Bobby Kolli, Sithara Entertainments’ release special birthday glimpse from of Nandamuri Balakrishna from NBK109

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘NBK109′ నుండి ప్రత్యేక గ్లింప్స్ విడుదల

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ‘న్యాచురల్ బోర్న్ కింగ్’ గా, ‘గాడ్ ఆఫ్ మాసెస్’ గా తెలుగునాట తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్ ని మెప్పించే సినిమాలను అందించడంలో ఆయన దిట్ట. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం ‘NBK109′తో మాస్ ని అలరించడానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లితో చేతులు కలిపారు.

తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు నిర్మాతలు. “జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8న ‘NBK109′ నుండి ఇప్పటికే చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ మరింత ఆకర్షణగా ఉంది.

రచయిత, దర్శకుడు బాబీ తన సినిమాల్లో హీరోలను కొత్తగా, పవర్ ఫుల్ గా చూపిస్తుంటారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు మెచ్చేలా ఆయన హీరోల పాత్రలను మలిచే తీరు మెప్పిస్తుంది. ‘NBK109′లో బాలకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని గ్లింప్స్ ని బట్టి అర్థమవుతోంది. చూడటానికి స్టైలిష్ గా ఉంటూ, అసలుసిసలైన వయలెన్స్ చూపించే పాత్రలో బాలకృష్ణను చూడబోతున్నాం. అభిమానులు, మాస్ ప్రేక్షుకులు బాలకృష్ణను ఎలాగైతే చూడాలి అనుకుంటారో.. అలా ఈ గ్లింప్స్ లో కనిపిస్తున్నారు.

సంచలన స్వరకర్త ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్లింప్స్ లో వారి పనితనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ కార్తీక్ విజువల్స్ కట్టి పడేస్తున్నాయి. ఎస్.థమన్ నేపథ్య సంగీతం గ్లింప్స్ ని మరోస్థాయిలో నిలబెట్టింది.

నిరంజన్ ఎడిటింగ్ బాధ్యత నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

Bobby Kolli, Sithara Entertainments’ release special birthday glimpse from of Nandamuri Balakrishna from NBK109

Nandamuri Balakrishna commands Telugu Cinema as “Natural Born King” – NBK, the “God of Masses” and his recent form has been the big talk of the town. He is delivering some memorable characters and huge theatrical blockbusters. Now, he is gearing up to entertain masses with NBK109 in the direction of super successful writer-director Bobby Kolli.

Sithara Entertainments, one of the busiest and most successful production houses of Telugu Cinema, is producing the film on a lavish canvas. The makers have unveiled a special birthday glimpse to introduce the character of Nandamuri Balakrishna, “A Monster that even Evil would fear”.

Already, they released an important glimpse giving us a sneak peek into the world of NBK109 and now, they have introduced the character with a hint about his dangerous mission.

https://youtu.be/Ib7bmm-PiaU

Bobby Kolli has carved a niche for himself in making thundering action blockbuster movies with big stars. Going by the two glimpses released by the makers, he seems to be presenting NBK at his stylish and violent best, in NBK109.

Adding to his stunning visual choreography, S Thaman’s adept background score makes it an experience for viewers. Also, cinematographer Vijay Kartik Kannan presented NBK in mass frames of Bobby Kolli, aptly adhering to the fans’ anticipation.

Niranjan Devaramane’s cuts and Avinash Kolla’s production design also stands out in this monstrous glimpse. Famous Bollywood actor Bobby Deol is playing the antagonist role in the film.

Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, are producing the film and Srikara Studios is presenting it. More details will be announced soon.

NBK109Still-1 NBK109Still-2 NBK109Still-3

Hari Hara Veera Mallu to be completed on fast-track

శరవేగంగా పూర్తి కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 
“హరి హర వీర మల్లు”పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారిగా హిస్టారికల్ ఎపిక్ వారియర్ మూవీ అయిన “హరి హర వీర మల్లు”లో ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ, ‘హరి హర వీర మల్లు’ చిత్రం యొక్క మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట సహా మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేమికులు సైతం చాలా ఆసక్తికరంగా ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లలో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా యూనిట్ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది.

భారతదేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈ సినిమాకి సంబంధించిన సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే నిర్మాత ఏం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్‌లతో మనోజ్ పరమహంస చర్చిస్తున్న ఒక ఫోటోని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. అంతేకాదు సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరితగతిన పూర్తిచేసేందుకు కొత్త లొకేషన్ల కోసం రెక్కీ కూడా పూర్తి చేస్తోంది. సమాంతరంగా మరొకపక్క ఇప్పటివరకు షూట్ చేసిన సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఈ ఏడాది చివరి నాటికి హరి హర వీర మల్లు పార్ట్-1 ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌’ని విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. హరిహర వీరమల్లు టీజర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ విజువల్ వండర్ ని వెండితెరపై చూస్తామా అని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు అందాల నటి నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు & సాంకేతిక నిపుణుల వివరాలు:
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతన్, సోజో స్టూడియోస్, యూనిఫి మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకులు: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజరోవ్ జుజీ, రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్

Hari Hara Veera Mallu to be completed on fast-track

Power Star Pawan Kalyan will be seen playing a warrior role in a historical Epic warrior movie, Hari Hara Veera Mallu, for the first time in his career. His fans are overjoyed ever since the announcement and are eagerly waiting for the film to release in theatres.

The Hari Hara Veera Mallu team has surprised everyone with an exhilarating, intense teaser and the fans have gone crazy for the visuals and presentation of their matinee idol on screen. Young director Jyothi Krisna has been key in bringing out the teaser to make a fresh announcement about the film.

Highly sought after cinematographer Manoj Paramahamsa has been roped in for the remainder of the film and the skilled technician immediately started planning the shoot. The team released a photo of him involved in a deep conversation with production designer Thotha Tharani and VFX supervisor Srinivas Mohan alongside producer AM Rathnam and director Jyothi Krisna.

The team is now completing recce for new locations to shoot remainder of the film at a quick pace. Along with that, they are completing VFX and post production works of the film shot till date. The team is determined and on track to release Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit, by the end of this year.

HHVM-Prep Image

It’s a great feeling to hear from fans that I am being compared with Jr NTR in Gangs of Godavari: Vishwak Sen.

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తోంది – కథానాయకుడు విశ్వక్ సేన్, దర్శకుడు కృష్ణ చైతన్య

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన స్పందన వస్తోంది. కథా నేపథ్యం కొత్తగా ఉందని, ఎమోషనల్ సన్నివేశాలు కట్టిపడేశాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన కథానాయకుడు విశ్వక్ సేన్, దర్శకుడు కృష్ణ చైతన్య తమ సంతోషాన్ని పంచుకున్నారు.

విశ్వక్ సేన్:
- తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. దేశంలోనే వసూళ్ల పరంగా మనం ముందున్నాం. అయితే కొన్ని రోజులుగా థియేటర్ల దగ్గర సందడి లేదు. కొంత విరామం తరువాత మళ్ళీ మా సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టడం ఎంతో ఆనందంగా ఉంది.

- సినిమా చూసి నిజాయితీగా రివ్యూ ఇవ్వడంలో తప్పులేదు. కానీ కొందరు సినిమా చూడకుండానే రివ్యూ రాస్తున్నారు.  మరికొందరైతే కావాలని నెగటివ్ రివ్యూలు రాస్తున్నారు. అలాంటి రివ్యూలను పట్టించుకోకుండా.. ఎందరో ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ముందుకొస్తున్నారు.

- ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఇలా విశ్వక్ సేన్ సినిమాల ఎంపిక వైవిధ్యంగా ఉందని ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. ఏదైనా ఛాలెంజింగ్ గా ఉంటేనే చేస్తాను. ఇక ముందు కూడా ఇలాగే ప్రేక్షకులకు కొత్తదనం ఉన్న సినిమాలను అందిస్తానని తెలుపుతున్నాను.

