ ఉర్రుతలూగిస్తున్న అనిరుధ్ రవిచందర్.. ‘కింగ్‌డమ్’ కోసం ఈ భావోద్వేగ గీతాన్ని స్వరపరిచారు. ఈ అద్భుతమైన గీతం హృదయాలను హత్తుకునేలా ఉంది.

సోదరభావానికి ఒక వేడుకలా ‘అన్న అంటేనే’ గీతముంది. వినోదాన్ని అందించే పాటలు ఎన్నో ఉంటాయి. కానీ, బంధాలను గుర్తుచేసే పాటలు, మనసుని తాకే పాటలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన గీతమే ‘అన్న అంటేనే’.

సోదరులుగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కొత్తగా కనిపిస్తున్నారు. నిజ జీవితంలో అన్నదమ్ముల్లాగా తెరపై కనిపిస్తున్నారు. ఇద్దరూ తమదైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటలోని భావోద్వేగ లోతుని చక్కగా పండించారు. ఈ గీతం తోబుట్టువుల ప్రేమకు పరిపూర్ణమైన నివాళిలా ఉంది.

‘అన్న అంటేనే’ గీతాన్ని అనిరుధ్ స్వరపరచడంతో పాటు ఆలపించడం విశేషం. తనదైన సంగీతంతో, గాత్రంతో అనిరుధ్ మరోసారి కట్టిపడేశారు. వరుస బ్లాక్‌బస్టర్‌ గీతాలను అందిస్తూ, పాట పాటకు తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న అనిరుధ్.. ఇప్పుడు ఈ భావోద్వేగ గీతంతో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం అందరినీ కదిలించేలా ఉంది.

ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథను ఎంచుకొని, ఆ కథను అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అంచనాలను పెంచుతూనే ఉంది. తాజాగా విడుదలైన ‘అన్న అంటేనే’ గీతం దర్శకుడి బలమైన భావోద్వేగ దృష్టిని ప్రతిబింబిస్తుంది.

‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రతిభగల సాంకేతిక బృందం పని చేస్తోంది. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మునుపెన్నడూ చూడని గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్


 Anna Antene from #Kingdom – An Emotional Anthem That Strikes Straight at the Heart
The makers of Kingdom have released their second single #AnnaAntene and it’s safe to say this one’s a soul stirrer. After setting the charts on fire with high energy anthems Anirudh Ravichander is back with a deeply emotional track that instantly tugs at your heartstrings.

It’s a celebration of brotherhood. There are many songs that entertain but very few that make you pause, reflect and feel the strength of your own bonds. #AnnaAntene does just that.

The visuals between Vijay Deverakonda and Satyadev looks refreshing. Their chemistry and screen presence together deliver a genuine emotional punch that enhances the song’s enhancement. It’s a perfect tribute to sibling love one that’s relatable and real.

The song is sung and composed by Anirudh who once again proves why he’s in a league of his own. With back to back unanimous musical blockbusters, he continues to raise the bar and this track adds a whole new dimension to his emotional spectrum. Lyrics by Krishna Kanth he literally moved us with words that hit hard.

Written & Directed by Gowtam Tinnanuri. Kingdom continues to build anticipation with every new asset and this song reflects the director’s strong emotional vision blending warmth with cinematic scale.

Cinematography by Jomon T. John ISC and Girish Gangadharan ISC and edited by Navin Nooli.

Produced by Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios, Kingdom is gearing up for a grand release and with a song like #AnnaAntene emotional quotient is set. All set to strike the box office on July 31st.

Anna Antene Still Anna Antene_twt 62aa-2 Anna Antene_Promo Trending STILL-2

How Iconic personalities like NTR and MGR inspired to design Pawan Kalyan’s role in Hari Hara Veera Mallu

నట దిగ్గజాలు ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో ‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించిన దర్శకుడు జ్యోతి కృష్ణ

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుండి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్‌ కళ్యాణ్ లో ఉన్న అద్భుతమైన లక్షణాలను గమనించిన తర్వాతే ఆయన పాత్రను రాయడానికి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.

