FIRESTORM IGNITES: PAWAN KALYAN’S OG KICKS OFF ITS MUSICAL CAMPAIGN WITH A BANGER

 అగ్ని తుఫాను వచ్చేసింది
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్’ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర ఓజాస్‌ గంభీరగా అలరించనున్న చిత్రం ‘ఓజీ’ (They Call Him OG). పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్’ విడుదలైంది. ఈ గీతం నిజంగానే ఓ అగ్ని తుఫానులా ఉంది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఓజీ’ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాకుడిగా రవి కె చంద్రన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
తమన్‌ స్వరపరిచిన ‘ఫైర్‌ స్టార్మ్’ గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. ఓజాస్‌ గంభీర పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందో తెలిపేలా తమన్ సంగీతం ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. అదిరిపోయే ఎలక్ట్రానిక్ బీట్స్, భారీతనం, రా ఇంటెన్సిటీని మిళితం చేస్తూ సాగిన ఈ గీతం అగ్ని తుఫానుని తలపిస్తోంది.
పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వానికి నివాళి అన్నట్టుగా ధైర్యంతో నిండిన ఈ పాట సాహిత్యం కూడా అద్భుతంగా ఉంది. ప్రముఖ నటుడు శింబు ఈ పాటకు తన శక్తివంతమైన గాత్రాన్ని అందించారు. ఉద్వేగం, ఉత్సాహంతో నిండిన ఆయన స్వరం.. ఈ పాటను మరోస్థాయికి తీసుకొనివెళ్ళింది.
‘ఓజీ’ ఫీవర్ కి ఒక అద్భుతమైన ఆరంభం
‘ఫైర్‌ స్టార్మ్’ గీతం ‘ఓజీ’ సినిమా ప్రమోషన్ కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ ట్రాక్‌ను అభిమానులు ‘బ్యాంగర్’ మరియు ‘సంగీత తుఫాను’గా అభివర్ణిస్తున్నారు. థియేటర్లలో అభిమానులు ఉత్సాహంతో ఈలలు వేసేలా ఫైర్‌ స్టార్మ్ గీతం యొక్క సంగీతం, సాహిత్యం ఉన్నాయి.
విడుదలైన క్షణం నుండే సామజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది ‘ఫైర్‌ స్టార్మ్’ గీతం. రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్, మాస్ సెలబ్రేషన్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది.
‘ఓజీ’ ఫీవర్ లో పవర్ స్టార్ అభిమానులు
సినిమాలోని గ్యాంగ్‌స్టర్ వైబ్‌ కి అద్దంపట్టేలా ఉన్న ‘ఫైర్‌ స్టార్మ్’ గీతంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో సంగీతం ఉందని ప్రశంసిస్తున్నారు. తమన్ ఇప్పటివరకు స్వరపరిచిన అత్యుత్తమ గీతాలలో ఒకటిగా దీనిని అభివర్ణిస్తున్నారు.
‘ఫైర్‌ స్టార్మ్‌’ గీతం విడుదలతో ‘ఓజీ’ సంగీత ప్రచారం అధికారికంగా ఘనంగా ప్రారంభమైంది. దీంతో సినిమా నుంచి తదుపరి రాబోయే కంటెంట్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో తెలిపేలా ‘ఫైర్‌ స్టార్మ్’ గీతం ఉంది. వెండితెరపై అద్భుతమైన ఓ భారీ యాక్షన్ సినిమాని చూడబోతున్నామనే హామీని ఈ పాట ఇచ్చింది.
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: డీవీవీ దానయ్య
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
 