- సినిమాకి వస్తున్న స్పందన పట్ల చాలా హ్యాపీగా ఉన్నాము. త్వరలో సక్సెస్ మీట్ ను నిర్వహిస్తాము.

కృష్ణ చైతన్య:
- ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. యువత యాక్షన్ సన్నివేశాలను, డైలాగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. సెకండాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలను బాగా కనెక్ట్ అయ్యామని చెబుతుంటే.. ఎంతో సంతోషం కలిగింది.

- బాలకృష్ణ గారు, వారి కుటుంబం సినిమా చాలా బాగుందని అభినందించడం.. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగించింది.

- అన్ని ఏరియాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫోన్లు రావడం హ్యాపీగా ఉంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, మంచి వసూళ్లు వస్తున్నాయని ఎందరో డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసి తెలిపారు.

- ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తాము.

It’s a great feeling to hear from fans that I am being compared with Jr NTR in Gangs of Godavari: Vishwak Sen.

Response for Gangs of Godavari is incredible, I wish the film continues its success streak in coming weeks: Director Krishna Chaitanya.

Mass Ka Das Vishwak Sen’s latest flick Gangs of Godavari has been receiving amazing response from Telugu audiences after it hit the screens worldwide on Friday. Directed by Krishna Chaitanya, Gangs of Godavari stars Vishwak Sen and Neha Shetty in the lead roles. The film is jointly produced by Suryadevara Naga Vamsi under the banner Sithara Entertainments and  Sai Soujanya under the banner Fortune Four Cinemas, while Srikara Studios presented it.

Speaking during the success meet, Vishwak Sen thanked the audiences for the resounding response towards the film. Here are the excerpts from the press meet.

Asked when fans are praising Vishwak Sen by drawing comparisons with Jr NTR for the character he played in Gangs of Godavari, Vishwak said, “I already happened to hear such comments during the film ‘Paagal’. Yeah, again now, it’s a great compliment from fans and I thank all the fans who have been supporting me since day one.”

Vishwak said that the lorry scene in the film was shot naturally without any dupe or safety gear. “We shot that lorry scene when I climbed atop the lorry from the driving seat when the vehicle was actually moving. It was a challenging one and quite risky too. There were no rope nor safety measures in place when we shot the scene,” he said.

Speaking on the remarks of senior star Balakrishna Nandamuri about him, Vishwak said, “It’s a great feeling when Balayya garu said that I am like his son. I got closer to Balayya garu because of my honesty and dedication to my craft. So that’s a big statement from Nandamuri garu. It is a blessing to me. I was in tears when I heard him saying that, for the next few hours.”

Vishwak said that the Telugu film industry is growing leaps and bounds even though the ticket prices for the Telugu films are reasonably less compared to Bollywood. “I know the pulse of Gangs of Godavari and the response from our distributors has been amazing, so far. We didn’t burn crackers nor did we celebrate the success because of a personal reason at my producers’ house,” he added.

What was the response that you got to see from the audiences?
Director Krishna Chaitanya: The kind of response, so far, that I have been getting from the public is incredible. Women filmgoers felt that the second half was very emotional. Male audiences like the action sequences and interval bang in particular. I am so happy and so confident that Gangs of Godavari will be received well in the coming days. The revenue and the footfalls in theatres in coastal districts has been great.

Vishwak Sen said the Bookmyshow app should carefully gauge the feedback from moviegoers. I wish filter bots are filtered so that good films are not killed. But the majority of audiences don’t really give attention to such reviews. It is not my first film. I’ve been doing films and I’ve amassed a good fanbase. They know what to expect from my movies. Gangs of Godvari is the best example.”

On announcing a sequel to Gangs of Godavari by producer Suryadevara Naga Vamsi, director Chaitanya said the sequel is on the cards for sure and fans would listen to an update regarding the sequel very soon. There will be an announcement on ‘Power Peta’ soon, the director added.