ధర్మపరుడిగా, బలవంతుడిగా మరియు ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ‘హరి హర వీరమల్లు’లో ఆయన పాత్రను చాలా జాగ్రత్తగా రూపొందించినట్లు దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు. “ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంజీఆర్ గారు సందేశాత్మక మరియు నిజాయితీతో కూడిన సినిమాలు చేస్తూ నట జీవితాన్ని కొనసాగించారు. ఈ అంశం నాకు స్ఫూర్తినిచ్చింది. అందుకే ‘హరి హర వీరమల్లు’లో ‘మాట వినాలి’ అనే శక్తివంతమైన మరియు ఆలోచింపజేసే పాటను స్వరపరిచాము. ఈ పాట యొక్క సారాంశం పవన్ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ జీవితంలో సానుకూలత మరియు ధర్మాన్ని స్వీకరించడాన్ని తెలియజేస్తుంది. ఈ పాట ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసింది.” అని జ్యోతి కృష్ణ అన్నారు.

అదేవిధంగా, నటుడిగా ఎన్టీఆర్ యొక్క గొప్ప ప్రదర్శనలు పౌరాణిక మరియు జానపద చిత్రాల నుండి వచ్చాయి. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు పాత్రలలో ఆయన ఒదిగిపోయిన తీరు చిరస్థాయిగా నిలిచిపోయింది. “ఎన్టీఆర్ గారు తన శక్తిని మరియు ధర్మాన్ని నిలబెట్టే సామర్థ్యాన్ని సూచించే విల్లు, బాణం పట్టుకున్న శ్రీరాముడిగా అద్భుతంగా చిత్రీకరించబడ్డారు. ఈ అంశం నుండి ప్రేరణ పొంది, ‘హరి హర వీరమల్లు’లో పవన్ గారి కోసం విల్లు, బాణాన్ని రూపొందించాము. పవన్ కళ్యాణ్ యొక్క శక్తిని సూచించడానికి, న్యాయం కోసం పోరాడటానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతీకగా ఈ ఆయుధాలు రూపొందించబడ్డాయి.” అని జ్యోతి కృష్ణ వివరించారు. అలాగే తాను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్‌ను కథానాయకుడిగా కాకుండా నాయకుడిగా చూస్తున్నారని గ్రహించానని ఆయన అన్నారు. “కథనాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేకంగా సృష్టించాలనుకున్నాను.” అని జ్యోతి కృష్ణ చెప్పారు.

How Iconic personalities like NTR and MGR inspired to design Pawan Kalyan’s role in Hari Hara Veera Mallu

As Pawan Kalyan’s upcoming film Hari Hara Veera Mallu is gearing up for July 24th release, the hype surrounding the film has reached fever pitch. In an interesting revelation, director Jyothi Krisna states that he has drawn inspiration from legendary actors NTR and MGR to design Pawan Kalyan’s character in Hari Hara Veera Mallu. The filmmaker adds that he was motivated to write Pawan’s role after he observed his trailblazing qualities similar to that of the iconic personalities like NTR and MGR.

According to Jyothi Krisna, Pawan’s onscreen persona in Hari Hara Veera Mallu was carefully crafted to align his image as a virtuous, strong, and ‘people’s man.’ The director shares that even after becoming Chief Minister, MGR continued to act by doing films that are consistently filled with message-oriented themes and honesty. “I was inspired by this aspect and composed a powerful and thought-provoking song ‘Maata Vinali’ in Hari Hara Veera Mallu. The essence of the song conveys to embrace positivity and righteousness in life reflecting Pawan’s ideology and appeal. The song impacted and resonated deeply with the audiences,” says Jyothi Krisna.

Similarly, some of NTR’s most celebrated performances came from mythological and folklore films. His iconic portrayal as Lord Rama and Lord Krishna are a definitive representation of the character. “NTR garu was admirably depicted as Lord Rama with a bow and arrow that represented his power and ability to uphold dharma. I drew inspiration from this element and designed a bow and arrow for Pawan garu in Hari Hara Veera Mallu (which is also a period film). These weapons symbolize Pawan’s power and readiness to fight for justice and uphold dharma,” explains the director, adding that when he was writing the script he realised that people are looking at Pawan Kalyan as a leader and not as a hero. “I wanted to create every scene as a ‘special one’ that’ll elevate the narrative.”

