Jan 30 2023
Pawan Kalyan’s massive action drama with director Sujeeth, produced by DVV Danayya, kickstarts in Hyderabad
Jan 30 2023
Jan 13 2023
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ చేతులు కలిపాయి.
యువ సంచలనం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనుంది. విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘జెర్సీ’ చిత్రం కోసం జతకట్టారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది.
తెలుగు, హిందీ పరిశ్రమలలో ప్రతిభగల దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి నిరూపించుకున్నారు. 2019లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఎంతో ప్రతిభగల గౌతమ్ ఇప్పుడు మరో ప్రతిభావంతుడు, యువ సంచలనం విజయ్ దేవరకొండతో చేతులు కలిపారు. వీరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ అంచనాలను అధిగమించి, అందరినీ అలరించే చిత్రం అందిస్తామని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఇది భూమి బద్దలై పోయేది, అత్యంత భారీగా ఉంటుందని తాము చెప్పట్లేదు.. కానీ అద్భుతమైన విషయం అని మాత్రం చెప్పగలమని నిర్మాత నాగవంశీ అన్నారు.
అర్జున్ రెడ్డి, గీత గోవిందం, పెళ్లి చూపులు వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకొని విజయ్ దేవరకొండ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంతో ఆయనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తానని దర్శకుడు అంటున్నారు. ఎందరో నటీనటులతో పనిచేస్తూ ఎన్నో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మొదటిసారి విజయ్‌తో జత కట్టడంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారి ని తలపిస్తున్నాడు. పోస్టర్ మీద “I don’t know where I belong, to tell you whom I betrayed – Anonymous Spy” అని రాసుండటం గమనించవచ్చు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు.
ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
Sithara Entertainments, Fortune Four Cinemas join hands for #VD12, starring Vijay Deverakonda, directed by Gowtam Tinnanuri
Leading production house Sithara Entertainments is teaming up with Fortune Four Cinemas, for #VD12, starring young sensation Vijay Deverakonda, a film written and directed by one of Telugu cinema’s finest storytellers Gowtam Tinnanuri. Srikara Studios will present the film jointly bankrolled by Naga Vamsi S and Sai Soujanya. The last time Gowtam teamed up with Sithara Entertainments, they came up with the National-award winning sports drama Jersey, the Nani, Shraddha Srinath starrer that won over critics and performed well at the box office.
The makers announced the project with a poster featuring an anonymous quote that reads ‘I don’t know where I belong, to tell you whom I betrayed’ With a silhouette of a cop covered with a cloth on his face, it hints that #VD12 will be a periodic cop drama. With this project, Vijay Deverakonda is expected to don the khaki on-screen for the first time in his career. The image of a burning ship in the middle of a water body contributes to a viewer’s curiosity.
Prior to the project announcement, the producer S Naga Vamsi wrote, “We are not going to say that this is earth-shattering or MASSive or HUUUGE but this is something spectacular.” Gowtam Tinnanuri, as a filmmaker, needs little introduction, having proved his worth across Telugu and Hindi industries. His Jersey, that released in 2019, won in the Best Feature Film in Telugu and Best Editing categories respectively. When this exciting talent teams up with an equally capable performer like Vijay Deverakonda, there’s bound to be immense curiosity and the makers are confident that the director-actor combo will surpass the expectations of film buffs.
Vijay Deverakonda’s versatility is well known, with pathbreaking performances in films like Arjun Reddy, Geetha Govindam, Pelli Choopulu, and the director promises to unveil a new dimension to the star here as well. Sithara Entertainments has consistently churned out quality films with a bevvy of actors and it’ll be interesting to see how their first collaboration with Vijay turns out. The shoot is expected to commence soon and more details about the cast and crew will be announced shortly.
–
Dec 26 2022
Sep 2 2022
బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపర్తి గ్రామంలో జన్మించారు. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన కాకినాడలోని పి.ఆర్ కళాశాలలో B.A డిగ్రీని పూర్తి చేశారు. ఆయన తన కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కలిపి 167 సినిమాల్లో నటించారు. హరనాథ్ 1989, నవంబర్ 1 న మరణించారు.
హరనాథ్ జీవిత చరిత్రను ‘అందాల నటుడు’ పేరుతో ఆయన వీరాభిమాని, ఆరాధకుడు డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ రచించారు. అరుదైన ఫోటోలు, ఎవరికీ అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలతో ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దారు. డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఇతర సంస్థల నుండి అనేక అవార్డులు అందుకున్నారు.
దివంగత హీరో హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’ని ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటలకు హరనాథ్ కుమార్తె జి.పద్మజ, అల్లుడు జివిజి రాజు(చిత్ర నిర్మాత-’తొలి ప్రేమ’ , ‘గోదావరి’ ) మరియు మనవలు శ్రీనాథ్ రాజు మరియు శ్రీరామ్ రాజు సమక్షంలో నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ఆయన నివాసంలో విడుదల చేశారు.