FIRESTORM IGNITES: PAWAN KALYAN’S OG KICKS OFF ITS MUSICAL CAMPAIGN WITH A BANGER 
The much-awaited first single from OG (They Call Him OG), titled “Firestorm,” has finally been unleashed, and it is nothing short of a musical inferno.
Directed by Sujeeth and produced by DVV Danayya under DVV Entertainment, OG stars Power Star Pawan Kalyan in a fierce gangster avatar alongside Emraan Hashmi, Priyanka Mohan, Arjun Das, and Prakash Raj in key roles.
Composed by the musical dynamite Thaman S, Firestorm is a high-octane anthem that blends hard-hitting electronic beats, cinematic grandeur, and raw intensity. The lyrics, packed with swagger and grit, celebrate the unrelenting power of the OG, making it a perfect tribute to Pawan Kalyan’s larger-than-life persona.
Adding to the hype is Silambarasan TR (Simbu), who has lent his powerful vocals to the track. His voice, packed with fire and emotion, elevates the song to a whole new level.
A Perfect Kickoff to #OG Fever
The launch of Firestorm marks a key milestone in OG’s promotions. The track has been described by fans as a “banger” and “musical storm” that captures the rebellious spirit of the film. The hook line and pulsating beats are tailor-made for fans to whistle, cheer, and chant along in theatres.
From the moment of release, social media has been flooded with reels, fan edits, and mass celebrations, proving that Firestorm is already a cultural phenomenon.
Fans Go Berserk: The OG Fever Takes Over
Pawan Kalyan fans have hailed the song as a battle cry, perfectly complementing the gangster vibe of the movie. The track has drawn comparisons to global anthems of rebellion, with many calling it one of Thaman’s finest works.
With Firestorm, the film’s musical campaign has officially kicked off in style, and expectations have skyrocketed for what’s to come next.
With the film set to hit theatres worldwide on September 25, 2025, Firestorm serves as the perfect appetizer to the high-voltage cinematic spectacle that OG promises to be.
Cast: Pawan Kalyan, Emraan Hashmi, Priyanka Mohan, Arjun Das, Prakash Raj, Sriya Reddy
Director: Sujeeth
Music Composer: Thaman S
Cinematography: Ravi K. Chandran
Editor: Navin Nooli
Production House: DVV Entertainment
Producer: DVV Danayya

MMM_45558 (1) OG RAIN POSTER FINAL WWM 2 (1)

After Chartbuster “Kattanduko Janaki,” Mithra Mandali Unveils Fun-Filled Second Single “Swecha Standuu”

మిత్ర మండలి’ నుంచి రెండవ గీతం ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదల

‘కత్తందుకో జానకి’ శైలిలో ‘మిత్ర మండలి’ నుంచి మరో సరదా గీతం ‘స్వేచ్ఛ స్టాండు’

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘కత్తందుకో జానకి’ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదలైంది.’మిత్ర మండలి’ నుంచి మొదటి గీతంగా విడుదలైన ‘కత్తందుకో జానకి’ అందరూ సరదాగా పాడుకునేలా ఉండి, సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు రెండవ గీతంగా వచ్చిన ‘స్వేచ్ఛ స్టాండు’ కూడా అంతే సరదాగా ఉంది.ఆర్.ఆర్. ధృవన్ స్వరపరిచిన ఈ పాటకు ఆర్.ఆర్. ధృవన్, విజయేందర్ ఎస్ సంయుక్తంగా సాహిత్యం అందించారు. తేలికైన ఇంగ్లీష్ పదాలతో సరదా సరదాగా ఈ గీత రచన ఉంది. ‘వై దిస్ కొలవెరి’ శైలిలో సాగిన ‘స్వేచ్ఛ స్టాండు’ గీతం.. ఆ పాట శైలిలోనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించేలా ఉంది.

ధనుంజయ్ సీపాన, ఆర్.ఆర్. ధృవన్ ల గానం ఈ పాటను ఉత్సాహభరితంగా మార్చింది. కథానాయిక దృష్టిలో పడటం కోసం కథానాయకులు వచ్చీరాని ఇంగ్లీష్ పదాలతో పాట పడటం భలే సరదాగా ఉంది. ముఖ్యంగా ఈ తరం శ్రోతలకు నచ్చేలా ‘స్వేచ్ఛ స్టాండు’ గీతం సాగింది.

వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఛాయాగ్రాహకుడిగా సిద్ధార్థ్ ఎస్.జె, కళా దర్శకుడిగా గాంధీ నడికుడికర్ వ్యవహరిస్తున్నారు. పీకే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్స, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

టీజర్, ‘కత్తందుకో జానకి’ గీతం ఆకట్టుకొని ‘మిత్ర మండలి’ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు ఈ ‘స్వేచ్ఛ స్టాండు’ గీతం ఆ అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పవచ్చు.

‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. బాధలన్నీ మర్చిపోయి, థియేటర్లలో మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.