 STILL_HHVM (1)

Hari Hara Veera Mallu Receives U/A Certification Gears Up for Grand Release

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

జూలై 20న వైజాగ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక

దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం జూలై 24, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరో పది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ ను పొందింది.

17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి వంటి అద్భుతమైన తారాగణం నటించింది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు.

ట్రైలర్ విడుదలైన తర్వాత ‘హరి హర వీరమల్లు’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్ ను ఎంతగానో ప్రశంసించారు. ఈ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సెన్సార్ బోర్డు సభ్యుల ప్రశంసలు
‘హరి హర వీరమల్లు’ చిత్రం సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ ను పొందింది. ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలు. ఈ రెండున్నర గంటల వెండితెర అద్భుతం.. సెన్సార్ బోర్డు సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనాన్ని, భారీ విజువల్స్ ను వారు ప్రశంసలతో ముంచెత్తారు.

వైజాగ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక
‘హరి హర వీరమల్లు’పై అంచనాలను మరింత పెంచుతూ.. జూలై 20వ తేదీన వైజాగ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని భావిస్తున్నారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదలవుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా అసలుసిసలైన పాన్-ఇండియన్ సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది. USAలో ఇప్పటికే ఈ చిత్రం యొక్క అడ్వాన్స్ సేల్స్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యాక్షన్, డ్రామా మరియు భావోద్వేగాల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ చారిత్రాత్మక గాథను వెండితెరపై చూడటానికి అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అందుకే తమ టిక్కెట్లను ముందుగానే పొందాలని కోరుకుంటున్నారు. దీంతో ఒక్క USAలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ‘హరి హర వీరమల్లు’ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడి.. ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ దయాకర్ రావు నిర్మించారు. సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే యుద్ధాన్ని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చూడటానికి సిద్ధంగా ఉండండి.

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Hari Hara Veera Mallu Receives U/A Certification Gears Up for Grand Release

The highly anticipated period action epic, *Hari Hara Veera Mallu: Part 1 – Sword vs Spirit*, starring Power Star Pawan Kalyan, has officially been censored with a **U/A certification** With just 10 days to go until its worldwide theatrical release on **July 24, 2025**, the film is generating immense buzz, and the latest reports suggest that the censor board members were thoroughly impressed, showering the movie with praise for its gripping narrative and grand visuals. The runtime is approximately 2 hours and 42 minutes a solid advantage that promises a tightly packed immersive experience.

Directed by Jyothi Krisna and Krish Jagarlamudi *Hari Hara Veera Mallu* is set in the 17th-century Mughal Empire and follows the journey of the legendary outlaw Veera Mallu, portrayed by Pawan Kalyan, as he rises against tyranny to spark a revolution for justice and dharma. The film boasts a stellar ensemble cast, including Bobby Deol as the antagonist, Nidhhi Agerwal, Nargis Fakhri, Nora Fatehi with a powerful score by Oscar-winning composer M.M. Keeravani.

After the trailer release, expectations have skyrocketed, and trade circles anticipate the film to open with one of the biggest numbers.

Adding to the hype, the makers have planned a grand pre-release event on July 20, 2025 in Vizag which is expected to draw massive crowds.

With its multi-language release in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam, *Hari Hara Veera Mallu* is poised to be a pan-Indian cinematic experience. The film’s advance sales in the USA signaling strong international interest. Fans are urged to secure their tickets early to witness this historic saga on the big screen, where it promises to deliver an unforgettable blend of action, drama, and emotion.

Produced by A Dayakar Rao under Mega Surya Production. Presented by AM Rathnam. Get ready to witness the battle for truth, faith, and freedom in cinemas worldwide on July 24, 2025.