హరనాథ్ కుమారుడు బి. శ్రీనివాస్ రాజు(చిత్ర నిర్మాత- ‘గోకులంలో సీత’ , ‘రాఘవేంద్ర’), కోడలు మాధురి, మనవరాళ్లు శ్రీలేఖ, శ్రీహరి చెన్నైలో నివాసం ఉంటున్నారు.
పుస్తక విడుదల సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ గారు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను, హరనాథ్ కలిసి పలు సినిమాల్లో నటించామని అన్నారు. అతను నిజమైన అందాల నటుడని, అలాగే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా తాను హీరోగా హరినాథ్ ‘మా ఇంటి దేవత’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారని గుర్తుచేసుకున్నారు.
స్వర్గీయ నటరత్న ఎన్.టి.రామారావు దర్శకత్వం వహించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలోని ‘శ్రీ సీతారాముల కళ్యాణము చూడము రారండి’ పాటలో శ్రీరామునిగా ఆయన రూపం తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
Buddharaju Haranath Raju erstwhile Telugu hero of the Black & White era and the heart throb and darling boy of many women folk of his time, was born on 2nd September, 1936 in Raparthi, Pithapuram, E. Godavari Dist. Andhra Pradesh.
Did his schooling in Chennai, and completed his B. A. Degree in P. R. College, Kakinada.
In his career span, acted in 167 movies across five languages notably Telugu, Tamil, Kannada and one each in Hindi and Bengali.
He passed away in the year 1989 on the 1st November.
An ardent fan and admirer Dr. Kampally Ravichandran has penned his biography, titled ‘Andaala Natudu’ compiling some rare photographs and lesser known interesting facts.
Dr. Kampally Ravichandran is the recipient of many Nandi awards and other official decorations from Andhra Pradesh State and other organisations.
‘Andaala Natudu’ biography of Hero Late Harinath was released on the occasion of his birthday September 2nd, at 10 am by his contemporary Natasekhar Superstar Krishna at his residence in the presence of
Harnath’s daughter G. Padmaja, son in law GVG Raju (Film Producer-’ Tholi Prema’ , ‘Godavari’ ) and grandsons Srinath Raju and Sriram Raju.
His son B. Srinivas Raju, (Film Producer- ‘Gokulamlo Seetha’ , ‘Raghavendra’) daughter in law Madhuri,
grandchildren Srilekha and Srihari reside in Chennai.
Releasing the book Superstar Krishna garu recollected fond and cheerful memories and mentioned that they had acted together in several movies and that he was a real (Andhaala Natudu) handsome hero and also a kind hearted human being.
Krishna garu also told that Harinath also produced a movie ‘Maa Inti Devatha’ with Krishna as hero.
His portrayal as Lord Rama in the song ‘Sri Sitaramula kalyanamu chudamu rarandi’ from the film ‘Sitarama Kalyanam’ Directed by Late Nataratna N. T. Rama Rao shall remain etched forever in the memories of Telugu audience.
Aug 9 2022
Haarika and Hassine Creations, Sithara Entertainments complete a successful decade in cinema, release a video thanking everyone for their support
On completing a decade in films, the production house shared a special video offering a glimpse into many of their memorable films ranging from Julayi to A..Aa to S/O Satyamurthy, Jersey, DJ Tillu, Ala Vaikunthapurramulo, Aravinda Sametha and Bheemla Nayak. From national awards to box office reception and glowing critical reception, the banners have seen it all, backing some of the biggest Telugu films this decade featuring top stars and also encouraging new talent into the industry.
The production houses thanked viewers and well-wishers for continuous support in their endeavours and also revealed the lineup of their upcoming films. In the video, they shared, “A dream of many years came true with Julayi. The love you gave made us confident to make all these beautiful films. You have given us the chance to touch different genres and deliver many emotions on screen. In these 10 years, a journey of 16 films, your love and support gave our passion the wings to conquer more challenging avenues. Thank you for your love all these years. Keep supporting our passion. We hope to continue entertaining you with our exciting lineup of films.”
Their future films look extremely compelling – Swathimuthyam (starring Ganesh, Varsha Bollamma), #PVT04 (Panja Vaisshnav Tej), #SSMB28 (Mahesh Babu, Trivikram, Pooja Hegde), Tillu 2 (Siddhu Jonnalagadda), Anaganaga Oka Raju (Naveen Polishetty), Sir/Vaathi (Dhanush, Samyuktha Menon) and an untitled film (the remake of Kappela starring Surya, Arjun Das and Anikha Surendran). Staying true to their commitment to ensuring entertainment with a purpose, Haarika and Hassine Creations and Sithara Entertainments enter their second decade in cinema with greater hope and optimism.
Follow Us!