చిత్రం: మిత్ర మండలి
తారాగణం: ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్.ఎం.
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్.జె
కూర్పు: పీకే
కళా దర్శకుడు: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్‌: శిల్పా టంగుటూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రాజీవ్ కుమార్ రామా
దర్శకత్వం: విజయేందర్ ఎస్
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స
సమర్పణ: బన్నీ వాస్ (బి.వి. వర్క్స్)
నిర్మాణ సంస్థలు: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

 

 After Chartbuster “Kattanduko Janaki,” Mithra Mandali Unveils Fun-Filled Second Single “Swecha Standuu”
After the rousing applause for the teaser and the roaring success of the first single Kattanduko Janaki, the makers of Mithra Mandali proudly unveil their second single “Swecha Standuu”.Composed by RR Dhruvan, with lyrics jointly written by RR Dhruvan and the film’s director Vijayendar S, this is a quirky, light-hearted proposal track that delightfully experiments with broken-English expressions and playful storytelling. Channeling a Kolaveri Di-like energy, Swecha Standuu stands out as a genre-defying number, filled with youthful spirit and humor.The vocals by Dhanunjay Seepana and RR Dhruvan lend a vibrant and relatable tone to this track, which is expected to strongly resonate with Gen Z audiences.

Presented by Bunny Vas under BV Works and produced by Sapta Aswa Media Works & Vyra Entertainments, Mithra Mandali stars Priyadarshi, Niharika NM, Vishnu Oi, Rag Mayur, Prasad Behara, with an ensemble that also includes Vennela Kishore, Satya, and VTV Ganesh.

Technically, the film continues to shine with contributions from:
RR Dhruvan – Music
Siddharth SJ – Cinematography
Peekay – Editing
Gandhi Nadikudikar – Production Design
Shilpa Tanguturu – Costumes

“Swecha Standuu” arrives on the heels of an outstanding reception to the teaser and the foot-tapping Kattanduko Janaki, both of which gave audiences a glimpse into the quirky world of Mithra Mandali.

Produced by Kalyan Manthina, Bhanu Pratapa & Dr. Vijender Reddy Teegala, with Somaraju Penmetsa as Co-Producer and Rajeev Kumar Rama as Executive Producer, the film promises a refreshing cinematic experience laced with humor, relatability, and heart.

 
 Here’s the ‘Never Before’, Most Quirkiest “Proposal Song of the Year” #SwechaStanduu from #MithraMandali  english Song out now
OUT NOW plain OUT NOW TWITTER

Kingdommis performing exceptionally well at the box office said producer Suryadevara Naga Vamsi.

కింగ్‌డమ్’ చిత్రం.. ఇది ప్రేక్షకుల విజయం : సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందంఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది : కథానాయకుడు విజయ్ దేవరకొండ

‘కింగ్‌డమ్’ వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి : నిర్మాత సూర్యదేవర నాగ వంశీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్‌డమ్’ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ నేడు(జూలై 31) విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ‘కింగ్‌డమ్’ సినిమా వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులను మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించిన చిత్ర బృందం, తమ ఆనందాన్ని పంచుకుంది.

ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ సినిమాకి వస్తున్న స్పందన పట్ల మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. యూఎస్ ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రాత్రి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఫోన్ చేసి ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతున్నారు. మీ అందరి ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది. మీడియా సపోర్ట్ కూడా మరిచిపోలేను. నా తెలుగు ప్రజలు నా వెనుక ఎంత ఉన్నారో నిన్నటి నుంచి చూస్తున్నా. అభిమానులు సినిమా కోసం ఎంతలా మొక్కుకున్నారో, ఎంతలా సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ విజయాన్ని ప్రేక్షకుల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. తెలుగు ప్రేక్షకులతో పాటు యూఎస్ ఆడియన్స్ ని కూడా త్వరలో కలుస్తాను. గురువారం విడుదలంటే నేను మొదట భయపడ్డాను. కానీ, నాగవంశీ గారు ఈ సినిమా నమ్మి గురువారం విడుదల చేశారు. ఇప్పుడు ఆయన నమ్మకం నిజమైంది. సినిమాకి నా నటనకు ఇన్ని ప్రశంసలు రావడానికి కారణం దర్శకుడు గౌతమ్. టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్ అన్నకి, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. “మేము అనుకున్నట్టుగానే సినిమాకి మంచి స్పందన వస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో సాంకేతికంగా ఇంత గొప్పగా ఉన్న సినిమా ఇదేననే మాటలు వినిపిస్తుండటం సంతోషంగా ఉంది. ఒక తెలుగు సినిమాని సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో తీశాము. థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విజయ్ దేవరకొండ గారి అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమాతో ఆయన హిట్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. అనిరుధ్, నవీన్ నూలి సహా అందరూ ఎంతో ఎఫర్ట్ పెట్టి సినిమా కోసం పని చేశారు. మేము మంచి కంటెంట్ ని అందించాము, దానిని ప్రేక్షకుల్లోకి తీసుకొని వెళ్ళడానికి మీడియా ఎంతో సపోర్ట్ చేసింది. సినిమా వసూళ్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మొదటి రోజే చాలా చోట్ల బిజినెస్ చేసిన దానిలో సగానికి పైగా రాబడుతోంది. మాకు మరో విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు.” అన్నారు.

నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ కి వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉంది. సినిమాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. ఈ చిత్రంతో నా సోదరుడు విజయ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ గెలిస్తే నేను గెలిచినట్లే. సొంతంగా వచ్చి ఏదో సాధించాలి అనుకునే ఎందరికో విజయ్ స్ఫూర్తి. అలాంటి విజయ్ గెలవడం ఆనందంగా ఉంది. నాగవంశీ గారు డేరింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడే సినిమాలను రిస్క్ చేసి తీస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారి ధన్యవాదాలు. గౌతమ్ ఈ కథ చెప్పగానే.. ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి అనుకున్నాను. బ్రదర్ సెంటిమెంట్ గురించి, ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ ల గురించి అందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. వంశీ గారు అన్నట్టు.. ఈ సినిమా హాలీవుడ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. కింగ్‌డమ్ ఇచ్చిన ఉత్సాహంతో ప్రేక్షకులకు మరిన్ని మంచి సినిమాలు అందిస్తాను.” అన్నారు.

నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. “ఇది నా మొదటి సక్సెస్ ప్రెస్ మీట్. ప్రేక్షకులతో కలిసి కింగ్‌డమ్ చూశాను. ఈ సినిమాకి, ఇందులో నా పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది. ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూసి అనుభూతి చెందాల్సిన చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
కళా దర్శకుడు: అవినాష్‌ కొల్లా
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

 

Kingdom Movie – A Success Celebration for the Audience: Team Shares Joy at the Success Press Meet“This success is possible only because of the blessings of Lord Venkanna and the love of the audience,” said lead actor Vijay Deverakonda.

Kingdommis performing exceptionally well at the box office said producer Suryadevara Naga Vamsi.

The muchnawaited film Kingdom finally hit theatres worldwide today (July 31). Starring Vijay Deverakonda in the lead and directed by Gowtam Tinnanuri movie features Satyadev and Bhagyashri Borse in key roles. Presented by Srikara Studios film has been prestigiously produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas. Rockstar Anirudh Ravichander has composed the music.

Released amidst massive expectations Kingdom received highly positive talk right from the very first show. The film set against the backdrop of brotherhood unfolds as a gangster drama and offers a fresh cinematic experience on the big screen. Audiences have been praising the film’s stunning visuals and impactful storytelling. Along with critics’ appreciation movie is drawing audiences in large numbers and increasing its collections show by show.

The team held a press meet to share their happiness about the film’s success.

Vijay Deverakonda said:
I can’t express in words how happy I am with the response for Kingdom. The positive talk started right from the US premieres. Since last night, my phone hasn’t stopped ringing – so many people have called me emotionally saying Anna, we’ve delivered a hit!

This success is possible only because of your love and the blessings of Lord Venkanna Swamy. I will never forget the support of the media as well.

Seeing how much my Telugu people are standing by me since yesterday is overwhelming. I’ve seen how much the fans prayed for the film and how they are celebrating it now.

I want to celebrate this success with the audience. Along with my Telugu fans, I’ll also be meeting the US audience soon.

Initially, I was worried about the Thursday release date. But Naga Vamsi garu had full faith in the film, and his belief has now come true.

The credit for all the appreciation I’ve been receiving for my performance goes to director Gowtam.

My heartfelt thanks to NTR anna for lending his voice over to the teasernand to all the fans and Telugu audience for this immense support.

Producer Suryadevara Naga Vamsi said:
As we expected, the film is getting a tremendous response. Reviews are also highly positive. It feels great to hear people say that this is one of the finest technically made Telugu films in recent times.