 

WhatsApp Image 2024-05-31 at 20.24.19_9c023694 WhatsApp Image 2024-05-31 at 20.24.19_7bf7901c DSC_1835

Subject: Gangs of Godavari is Vishwak Sen’s finest performance to date – S Naga Vamsi

కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” – కథానాయకుడు విశ్వక్ సేన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 
 
“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం – కథానాయకుడు విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. భారీ అంచనాలతో మే 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు విశ్వక్ సేన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో కాదు, సినిమా పట్ల తమకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ట్రైలర్ లో కొన్ని ఇబ్బందికర సంభాషణలు ఉన్నాయి కదా?
విశ్వక్ సేన్: మా సినిమాలో కేవలం రెండు మూడు మాత్రమే అటువంటి సంభాషణలు ఉన్నాయి. అవి కూడా ట్రైలర్ కే పరిమితం. సినిమాలో మ్యూట్ చేయబడ్డాయి. అందుకే మా సినిమాకి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ట్రైలర్ లో కూడా ఆ సంభాషణలు ఎందుకు పెట్టామంటే.. ఆ పాత్రలలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు నిజాయితీగా పరిచయం చేయడం కోసమే. నిజానికి నేను ఈ సినిమా చేస్తున్న సమయంలో.. ఇది యువతకి మాత్రమే నచ్చేలా ఉంటుంది అనుకున్నాను. కానీ మొత్తం సినిమా పూర్తయ్యి ఫైనల్ కాపీ చూసిన తరువాత.. నాకు ఈ సినిమా విలువ తెలిసింది. ఎక్కడా ఇబ్బందికర సన్నివేశాల ఉండవు. చిన్న పిల్లలతో కలిసి చూడొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కుటుంబ ప్రేక్షకుల సినిమా.
నాగవంశీ: కొందరు ట్రైలర్ లోని కేవలం ఆ రెండు సంభాషణలను ఎందుకు పట్టించుకుంటున్నారో అర్థంకావడంలేదు. ఒక స్లమ్ కుర్రాడు ఎలా మాట్లాడతాడో దానిని నిజాయితీగా చూపించడం కోసం మాత్రమే అలాంటి డైలాగ్ లు పెట్టడం జరిగింది. సినిమాల పట్ల ఎంతో అవగాహన ఉన్న అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ బాగుంది అన్నారు. కథని, పాత్రలను ఫాలో అయితే.. అందులోని ఎమోషన్ మనకి అర్థమవుతుంది.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ఎలా ఉండబోతుంది?
విశ్వక్ సేన్: కమర్షియల్ అంశాలు ఉంటూనే కొత్తగా ఉంటుంది. తెలుగులో ఇదొక కొత్త ఫార్ములాతో వస్తున్న సినిమా. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చూశాక ఒక మంచి సినిమా చేశానని సంతృప్తి కలిగింది. నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
నాగవంశీ: గోదావరి ప్రాంతానికి చెందిన లంకల రత్న అనే ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. కమర్షియల్ అంశాలు ఉంటూనే.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. లంకల రత్న పాత్ర అందరికీ నచ్చుతుంది.
సినిమాలో గోదావరి యాసలో మాట్లాడారు కదా.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
విశ్వక్ సేన్: యాస విషయంలో నన్ను ఎవరూ వేలు పెట్టి చూపించకూడదు అని ముందే అనుకున్నాను. ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా చూసుకొని సంభాషణలు చెప్పాను. యాస విషయంలో ఒక్క శాతం అనుమానం వచ్చినా.. దర్శకుడిని, దర్శక విభాగాన్ని అడిగి తెలుసుకునేవాడిని. నేను మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరిచను. పాత్రకు పూర్తి న్యాయం చేశానని నమ్మకంగా ఉన్నాను. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు ఒకెత్తయితే.. ఈ సినిమా ఒకెత్తు అనేలా ఉంటుంది.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది?
నాగవంశీ: మొదట కృష్ణ చైతన్య ఈ కథని వేరే హీరోతో అనుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అప్పుడు చైతన్య వచ్చి త్రివిక్రమ్ గారిని కలిశారు. అలా త్రివిక్రమ్ గారు ఈ కథ వినమని నాకు చెప్పారు. కథ వినగానే చాలా నచ్చింది. వెంటనే సినిమా చేయాలి అనుకున్నాము.
విశ్వక్ సేన్ నటన గురించి?
నాగవంశీ: ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో విశ్వక్ సేన్ నటన ఒకెత్తయితే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటన ఒకెత్తు. గత ఐదేళ్ళలో మీరు విశ్వక్ నటన చూసింది ట్రైలర్ మాత్రమే. ఈ సినిమాలో విశ్వక్ నటవిశ్వరూపం చూస్తారు. తన వయసుకి మించిన పాత్రలో అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నప్పుడు మీకు తెలియకుండానే లంకల రత్న పాత్రతో కలిసి ప్రయాణం చేస్తారు.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి సీక్వెల్ ఉంటుందా?
విశ్వక్ సేన్: ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది. ఉంటే అందులోనూ నేనే నటిస్తాను.
యువ శంకర్ రాజా గారి ఎంపిక ఎవరిది? సంగీతం ఎలా ఉండబోతుంది?
నాగవంశీ: దర్శకుడు కృష్ణ చైతన్య ఎంపికనే. యువ శంకర్ రాజా స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. అందరి నుంచి మంచి స్పందన లభించింది. ఇక నేపథ్య సంగీతం అయితే అద్భుతంగా ఇచ్చారు. సినిమా చూసిన తరువాత మీరే ఈ విషయాన్ని చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో మీ నటనను పోలుస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
విశ్వక్ సేన్: జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నాకెంతో ఇష్టం. ఆయన నాకు స్ఫూర్తి. కానీ నటుడిగా నా ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎన్టీఆర్ గారు కూడా నన్ను విశ్వక్ సేన్ గానే ఎదిగితే చూడాలని అనుకుంటారు.
 