HHVM_UA_l HHVM_UA STILL_L

*The Teaser of VISA ~ Vintara Saradaga is Out Now – A Fun, Fresh Take on Student Life Abroad!*

VISA – వింటారా సరదాగా’ టీజర్ విడుదల

విదేశాల్లోని విద్యార్థుల జీవితాలను ప్రతిబింబించేలా వినోదాత్మకంగా, సరికొత్తగా ‘VISA – వింటారా సరదాగా’ టీజర్

ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం ‘VISA – వింటారా సరదాగా’.

‘VISA – వింటారా సరదాగా’ టీజర్ ఆవిష్కరణ శనివారం(జూలై 12) ఉదయం జరిగింది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్ర టీజర్ అద్భుతంగా ఉంది. ఎన్నో కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణాలను చూపిస్తూ టీజర్ ఎంతో అందంగా సాగింది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది. భావోద్వేగాలతో నిండిన ఓ మధుర ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామనే హామీని టీజర్ ఇచ్చింది.

‘VISA – వింటారా సరదాగా’ టీజర్ లో కథానాయకుడికి పాడ్‌కాస్టింగ్ అలవాటు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రకు మరియు ఆధునిక విద్యార్థి అనుభవాలకు అది కొత్తదనాన్ని తీసుకొచ్చింది.

ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇద్దరూ ఆయా పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి టీజర్ కి అందాన్ని తీసుకొచ్చారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంటి నుండి దూరంగా జీవితాన్ని గడుపుతున్న ఒక తరం జీవితాలను ప్రతిబింబించేలా వీరి పాత్రలు ఉన్నాయి.

ఉద్భవ్ రఘు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ‘VISA – వింటారా సరదాగా’, తెలుగు సినిమాకు ఒక కొత్త స్వరాన్ని తీసుకువస్తుంది. ప్రేమ, హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఓ మంచి కథను ఈ తరం మెచ్చేలా తెరపైకి తీసుకొస్తున్నారు ఉద్భవ్.

సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ టీజర్‌ను
మరింత ఉన్నతంగా మలిచింది. హృదయాలను తాకే మధుర సంగీతానికి ఈ చిత్రం వేదిక కానుందని టీజర్ తోనే అర్థమవుతోంది.

అమెరికా నేపథ్యంలో గొప్ప నిర్మాణ విలువలు, సుందరమైన విజువల్స్ తో సాంకేతికంగా ఉన్నతమైన చిత్రాన్ని చూడబోతున్నాం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా వినోదాత్మక చిత్రంగా ‘VISA – వింటారా సరదాగా’ రూపుదిద్దుకుంటోంది.

‘VISA – వింటారా సరదాగా’ త్వరలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రయాణంలో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి.

*The Teaser of VISA ~ Vintara Saradaga is Out Now – A Fun, Fresh Take on Student Life Abroad!*

The teaser of VISA… Vintara Saradaga is now out and it hits all the right notes with its vibrant, relatable and quirky tone. Set in the USA, the film promises to be a rollercoaster of emotions as it explores the journeys of Telugu students who step into a new world chasing dreams only to find friendship, love, chaos and unexpected challenges.

A unique highlight of the teaser is the hero’s hobby for podcasting, which becomes his personal outlet while navigating life abroad adding a refreshing, creative layer to the character and modern student experiences.

Ashok Galla and Sri Gouri Priya headline this youthful entertainer and seem to be perfectly cast their chemistry adds charm and authenticity to the film’s emotional graph. Also featuring Rahul Vijay, Shivathmika Rajasekhar, and the ever-funny Harsha Chemudu, the cast comes together to reflect the lives of a generation navigating life away from home.

Marking the directorial debut of Udbhav Raghu, VISA brings a refreshing voice to Telugu cinema. His storytelling brings together romance, drama, and slice-of-life moments that feel rooted yet contemporary.

The teaser is further elevated by a pulsating background score from music director Vijai Bulganin, offering a sneak peek into the musical heartbeat of the film’s world.

With rich production values, picturesque visuals and a vibrant setting in the USA, the film promises a visually appealing and technically polished cinema experience. Film is produced by S Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, VISA promises to be a fun-filled new-age entertainer that connects with youth and families alike.

Get ready to board this journey ~ VISA is coming soon with full-on vibes!

 

VISA TEASER_PLAIN VISA TEASER_X