We have created a Telugu film on par with Hollywood standards. Please come to the theatres and watch it you will definitely enjoy it!

I’m extremely happy that Vijay Deverakonda delivered a hit that his fans have been eagerly waiting for. Anirudh, Navin Nooli and the entire team have put in a huge effort for this film.

We have delivered great content and the media has supported us immensely in taking it to the audience.

The collections are phenomenal on the very first day we have already recovered more than half of the business in several areas. Heartfelt thanks to the audience for giving us another success.

Actor Satyadev said:

I’m really happy with the overwhelming response for Kingdom. Thank you all for showering so much love on the film.

It gives me immense joy that my brother Vijay has made such a strong comeback with this film. When Vijay wins, it feels like I’ve won too.

Vijay is an inspiration to so many people who want to achieve something on their own. It’s amazing to see him succeed like this.

Naga Vamsi garu is a daring producer – he always takes the risk of producing films that others might hesitate to. My heartfelt thanks to him for giving me this opportunity.

The moment Gowtam narrated the story, I knew I had to be a part of this film.

People are talking so positively about the brother sentiment and the performances of all the artists. As Vamsi garu said, this movie offers a Hollywood level experience.

With the energy that Kingdom has given me, I promise to bring more good films to the audience.

Actor Venkatesh said:
This is my first success press meet. I watched Kingdom along with the audience and I’m extremely happy with the response to both the film and my role in it.

This is definitely a movie that must be experienced in theatres. It has all the elements that will impress audiences of every section.

Please watch the movie in theatres and enjoy it to the fullest!

Cast & Crew:
Cast: Vijay Deverakonda, Satyadev, Bhagyashri Borse, Venkatesh
Director: Gowtam Tinnanuri
Producers: Suryadevara Naga Vamsi, Sai Soujanya
Music: Anirudh Ravichander
Cinematography: Jomon T. John ISC, Girish Gangadharan ISC
Costume Designer: Neeraja Kona
Art Director: Avinash Kolla
Editor: Navin Nooli
Production Houses: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios
PRO: Lakshmi Venugopal

GANI0465 GANI0455 GANI0442 GANI0433

“We’ve cleared our first big test with Kingdom”: Producer Suryadevara Naga Vamsi

కింగ్‌డమ్’ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి: కథానాయకుడు విజయ్ దేవరకొండ‘కింగ్‌డమ్’ విషయంలో మేము మొదటి పరీక్షలో పాస్ అయ్యాము: నిర్మాత సూర్యదేవర నాగ వంశీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. రేపు(గురువారం) ‘కింగ్‌డమ్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “సినిమా అవుట్ పుట్ పట్ల మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. బుకింగ్స్ కి వస్తున్న అద్భుతమైన స్పందన చూసి మాకు సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న భరోసాతోనే.. మేము సినిమా విడుదల ముందు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. ‘జెర్సీ’ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ ఇది. ఈ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో, ప్రేమ కోసమో ఉంటుంది. ఈ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు ‘కింగ్‌డమ్’ ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి అనుభూతిని ఇస్తుంది.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. “ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము పాస్ అయ్యాము. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలి ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం మీకు తెర మీద కనిపిస్తుంది.” అన్నారు.

కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ లో మధు అనే కథకు కీలకమైన పాత్ర పోషించాను. గౌతమ్ గారు పాత్రను అద్భుతంగా మలిచారు. విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
కళా దర్శకుడు: అవినాష్‌ కొల్లా
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

“Emotions in Kingdom Will Strike a Chord with Everyone” : Actor Vijay Deverakonda“We’ve cleared our first big test with Kingdom”: Producer Suryadevara Naga Vamsi

The highly anticipated Telugu film Kingdom, starring Vijay Deverakonda in the lead role, is all set to hit the screens worldwide on July 31st. Also starring Bhagyashree Borse and Satyadev in key roles, the film is directed by Gowtam Tinnanuri and jointly produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, with Srikara Studios presenting the project. Rockstar Anirudh Ravichander has composed the music.

Audiences have built massive expectations around Kingdom, especially after the impressive response to its promotional material. The trailer, in particular, has elevated the buzz to new heights.

As the film gears up for release tomorrow (Thursday), the team interacted with media at a press meet.