Gangs of Godavari will be a milestone moment in Telugu cinema – Vishwak Sen
 
Gangs of Godavari is Vishwak Sen’s finest performance to date – S Naga Vamsi
‘Mass Ka Das’ Vishwak Sen is joining hands with Neha Sshetty, Anjali for an intense gangster drama Gangs of Godavari, written and directed by Krishna Chaitanya. Presented by Srikara Studios and produced by S Naga Vamsi, Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas, the film, which has music by Yuvan Shankar Raja, is releasing in theatres on May 31.
Ahead of the release, Vishwak Sen and producer S Naga Vamsi came together for a media interaction.
Excerpts from a chat:
*Vishwak Sen*
- When I signed Gangs of Godavari I imagined it would be catering to the youth, though I didn’t discuss or think too much about it. As I watched the first copy this week, I realised that the film is meant for all age groups – it doesn’t have any vulgarity or cringe moments. A certain section of audiences may get distracted by a couple of dialogues in the trailer, but how one views a film is decided by their taste, upbringing and approach towards life.
- There’s a lot of talk about Telugu cinema going global lately. We too have a taste for films like The Godfather, Scarface and shows like Game of Thrones. It is because they are a product of honest, no-holds-barred filmmaking. Gangs of Godavari too has a fight before intermission without slow motion and background score that’ll blow everyone’s minds. It’s a risk but filmmaking is evolving with time and we must respect that.
- I was conscious about getting the Godavari slang right. I didn’t want anyone to point a finger at my performance and I think I did justice to the role and won’t disappoint you. I don’t want to be labelled as a Telangana actor. Gangs of Godavari will be a milestone moment in Telugu cinema. I’m saying this after a screening yesterday.
- I learnt a lot from Lankala Rathna, he comes across as an unpredictable character, but he is someone with his own set of morals. I related with that side. Gangs of Godavari will most likely have a sequel, but unlike Hit, I will be playing the lead role in it too.
*S Naga Vamsi, Producer*
- If people are finding a few moments in the trailer too direct, they need to understand the rags-to-riches story revolves around the highs and lows in the life of a slum dweller and the tone is decided by his trajectory. Supriya garu (of Annapurna Studios) called to tell me that she really liked the trailer. I presume she understood it too. We can make better films if we’re more open minded.
- Gangs of Godavari is Vishwak Sen’s finest performance to date. What you’ve seen from him in the last five years is a mere trailer. Audiences will be surprised that a young actor has pulled off such a challenging role. Yuvan Shankar Raja’s background score is a major highlight. Lankala Rathna is a character that’ll stay with you after a long time.
- The first half has many high moments, showcasing Rathna’s growth while post intermission focuses on the problems he faces. It has all the commercial highs that a regular viewer expects from a mass film. Apart from Vishwak, the performances of Anjali, Neha Shetty and Goparaju Ramana will be widely talked about.
- The film was to be made by a popular production house, but was shelved later and the director came to me for a narration. I liked it and felt it was a genre we haven’t explored much in the recent times. I called Vishwak, briefed him about the Andhra backdrop and he greenlit it immediately. Vishwak wanted it to be titled Lankala Rathna but I insisted on Gangs of Godavari, I felt the appeal of the story would widen with the title.
DSC_0628

Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ highly anticipated Lucky Baskhar to release on 27th September

దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘లక్కీ భాస్కర్’ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలప్రఖ్యాత నటుడు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్‌ను ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ అనతి కాలంలోనే తన ప్రత్యేకతను చాటుకొని, వివిధ భాషల ప్రేక్షకుల మనసు గెలుచుకొని తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. మలయాళ చిత్ర సీమకే పరిమితం కాకుండా పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు. తన వ్యక్తిత్వం, అణుకువతో కూడిన నటనా నైపుణ్యాలతో దుల్కర్ మలయాళం, తెలుగు, తమిళం అలాగే హిందీ భాషలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ఇప్పుడు దుల్కర్ “లక్కీ భాస్కర్” అనే సాధారణ మనిషికి చెందిన అసాధారణ కథతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ “లక్కీ భాస్కర్” సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా “లక్కీ భాస్కర్” చిత్రం సెప్టెంబర్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.తొలిప్రేమ, సార్/వాతి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల రచయిత-దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి మెస్మరైజింగ్ విజువల్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ నూలి పనిచేస్తున్నారు.

1980- 1990 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు. సాధారణ బ్యాంకు క్యాషియర్ లక్కీ భాస్కర్ యొక్క ఆసక్తికరమైన, అసాధారణమైన జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
ఛాయాగ్రాహకుడు: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ highly anticipated Lucky Baskhar to release on 27th September

Dulquer Salmaan has carved a niche for himself in Indian Cinema. Renowned for his charming personality and irreplicable acting skills, the actor has been one of the most sought after actors in Malayalam, Telugu, Tamil and Hindi languages. Now, he is set to charm the world with an extra-ordinary tale of a common man, “Lucky Baskhar”.

Ever since commencement of the film’s shoot, makers have been releasing regular updates and fans of the actor, movie-lovers have been entangled by each one of them. On 29th May, the makers have made official announcement regarding the release date of the film. The eagerly anticipated film, Lucky Baskhar will release worldwide on   September 27, 2024.

Venky Atluri, the writer-director of blockbuster films like Tholi Prema and Sir/ Vaathi, is directing the film. Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, are producing the film on a lavish scale.  Srikara Studios is presenting it.

Meenakshi Chaudhary is playing the leading lady role opposite Dulquer Salmaan in the film. Renowned composer GV Prakash Kumar is composing music for the film and ace cinematographer Nimish Ravi is delivering mesmerizing visuals. National Award winning production designer Banglan and editor Navin Nooli are working on the film.

Set in late 1980′s and early 1990′s, the film will chronicle the interesting, turbulent and extra-ordinary life journey of a simple bank cashier, Lucky Baskhar. The recently released teaser of the film, on the occasion of Dulquer Salmaan’s birthday, has been able to set right expectations for this film.

Well, the film has now entered in to the final leg of shooting and it will release in Telugu, Malayalam, Hindi and Tamil languages worldwide, theatrically.

LuckyBaskhar-Still