Speaking at the event, Actor Vijay Deverakonda said:

“We are extremely satisfied with the film’s output and deeply moved by the phenomenal response we’re seeing in pre-bookings. Thanks to the unwavering support of Telugu audiences, we’re able to face the release with a calm confidence.

Kingdom is helmed by Gowtam Tinnanuri, the same filmmaker who gave us Jersey. The emotional depth in Kingdom will completely captivate audiences. Every war in history has been fought for family, homeland, or love — and this one is no different.

Kingdom is a story deeply rooted in family emotions. Within just two minutes of the film’s start, audiences will be pulled into the world we’ve created. It’s a film that promises a heartfelt experience for everyone who steps into the theatre.”

Producer Suryadevara Naga Vamsi added:

“In the current climate, it’s becoming increasingly challenging to open strong at the box office — but we’re glad to say Kingdom has passed its first test. The advance bookings have been very encouraging, and we’re hopeful for a successful run with solid collections.

This isn’t a conventional action film — it carries Gowtam Tinnanuri’s signature emotional depth. It’s a gangster drama with wide appeal, crafted to resonate with audiences across all sections.

What makes Kingdom special is that we didn’t rely on sets — most of it was shot in real locations. The effort and dedication of our team will be evident on screen.”

Lead actress Bhagyashree Borse shared:

“I play Madhu, a crucial role in the story. I’m grateful to Gowtam sir for writing such a beautifully layered character. It was a joy working alongside Vijay, and I truly hope audiences love the film.”

Cast: Vijay Deverakonda, Satyadev, Bhagyashree Borse
Director: Gowtam Tinnanuri
Producers: Suryadevara Naga Vamsi, Sai Soujanya
Music: Anirudh Ravichander
Cinematography: Jomon T. John ISC, Girish Gangadharan ISC
Costume Designer: Neeraja Kona
Production Design: Avinash Kolla
Editor: Naveen Nooli
Production Houses: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios
PRO: Lakshmi Venugopal

GANI9916 GANI9898 (1)

Sithara Entertainments is shifting gears with its ambitious Production No.36 starring the Divine star Rishab Shetty.

డివైన్ స్టార్ రిషబ్ శెట్టితో భారీ చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్ నెం.36 లో కథానాయకుడిగా రిషబ్ శెట్టి

అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా

ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన చిత్రాలను అందిస్తూ, వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇప్పుడు ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది.

‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ అగ్ర కథానాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘కాంతార 2′ చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్న రిషబ్, ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం సితారతో చేతులు కలిపారు. 18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది.

మంచి కథకుడిగా పేరు గాంచిన, ప్రతిభావంతులైన అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయన ఓ అద్భుతమైన కథతో ప్రేక్షుకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషలలో ఏక కాలంలో చిత్రీకరించబడుతుంది. తెలుగు, కన్నడతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

ప్రొడక్షన్ నెం.36 గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు.

కేవలం ప్రకటనతోనే భారతీయ సినిమాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు.

తారాగణం: రిషబ్ శెట్టి
దర్శకత్వం: అశ్విన్ గంగరాజు
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

 
Sithara Entertainments is shifting gears with its ambitious Production No.36 starring the Divine star Rishab Shetty.Sithara Entertainments Known for delivering some of the biggest blockbusters in recent times and continues to push boundaries with the kind of films it brings to audiences. Now they are back with another magnum opus.

The makers have officially announced this grand project with versatile Rishab Shetty who’s one of the most celebrated stars in Kannada cinema and the face behind the phenomenon Kantara. As he gears up for Kantara 2, Rishab joins hands with Sithara Entertainments for a fictional historical action drama set in the turbulent Bengal province of 18th century Bharat a time when a rebel began to rise.

The film will be directed by the talented Ashwin Gangaraju widely appreciated for his gripping storytelling. This time he is set to present an even larger than life saga.

The film will be shot simultaneously in Telugu & Kannada and will release in Telugu, Kannada, Tamil, Hindi and Malayalam.

Production No.36 is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners Sithara Entertainments and Fortune Four Cinemas. Presented by Srikara Studios. With such a stellar team coming together it’s going to be a crazy adventure.

Anticipation is already sky high for what promises to be one of the most talked about projects in Indian cinema. Stay tuned for more updates coming in the future.

PROD_36_TWTR PROD_36_TWTR_PLAIN